జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 12 54

రూమ్ లోపల అత్తయ్య గాజుల చప్పుడు వినిపించగా వెంటనే నన్ను వదిలి ఆత్రంగా మెట్లు దిగి వెళ్లిపోతుండగా , మహి జాగ్రత్త నెమ్మది అని చెబుతుండగా వెనక్కు తిరిగి చూడకుండా వంట గదిలోకి తుర్రుమంది.

అత్తయ్య రెడి అయ్యి బయటకు వస్తూ నా చెంపపై గట్టిగా ముద్దు పెట్టి , బుజ్జి త్వరగా రెడి అయ్యి కిందకు వచ్చెయ్యి వేడి వేడిగా tiffen చేస్తాను అని చెప్పి వడివడిగా వంట గదిలోకి వెళ్లగా , లోపలికి వెళ్లేసరికి మహి ఇడ్లీలు హాట్ బాక్స్ లో పెడుతూ , కాగుతున్న నూనెలో వడలు వేస్తుండగా చాలా చాలా సంతోషిస్తూ మహి దగ్గరికి వెళ్లి కాళ్ళల్లో ఆనంద భాస్పాలు నింపుకొని మహి అని పీలుస్తూ ఆనందంతో తలపై ముద్దు పెట్టి వదలను తిప్పేస్తూ సహాయం చేసి 10 నిమిషాలలో అన్ని హాట్ బాక్స్ లలో పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతుండగా , కొత్త బట్టలు జీన్స్ ప్యాంట్ మరియు టీ షర్ట్ వేసుకుంటుండగా కొనేటప్పుడు చూడలేదు టీ షర్ట్ కు వెనుక మంకీ క్యాప్ లాగా ఉండగా వేసుకొని కిందకు రాగా , అత్తయ్య బుజ్జి tiffen రెడి అని చెప్పగా , చిన్నా తప్ప అందరూ కనిపించగా , చిన్నా ఎక్కడ అని అడుగగా నేను చూపిస్తా మామయ్య అని వర్షిని బయటకు లాక్కొని వెళ్లగా , చిన్నా నవ్వుతూ సైకిల్ తొక్కుతూ ఉండగా పాత సైకిల్ ఉన్నవాడు తోస్తూ , చిన్నా చిన్నా ప్లీస్ నాకు ఒక రౌండ్ ఇవ్వరా అని బతిమిలాడుతుండగా సైకిల్ దిగి నేను నీలాగా కాదు అన్న ఇందా ఎన్ని రౌండ్ కావాలంటే అన్ని రౌండ్ లు తొక్కు అని ఇవ్వగా , వాడు పశ్చాఅత్తాపం పడుతూ sorry రా ఇంకెప్పుడు అలా చెయ్యను అని చెబుతుండగా , గర్వంతో చిన్నా పులకించిపోతుండగా నన్ను చూసి మామయ్య సైకిల్ సూపర్ అని పరిగెత్తుకుంటూ వస్తుండగా , చిన్నాకు ఉన్న మంచి గుణానికి ఆనందిస్తూ ఎగురుతున్న చిన్నాను అమాంతం పట్టుకొని బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టి పదా tiffen తిందామని ఎత్తుకొని లోపలికి వెళ్లి డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో చిన్నాను కూర్చోబెట్టి నేను పక్కనే కూర్చోగా , అత్తయ్య మరియు మహి వడ్డించబోగా అందరూ కూర్చోండి అందరూ కలిసి తిందామని పైకి లేచి వాళ్ళను కూడా కూర్చోబెట్టి వడ్డించుకొని వేడి వేడిగా అత్తయ్యకు తినిపిస్తూ నవ్వుతూ మాట్లాడుతూ అందరూ తినసాగాము.

9 గంటల కల్లా అందరూ తినెయ్యగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కారు తాళాలు అందుకొంటుండగా , మహి బావ స్కూటీని మొదట నువ్వే నడపాలి అని ముద్దుగా చెప్పగా , అయితే అత్తయ్య స్కూటీ లో వెళదామా అని అడుగగా ఉత్సాహంగా తల ఊపగా బయటకు వస్తూ , అంతలోపు కారులో ఉన్న కొత్త బట్టలన్నీ లోపల పెట్టేయ్యండి అని చెప్పి క్లినిక్ కు వెళ్లగా డాక్టర్ చేతిని బాగా పరిశీలించి కట్టు కట్టి , వేరే టాబ్లెట్స్ రాసి ఇవి వాడండి అని చెప్పగా థాంక్స్ చెప్పి ఫీస్ ఇచ్చేసి ATM కు వెళ్లి కొంత డబ్బు డ్రా చేసి ఇంటికి చేరుకున్నాము.

1 Comment

Comments are closed.