జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 12 54

ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి కిషోర్ కు చెప్పగా , తన తండ్రిని ఎదిరించి నేను దివ్యనే చేసుకుంటానని తెగేసి చెప్పి బయటకు వచ్చేస్తుండగా , తమ ఇంటిలో పనిచేసే వాళ్ళతో తనని రూమ్ లో బంధించివేసి కాపలాగా పెట్టేశాడు. వాళ్ళ అమ్మకు నేనంటే చాలా ఇష్టము , రెండు సార్లు గుడిలో తన తల్లిని పిలుచుకొని వచ్చి నన్ను పరిచయం చెయ్యగా నన్నే తన కోడలిగా ఫిక్స్ అయిపోయింది.

కిషోర్ తన రూం తలుపుకు ఎంత కొట్టినా తెరవకపోవడంతో కోపంతో తలను తలుపుకు కొట్టుకొని కొట్టుకొని కింద పడిపోగా తన తండ్రి బయటకు వెళ్లిన తరువాత తన తల్లి తలుపు తెరువగా చాలా రక్తం పోయి స్పృహ తప్పి పడిపోగా వెంటనే గట్టిగా అరవగా పనివాళ్ళు ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకువెళ్లిన విషయం తెలిసి అని చెబుతుండగా తనతో పాటు కోరస్ పాడుతూ నువ్వు కూడా అని తన చేతిని అందుకొని కత్తితో నువ్వు కూడా కోసుకున్నావు అని చెబుతూ ఆ కట్టుని చూపిస్తూ నా కళ్లల్లో నీళ్లు కార్చసాగాను.

క్షమించు అన్నయ్య ఒక పక్క ఇంట్లో అమ్మ , నాన్న మరియు కృష్ణ భాధపడుతుండటం మరొక పక్క కిషోర్ కు ఇలా అవ్వడంతో ఏమి చెయ్యాలో తెలియక భయం , బాధ వేసి అలా చేసేశాను , స్పృహ తప్పిపోయి పడిపోయిన నన్ను నాన్న , కృష్ణ కలిసి ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. కిషోర్ కు ఈ విషయం తెలిసి తన ఫ్రెండ్స్ ద్వారా నాకు అమ్మ నాన్నలు తెలియకుండా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా ,వాళ్ళు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లు నాకోసం అమ్మడానికి కూడా వెనుకాడకపోవడంతో ఆలోచిస్తూ ఉండగా, నేను నిన్ను ప్రాణంగా చూసుకుంటానని అందరితో ఒప్పించి ఈ పెళ్లి ఏర్పాటు చేశాడు అని చెప్పి బాధపడసాగింది.

ఇంత జరుగుతున్నా కూడా ఒక్కరికి కూడా నాకు చెప్పాలని అనిపించలేదు కదూ అని బాధపడుతూ భావిద్వేగంతో అడుగగా , నీకు తెలుసు కదా అన్నయ్య అమ్మ నాన్నల గురించి ఇతరులకు ఇబ్బంది పెట్టడం అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. వేరే ఏదైనా విషయం అయితే కచ్చితంగా చెప్పేవాళ్ళు , చాలా డబ్బు కదా అందుకే నీకు చెప్పలేదు.

1 Comment

Comments are closed.