జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 12 54

“మామయ్య ఆకలి” అని చిన్నా అరవగా , అందరి పరిస్థితి కూడా అలాగే ఉండటంతో హాట్ బాక్స్ తెరువగా వెచ్చటి గాలి చేతులకు తాకగా , అయితే పూర్తిగా చల్లారిపోలేదు అని అన్ని ఐటమ్స్ ను అందరికి అందేట్లుగా మధ్యలో తీసి పెడుతుండగా ,మహి ప్లేట్స్ కవర్ తెరిచి వాటిని నీళ్ల బాటిల్ తో కడిగి అత్తయ్యకు తప్ప అందరికి ఒక్కొక్కటి ఇవ్వసాగింది. అందరూ నీళ్లతో చేతులు కడుక్కొని కూల్ డ్రింక్ బాటిల్ లను మరియు నీళ్ల బాటిల్ లను మధ్యలో పెట్టగా, ఎవరికి కావాల్సినవి వాళ్ళు పెట్టుకుని మొదట అందరూ అత్తయ్యకు తినిపించగా ఒక్కసారిగా అత్తయ్య కళ్లల్లో ఆనందంతో నీళ్లు రాసాగాయి.

పిల్లలు వాళ్ళ వాళ్ళ స్కూల్లో జరిగిన సంఘటనలను చెబుతూ జోకులు వేసుకుంటూ చుట్టూ ప్రకృతి అందాలను తిలకిస్తూ అత్తయ్యకు తినిపిస్తూ తాము తినసాగాము. ఆ సంతోష సమయంలో తెచ్చినవన్నీ ఎముకలతో సహా ఖాళీ అయిపోయాయి , ఇంకా ఎన్ని ఉన్నా ఆ ఊపులో అయిపోగొట్టేవాళ్ళము.

తిన్న ప్లేట్ లన్ని ఒక పెద్ద కవర్ లో వేసి , కింద అక్కడక్కడ చల్లినదంతా దానితోనే వేసి గంటా కట్టి కారు డిక్కీలో పెడుతుండగా అది చూసి చిన్నా నా దగ్గరికి వచ్చి “మామయ్య దానిని పారేయచ్చుగా” అని అడుగగా, చిన్నాను ఎత్తుకొని “చూడు చిన్నా ఈ ప్లేస్ నీకు బాగా నచ్చిందా?” , “సూపర్ మామయ్య” , “అందుకే మనం ఇక్కడ ఎటువంటి చెత్త పారేయ్యకుండా మున్ముందు వచ్చేవాళ్లకు కూడా ఇలాగే అందంగా కనిపించాలి”, అని చెప్పగా “అర్థమయ్యింది మామయ్య ,నాకు స్కూల్ అంటే కూడా చాలా ఇష్టం మామయ్య ఇప్పటి నుండి మా స్కూల్ లో కూడా ఎలాంటి చెత్త పారవేయ్యను” అని మాట ఇచ్చాడు.

“Thats my boy” అని చెంపపై గట్టిగా ముద్దు పెట్టి , ice క్రీమ్ లు కరిగిపోతాయని అందరికి ఇచ్చి అత్తయ్య ఒడిలో తల పెట్టి ముందుకు కాళ్ళు చాపి వాలిపోగా అత్తయ్య నా వెంట్రుకలలో ఎడమ చేతి వేళ్ళు దూర్చి ప్రేమగా నిమారసాగింది. మహి నా కాళ్ళ దగ్గర కూర్చొని నా కాళ్ళను తన తొడలపై వేసుకొని ఆనందగా ఒత్తసాగింది.

1 Comment

Comments are closed.