జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 12 54

దివ్య కృష్ణ ఒక్కగానొక్క అక్క , చిన్నప్పటి నుండి మేము ముగ్గురం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లా చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళము. దివ్య మా ఇద్దరి కంటే 4 సంవత్సరాలు పెద్దదైనా , తన కంటే మరియు కృష్ణ గాడి కంటే నేను చాలా ఎత్తుగా ఉండటంతో , తనకు అన్నయ్య గాని , అక్కయ్య గాని లేకపోవడంతో, కృష్ణ గాడిని తమ్ముడు అని , నన్ను అన్నయ్య అని తమాషాకు పిలవడం మొదలుపెట్టగా నాకు కూడా తొడబుట్టిన వాళ్ళు ఎవరు లేకపోవడంతో ఆ పిలుపు విన్నప్పుడల్లా తన కోసం ఏమైనా , ఏదైనా చేయొచ్చని నా మనసులో బలంగా అనుకొనగా నేను అక్క అంటూ , తను అన్నయ్య అంటూ పలకరిస్తూ అదే అలవాటుగా మారిపోయింది.

చిన్నప్పటి నుండి తనకు ఎప్పుడు నేనే సపోర్ట్ గా నిలబడేవాడిని , చాలా సార్లు తన విషయాలలో అంటీ , అంకుల్ ల తోనే గోడవపడ్డాను తనంటే చెప్పలేనంత ఇష్టము , తనకు కూడా కృష్ణ కంటే నేనే ఎక్కువ ఇష్టము.

దివ్యక్క ఏమిటిదంతా అంటీ , అంకుల్ మరియు కృష్ణ ఎక్కడ , అసలు ఏమి జరిగింది , అందరూ వుండి ఎందుకిలా రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నావు అని అడుగగా, నన్ను గట్టిగా హత్తుకుపోతూ ఇంకా ఎక్కువగా దుక్కిస్తూ ఏడవడం మొదలుపెట్టగా , తన భుజం పై చెయ్యి వేసి అలా గుడి ఆవరణం లోకి పిలుచుకొని వెళ్లి మెట్లపై కూర్చోబెట్టి నా రెండు చేతులతో కన్నీళ్లను తుడిచి తన పక్కనే కూర్చోగా , కొద్దిసేపు ఏడ్చి నా భుజం పై తల వాల్చి , నేను కిషోర్ కాలేజ్ లో మూడేళ్ళుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాము, వాళ్ళ నాన్న మన సిటీ లోనే బాగా డబ్బున్న పెద్ద కాంట్రాక్టర్, మా ఇంజనీరింగ్ అయిపోయిన తరువాత తనకి వారం ముందు హైద్రాబాద్ లో జాబ్ వచ్చింది.

దాంతో ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టగా అతడు నన్ను ప్రేమిస్తున్నట్లుగా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పగా ఆరోజు సాయంత్రమే వాళ్ళ నాన్నగారు ఇంటికి వచ్చి నన్ను చూసి మా అబ్బాయికి నచ్చితే మాకు కూడా నచ్చినట్లే అని చెప్పగా అమ్మ నాన్నలు నన్ను అడిగి నేను అవును అని చెప్పగా సంతోషిస్తుండగా కానీ 50 లక్షలు కట్నం కావాలి అని అడుగగా , అమ్మ నాన్నలకు ఒక్కసారిగా అంత డబ్బు ఆడిగేసరికి కాళ్ళు చేతులు ఆడక తాము ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాళ్ళము , మా దగ్గర అంత డబ్బు లేదు పిల్లల మనసు అర్థం చేసుకొని వాళ్ళ పెళ్లిని జరిపించమని ప్రాధేయపడగా డబ్బు ఇస్తేనే పెళ్లి లేకపోతే మా వాడికి వేరే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని ఖరాఖండిగా చెప్పేసి వెళ్ళిపోయాడు.

1 Comment

Comments are closed.