జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 12 54

చిన్నా పైకి లేచి మామయ్య పాటలు పెట్టు డాన్స్ చేస్తాను అని చెప్పగా , wow చిన్నా సూపర్ అయితే అని అత్తయ్య ఒక్క నిమిషం అని కారును మేము కూర్చున్న దగ్గరికి తెచ్చి , డోర్ లన్ని తెరిచి, కారు మరియు నా మొబైల్లో bluetooth on చేసి , మాకు బాగా వినిపించేలా వాల్యూం పెట్టి మంచి ఊపు వచ్చే పాటలు ఫోన్ లో పెట్టగా మంచి బీట్ వస్తుండగా పరిగెత్తుకుంటూ వచ్చి అత్తయ్య ఒడిలో తల పెట్టి పడుకోగా మహి నా కాళ్ళను ఎత్తి తన తొడలపై పెట్టుకుంది.

బీట్ కు తగ్గట్టు చిన్నా ట్రైనింగ్ తీసుకున్న వాడిలా డాన్స్ ఇరగదీస్తున్నాడు. రెండు పాటలకు ఆగకుండా డాన్స్ చేసి అలసిపోయి నా పత్తి కడుపుపై నవ్వుతూ వాలిపోయాడు . అందరూ చాలా చాలా ఎంజాయ్ చేసాము. తల పైన అత్తయ్య చేతి స్పర్శ కింద కాళ్లపై మహి చేతి స్పర్శకు, వీస్తున్న చల్లటి ప్రకృతి గాలికి , వినసొంపుగా ఉన్న పాటలకు వెంటనే నిద్ర పట్టేసింది. నాతో పాటు నా పై చిన్నా కూడా హాయిగా నిద్రపోయాడు. మొబైల్ లో ఉన్న పాటలన్ని అయిపోగా సౌండ్ ఆగిపోవడంతో మెలకువ రాగా అత్తయ్యను , మహి ను చూడగా నన్నే అమితమైన ప్రేమగా చూస్తూ జో కొడుతున్నారు.

అప్పుడు వచ్చిన ఆనందాన్ని మాటలతో కాదు కదా దేనితోను వర్ణించలేము. సమయం చూడగా 4 గంటలు అవుతుండగా అత్తయ్య ఒడిలో 2 గంటలు హాయిగా నిద్రపోయాను అని మనసు పులకించిపోగా, “అత్తయ్య వెళ్దామా” అని అడుగగా నా వెంట్రులలో నిమురుతూ “నీ ఇష్టం బుజ్జి” అని చెప్పగా , “సరే వెళదాము” అని పైకి లేచి పడుకున్న చిన్నాను ఎత్తుకొని ముందు సీట్ లో కిర్చోబెట్టి బెల్ట్ తగిలించి సమానులన్ని కారు వెనుక పెట్టేసి , బాటిల్ నీళ్లతో ముఖం కడుక్కొని మహి టవల్ అందించగా తుడుచుకుని 4:30 కల్లా ఊరిలోకి వచ్చి షాపింగ్ మాల్ ముందు కారు ఆపి అందరిని లోపలికి పిలుచుకొని వెళ్లి , అత్తయ్యను చీరాల దగ్గర , మహిని మరియు వర్శినిని డ్రెస్ లు దగ్గర , చిన్నా ను కిడ్స్ డ్రెస్ లు ఉన్న చోట వదిలి ఎన్ని కావాలో సెలెక్ట్ చేసి ఉండండి ఇప్పుడే వస్తాను వీలైతే ఫోన్ చెయ్యండి అని చెప్పి షాప్ వాళ్లకు అన్ని costly మరియు కొత్త డిసైన్ లు చూపించమని చెప్పి , కారులో ముందుగా సైకిల్ షాప్ కు వెళ్లి చిన్నాకు ఖరీదైన స్పోర్ట్స్ సైకిల్ మరియు వర్శినికి లేడీ బర్డ్ సైకిల్ కొని అడ్రస్ ఇచ్చి గంటలోపు డెలివరీ ఇవ్వాలని కొద్దిగా ఎక్కువ డబ్బు ఇవ్వగా , sure సర్ గంట లోపు ఈ అడ్రస్ లో ఉంటుంది అని చెప్పగా థాంక్స్ చెప్పి అటు నుండి స్కూటీ షో రూమ్ కు వెళ్లి కొత్తగా వచ్చిన లేడీస్ స్కూటీ ని మహి కోసం కొన్ని వాళ్లకు కూడా అడ్రస్ ఇచ్చి గంటలో డెలివరీ ఇవ్వాలని డెలివరీ charges కూడా స్వైప్ చెయ్యగా అలాగే సర్ అని చెప్పగా , మొబైల్ తీసి సెక్యురిటి కి ఫోన్ చేసి రెండు సైకిల్స్ మరియు ఒక స్కూటీ డెలివరీ వస్తాయి వాటిని దేనితోనైనా కనబడకుండా కవర్ చెయ్యమని చెప్పి, వెంటనే షో రూమ్ కు రాగా ఇంకా సెలెక్ట్ చేస్తుండగా మెన్స్ సెక్షన్ దగ్గరికి వెళ్లి నాకు ఒక జత బట్టలు మరియు ఇన్నేర్స్ తీసుకొని కౌంటర్ కు పంపించి సెలెక్ట్ చేసే దగ్గరికి వెళ్దామ అని అనుకోని ఆగిపోయి ఇంకా లేట్ అయిపోతుందని అది వాళ్ళకే వదిలేసి అక్కడే కుర్చీలో కూర్చోగా కొద్దిసేపటికి “మామయ్య నాది అయిపోయింది” అని కొన్ని జతలను సేల్స్ మాన్ కౌంటర్ వైపుకు తీసుకు వస్తుండగా , చిన్నా నా పక్కనే కుర్చీలో కూర్చున్నాడు.

1 Comment

Comments are closed.