జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 12 54

బేబీ……అని ప్రేమగా పిలుస్తూ కాల్ ఎందుకు చేసానో ఆ విషయమే మరిచిపోయాను అని , బేబీ వైజాగ్ ఇంటి అడ్రస్ చెప్పమనగా , ఉత్సాహంగా ఎందుకమ్మా అని వెంటనే అడుగగా , నా ప్రియమైన బేబీ కి ఒక లవ్లీ గిఫ్ట్ పంపడానికి అని అపద్ద0 చెప్పగా , సరే అమ్మ నేను మెసేజ్ పంపిస్తాను అని చెప్పి మరి కొంతసేపు మాట్లాడి ముద్దు పెట్టి కాల్ కట్ చేసి , సంతోషంగా నవ్వుతూ అమ్మ వచ్చేలోపు కృష్ణ గాడిని కలుద్దాము అని వేగం పెంచుతూ కారును పోనివ్వగా 20 నిమిషాలలో వైజాగ్ ఔట్ స్కర్ట్ చేరుకొంటుండగా, రోడ్ కు అవతలి వైపు ముగ్గురు college అమ్మాయిలు అనకాపల్లి వైపు ప్రయాణిస్తున్న వాహనాలను ఇద్దరు అమ్మాయిలు లిఫ్ట్ అడుగుతుండగా వెనుక ఉన్న అమ్మాయి తల వంచుకొని ఉండగా మనకెందుకులే అని వాళ్ళను దాటుకుంటూ వెళుతుండగా, తల వంచుకున్న అమ్మాయి తల ఎత్తి ముందు ఉన్న అమ్మాయిలను దీనంగా చూడగా , నాకు షాక్ లో మైండ్ బ్లాక్ అయిపోయి సడన్ బ్రేక్ వేసి కారును రోడ్ మధ్య లోనే ఆపి తనేనా కాదా అని ఆ అమ్మాయినే తదేకంగా చూడగా గుండె ఆగినట్లుగా అయిపోగా , వేరే వాహనం ఎక్కకుండా ప్రార్థిస్తూ దేవుడు నా టీ షర్ట్ కు ఎందుకు మంకీ క్యాప్ పెట్టాడో అర్థమయ్యి thank గాడ్ అని తలుచుకుంటూ , దానితో ముఖం కనిపించకుండా కప్పుకొని, కారును ముందుకు పోనిచ్చి డివైడర్ ను దాటుకుని కారును వెనక్కు తిప్పి వాహనాలను అత్యంత వేగంతో దాటుకుంటూ వాళ్ళను సమీపిస్తుండగా నెమ్మదిగా పోనిస్తుండగా ఇద్దరు అమ్మాయిలు లిఫ్ట్ అని నా కారుకు చేతులను చూపించగా , కొద్దిగా ముందుకు వెళ్లి కారును ఆపి హార్న్ కొట్టగా , రావే దివ్య అని ఇద్దరు వెనుక ఉన్న అమ్మాయిని చెరొక వైపు చెయ్యి అందుకొని లాక్కొని నా కారు వైపు వస్తూ ఇద్దరు వెనుక కారు డోర్ దగ్గర నిలబడగా దివ్య చేతికి మణికట్టు పైన కట్టు కట్టి ఉండగా, అది చూసి నా గుండె వేగం ఒక్కసారిగా పెరుగగా, ఒక అమ్మాయి ముందుకు వచ్చి కొద్దిగా వొంగి ,సర్ మా స్కూటీ ఏదో ప్రాబ్లెమ్ వల్ల ఆగిపోయింది, దగ్గరలోనే గుడి ఉంది అక్కడవరకు లిఫ్ట్ కావాలి ప్లీస్ సర్ అర్జంట్ అని ప్రాధేయపడగా , ఎక్కండి అని వెనుక డోర్ ను unlock చెయ్యగా ముగ్గురు వెనకే ఎక్కగా , నెమ్మదిగా కారును పోనిస్తుండగా లిఫ్ట్ అడిగిన అమ్మాయి సర్ అర్జంట్ గా వెళ్ళాలి కొద్దిగా వేగంగా పోనివ్వమనగా , ఒక్కసారిగా వేగంగా పోనివ్వగా 10 నిమిషాల తరువాత సుమారు అనకాపల్లికి సగం దోయిరాం రాగా సర్ ఇక్కడే రైట్ సైడ్ అని చెప్పగా , ఆ సైడ్ కారును తిప్పి కొద్దిగా లోపలికి వెళ్లగా ఒక పెద్ద గుడి కనిపిస్తుండగా ఇక్కడే ఆపండి సర్ అని చెప్పగా , గుడి బయట కొంతమంది అబ్బాయిలు మరియు అమ్మాయిలు భయపడుతూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు వేచి చూస్తుండగా , థాంక్స్ సర్ అని చెప్పి ముగ్గురు కిందకు దిగగా బయట ఉన్నవాళ్ళంతా హమ్మాయ్య వచ్చారు త్వరగా రండి అని పరుగులు పెడుతూ లోపలికి పిలుచుకొనివెల్లగా, మంకీ క్యాప్ పూర్తిగా కప్పుకొని వాళ్ళ వెనుకే గుడి లోపలికి పరిగెత్తి వెళ్లి ఎవరిదో పెళ్లి చేస్తున్నట్లుగా కింద అలంకరించి వుండి పంతులు ఒక పక్కన కూర్చొని వేచి చూస్తుండగా,ఏమి జరగబోతోందో అని ఒక మూలన నిలుచోగా , దివ్య కు మరియు ఇంకొక అబ్బాయికి పెళ్లి బట్టలు అనుకుంటా ఇచ్చి గుడి వెనుక ఉన్న గదులలోకి వేరు వేరుగా పిలుచుకొని వెళ్లగా కొంత సమయం తరువాత పేలాయి బట్టలు కట్టుకొని రాగా దివ్య ముఖం బాధగా , దీనంగా ఉండగా, వచ్చి పెళ్లి పీటలపై కూర్చోగా , ఏమి జరగబోతోందో పూర్తి అవగాహన రాగా , ఇద్దరు అబ్బాయిల వెనుక స్థంభం పక్కన నిలబడి పంతులు గారు మంచి ముహూర్తమేనా అని గట్టిగా అందరికి వినపడేలా అడుగగా , ఎవరు నాయనా అది నేను పెట్టిన ముహూర్తాన్ని ప్రశ్నించేది అని నా వైపు చూడగా ముందు ఉన్న అబ్బాయిలు పక్కకు తప్పుకొని అందరూ నా వైపు చూడగా , పెళ్ళికొడుకు , పెళ్లి కూతురు కూడా తల ఎత్తి నా వైపు చూస్తుండగా , నా తలకు ఉన్న మంకీ క్యాప్ ను వెనక్కు వదిలి తల ఎత్తగా, ఒక్కసారిగా దివ్య అన్నయ్య అని ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూ పైకి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి నా గుండెలపై వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుండగా ,అందరూ భయంతో , ఆశ్చర్యంతో మా వైపే చూస్తుండగా ఒక చేతిని తన తలపై వేసి ఓదారుస్తూ తననే చూడసాగాను.

1 Comment

Comments are closed.