జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 13 43

అక్కడ దివ్యక్క కంగారు పడుతూ ఉంటుంది ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్పి అమ్మ వాళ్ళను బస్ స్టేషన్ నుండి పిలుచుకొని రావాలి ,అని సమయం చూడగా 3 గంటలు అవుతుండగా , రాత్రికి కలుద్దాము అని చెప్పి స్టేషన్ వైపు వెల్లసాగాను.కిషోర్ ఇంటి వైపు వెళుతూ అక్కకు ఫోన్ చేసి ఇక్కడ జరిగినదంతా చెప్పగా సంతోషిస్తూ ఫోన్ లోనే ముద్దులు పెట్టగా , సాయంత్రం ఇంటికి అందరూ వస్తున్నాము అని చెప్పి ఫోన్ కట్ చెయ్యగా , వెంటనే నా ఫోన్ మ్రోగుతుండటంతో జేబులో నుండి తీసి చూడగా దివ్యక్క నుండి కాల్ వస్తుండతాంతి ఎత్తగా , ఒక నిమిషం వరకు మాట్లాడకుండా ఆనందపు ఏడుపు వినిపిస్తుండగా అక్కయ్య అని పిలువగా , అన్నయ్య అని నెమ్మదిగా మాట్లాడుతూ నాకు ఏమి చెప్పాలో తెలియట్లేదు అన్నయ్య , లవ్ యు అన్నయ్య అని ప్రేమగా చెప్పగా , ఇది చాలు అక్క ఈ తమ్ముడికి ఇంకేమి అవసరం లేదు.

మీ కళ్లల్లో సంతోషం చూశానంటే ఇక చాలు అంతకంటే ఆనందం మరొకటి లేదు , అమ్మను మరియు అంటీ ని పిలుచుకొని రావడానికి వెళ్తున్నాను , కిషోర్ చెప్పినది ఇంట్లో చెప్పొద్దు అని చెప్పి సంతోషంగా ఫోన్ పెట్టేసాను.

20 నిమిషాలలో ట్రాఫిక్ లో స్టేషన్ కు చేరుకొని బస్ నిలపడే దగ్గరికి వెళ్లి అమ్మకు కాల్ చెయ్యగా సిటీ లోకి ఎంటర్ అయ్యింది 20 నిమిషాలలో స్టేషన్ కు వచ్చేస్తాము అని చెప్పగా , అన్ని అనుకున్నట్టే జరిగాయని సంతోషిస్తూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని వేచి చూస్తుండగా , కొద్దిసేపటి తరువాత బస్ రాగా అమ్మ , అంటీ దిగగా , అంటీ ముఖం బాధగానే ఉండటంతో , ఇంకొన్ని గంటలే అని మనసు పదాల పరుచుకొని ఇద్దరి భుజాలపై ఉన్న బ్యాగులు అందుకొని , బయటకు వచ్చి , అమ్మ తిన్నారా అని అడుగగా , లేదు కన్న చాలా ఆకలిగా ఉందని చెప్పగా , అంటీ మాత్రం నేను ఇంటికి వెళ్ళాలి మహేష్ అని అనగా , అంటీ ఇంటికి ఫోన్ చేసాను అంతా తినేసారంట హోటల్ కు వెళ్లి తినేసి వెళదాము అని గట్టిగా చెప్పగా , అత్తయ్య సరే అని కారులో మంచి హోటల్ కు వెళ్లి ఫుడ్ ఆర్డర్ చెయ్యగా, అంతలోపు అంటీ ఇప్పుడు చెప్పండి చాలా రోజుల నుండి బాధపడుతున్నారు నాకు , అమ్మకు చెప్పకూడదా అని నెమ్మదిగా అడుగగా , అది అని ఆగిపోయి అదేమీ లేదే పిల్లల్ని వదిలేసి వచ్చాను కదా అందుకే అని చెప్పి పై పైనే నవ్వినట్లు నటిస్తుండగా , చూద్దాము అంటీ మీరు ఎంతసేపు చెప్పకుండా దాస్తారో అని అంటుండగా , భోజనాలు రాగా తినేసి , అత్తయ్యను ఇంటి దగ్గర దింపగా , మా కారు శబ్దానికి కృష్ణ మరియు దివ్యక్క బయటకు రాగా , దివ్యక్క తల ఊపి సైగలు చేస్తూ చెప్పవద్దని చెప్పి , అమ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పి కృష్ణ గాడిని అలా ముందుకు పిలుచుకొని వెళ్లి ఫోన్ ఎందుకు ఎత్తలేదు రా అని కోపంగా అడుగగా , నటిస్తూ అరే మామా నిద్రపోయాను రా అని అపద్ద0 చెప్పగా , నువ్వింకా మారలేదు రా చూద్దాం ఎంతవరకు ఇలా ఉంటావు అని వీపుపై ఒక దెబ్బ వేసి కారులో ఇంటికి వెల్లసాగాము.

1 Comment

Comments are closed.