జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 12 54

అంటే నేను మీకు పరాయి వాణ్ణి అయిపోయానా , అందుకేనా వారం నుండి అంకుల్ మరియు అంటీ బాధపడుతూ , ఆ కృష్ణ గాడయితే ఫోన్ కూడా ఎత్తటం లేదు అని కన్నీళ్లు కారుస్తూ బాధగా అడుగగా , నన్ను గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ నువ్వంటే నాకే కాదు ఇంట్లో అందరికి చాలా ప్రేమ అన్నయ్య అందుకే మీకు కూడా చెప్పి భాధపెట్టడం ఎందుకని చెప్పలేదు.

మమ్మల్ని క్షమించు అన్నయ్య అని బాధతో అడుగుతుండగా , మా దగ్గరికి కిషోర్ రాగా , పైకి లేచి బావ గారు అని ఆప్యాయంగా పిలిచి బావ గారు అని పిలవచ్చు కదా అని అడుగగా , పిలవొచ్చు బావ అని సంతోషనగా నన్ను కౌగిలించుకొని వెనుకకు జరుగగా , మీరు ఎంత మంచివారో తెలిసింది.

మీ పెళ్లి ఆపినందుకు నన్ను క్షమించండి . మా అక్క పెళ్లి ఇలా రహస్యంగా అమ్మ , నాన్నలు మరియు బంధువులు లేకుండా గుడిలో జరగడం నాకు ఇష్టం లేదు. నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి , మొత్తం సెట్ చేస్తాను , ఒకవేళ అలా జరగకపోతే మీ ఇష్టం అని ప్రాధేయపడుతూ అడుగగా , సరే బావ మా పెళ్లి అలా జరుగుతుందంటే ఎన్ని రోజులైనా తన కోసం ప్రేమగా ఎదురుచుస్తూనే ఉంటాను అని చెప్పగా ,బావ మీ నాన్న గారి గురించి చెప్పమనగా, మా నాన్న గారు ప్రేమకు ఏమాత్రం వ్యతిరేకం కాదు.

మా అక్కయ్య ఒక వ్యక్తిని ప్రేమించానని చెప్పగా , వాళ్ళు మధ్య తరగతి అని తెలిసినా మా అక్క సంతోషం కోసం 50 లక్షలు కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసాడు. మా నాన్న గారు దివ్య వాళ్లకు డబ్బు లేకున్నా నేను ఒప్పించేవాన్ని కానీ , మా నాన్న స్నేహితులు కూతురికే 50 లక్షలు కట్నం ఇచ్చావు ,మా కొడుకులు అంతంత మాత్రం ఉంటేనే కోటి రూపాయల దాకా కట్నం తీసుకొని పెళ్లి చేసాము, నీ కొడుక్కి ఏమి తక్కువ ఇంకా ఎక్కువే కట్నం వస్తుంది అని పదే పదే చెప్పి మార్చివేశారని అమ్మ నాకు చెప్పింది.

1 Comment

Comments are closed.