జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 12 54

అత్తయ్య తో సహా ఇంటిలోపలికి వెళ్లి పిల్లలకు వెళ్తున్నట్లు చెప్పగా ఇద్దరు నన్ను వాటేసుకుని మామయ్య వెళ్లొద్దు మామయ్య ఇక్కడే ఉండిపొమ్మని ఏడుస్తూ చెబుతుండగా మోకాళ్లపై కూర్చొని ఇద్దరిని హత్తుకోగా, మహి , అత్తయ్య వాళ్ళను ఓదారుస్తూ మామయ్య ఇప్పుడు వెళ్లి మళ్ళీ తొందరలోనే వస్తాడు అని సముదాయించగా నన్ను గట్టిగా ఇద్దరు కౌగిలించుకొని బుగ్గలపై చెరొక వైపు ముద్దు పెడుతూ , మామయ్య త్వరలోనే వస్తావు కదూ ప్రామిస్ అని చెయ్యి చాపగా , ఆనందిస్తూ మీరెప్పుడు కోరుకుంటే అప్పుడు వెంటనే మీ ముందు ఉంటాను అని ప్రామాస్ చేసి ఇద్దరి చెంపలపై ముద్దు పెట్టి ఇద్దరికి కొంత డబ్బు ఇవ్వగా , మాకు డబ్బు వద్దు మామయ్య నువ్వు తొందరగా రా చాలు అనగా , ముచ్చటేసి చిన్నా ముఖంపై ముద్దుల వర్షం కురిపిస్తూ వాళ్ళ చేతులలో డబ్బు పెట్టాను.

పైకి లేవగా అత్తయ్య మరియు మహి కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా , వారిద్దరిని చూసి నా కళ్లల్లో కూడా నీళ్లు కారగా మిగిలిన డబ్బంతా అత్తయ్యకు ఇచ్చి ఇద్దరిని చెరొకవైపు గట్టిగా చేతులు వెనక్కు వేసి కౌగిలించుకొని అత్తయ్య ఇంకా ఇక్కడే ఉంటే తట్టుకోలేను అని బాధతో ఇద్దరి నుదుటిపై గట్టిగా చెరొక ముద్దు పెట్టి వెళ్లి వస్తాను అని చెప్పడానికి తడబడుతుండగా ప్రేమగా చెంపలపై చేతులతో స్పృశిస్తూ బయటకు నడువగా అందరూ కారు వరకు రాగా , సెక్యురిటి కి థాంక్స్ చెప్పి జాగ్రత్త అని చెబుతూ , మహి ఒక బాటిల్ లో మంచి నీళ్ళు తెచ్చివ్వగా అందరికి మరొకసారి నవ్వుతూ టాటా చెప్పి కారును ముందుకు పోనిచ్చాను.

10 నిమిషాలలో ఊరు దాటి హై వే పై 40 లో కారును పోనిస్తూ అమ్మ ఎక్కడిదాకా వచ్చిందో కనుక్కుందామని కాల్ చెయ్యగా , ఇంకా ఇప్పుడే రాజమండ్రి బస్ స్టేషన్ లో బస్ ఎక్కామని , పంకజం అంటీ tiffen చేసి గాని పంపలేదని మధ్యాహ్నం 3 గంటలకు వైజాగ్ చేరుకోవచ్చని అసహనంగా చెప్పగా , అంటీ ఎలా ఉన్నారు అని అడుగగా , తనకు తానే బాధపడుతూ పైకి మాత్రం నవ్వుతూ ఉంది అని అమ్మ చెప్పగా,బాధ వెయ్యగా సరే అమ్మ అయితే happy జర్నీ అని చెప్పి ఒక ముద్దు పెట్టి , ఇంకా చాలా సమయం ఉందని అసహనంతో మూడీగా కట్ చేసి పక్కన పెడుతుండగా , గోవా నుండి అమ్మ ఫోన్ నుండి కాల్ వస్తుండగా పెదాలపై ఒక్కసారిగా చిరునవ్వు రాగా సంతోషంతో పొంగిపోతూ కాల్ ఎత్తి చెవిదగ్గరికి ఫోన్ తీసుకొని వెళ్లి “లవ్ యు అమ్మ , మిస్ యు అమ్మ , కిస్ యు అమ్మ అని ముద్దుగా ఏ ఏ పదాలు “ఉంటే వాటితో వరుసగా అమితమైన ప్రేమతో చెబుతూ ఉండగా , వాటన్నింటిని ఓర్పుతో వింటూ “లవ్ యు టూ బేబీ , మిస్ యు టూ మై డియర్ బేబీ “అని అమ్మ మాటలు వినగానే హృదయానికి హాయిగా అనిపించి కారును రోడ్ పక్కన ఆపి ప్రేమగా నవ్వుతూ ఒక అర గంటసేపు మాట్లాడుకోగా మనసుకు చాలా సంతోషం వెయ్యగా మొబైల్ ను పెదాల దగ్గరకు తెచ్చి వదలకుండా ముద్దులు పెట్టగా అమ్మ కూడా గట్టిగా వినిపించేలా ముద్దు పెట్టేసరికి హాయిగా అనిపించి వెనుక సీట్ పై వాలిపోయాను.

1 Comment

Comments are closed.