జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 13 43

నువ్వు ముందు అవన్నీ వదిలేసి నవ్వు ముఖం పెట్టు చూడలేకపోతున్నాను అని చెప్పగా , సరేరా మామ అని నవ్వుతూ మాట్లాడసాగాడు. 15 నిమిషాలలో స్వీట్ షాప్ కు చేరుకొని , మంచి ఖరీదైన వాటిని రకరకాలుగా కొన్నింటిని ఎన్నుకొని , కొన్ని భోజనం లో తినడానికి మరియు వాళ్లకు ఇంటికి కొన్ని ఇవ్వడానికి ప్యాక్ చేయించి , ఒక రెండు రకాల కార కూడా తీసుకొని తొందరగా ఇంటికి చేరుకున్నాము.

లోపలికి వెళ్ళి స్వీట్స్ ప్యాకెట్స్ ను వంట గదిలో ఉన్న అమ్మకు ఇచ్చేసి , కిషోర్ ను మరియు వాళ్ళ బావను , కృష్ణ తో పాటు ఇంటి బయటకు పిలుచుకొని వెళ్లి చల్లటి గాలిలో నవ్వుకుంటూ మాట్లాడుతుండగా 9:30 కల్లా అంటీ వచ్చి భోజనానికి అందర్నీ పిలువగా , అందరూ కలిసి సంతోషంగా భోజనం చేసి కొద్దిసేపు విరామం తీసుకోగా , సమయం 10:30 అవుతుండగా , బావ గారు , చెల్లెమ్మ ఇక మేము వెళ్లి రేపు నిశ్చితార్థం పనులు చూసుకోవాలని చెప్పగా , బావ గారు చాలా సంతోషమని చెప్పగా, అమ్మ ప్యాక్ చేసిన స్వీట్స్ ఇచ్చి కారు వరకు వెళ్లగా, అమ్మకు వెళ్ళొస్తామని చెప్పగా , కిషోర్ అక్కయ్యనే చూస్తూ కాల్ చేస్తాను అని చెప్పి కారు ఎక్కగా , మామయ్య నేను రేపు ఉదయమే వచ్చి కలుస్తాను అని చెప్పగా , సరే అల్లుడు నిశ్చితార్థం ఘనంగా జరిగెటట్లు ఏర్పాట్లు చేద్దాము అని భరోసా ఇవ్వసాగారు.

కారు బయలుదేరిన తరువాత అందరూ సంతోషంగా ఇంట్లోకి వెళ్లగా , నేను కూడా లోపలికి వెళుతుండగా , అంకుల్ నా భుజంపై చెయ్యి వేసి ఆపగా వెనక్కు తిరగగా , కళ్లల్లో నీరు కారుస్తూ గట్టిగా కౌగిలించుకొని వదిలి నా తలపై రెండు చేతులు వేసి ఆశీర్వాధిస్తున్నట్లుగా తాకించి , నా భుజంపై వెనుక నుండి చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని నవ్వుతూ గర్వంగా భుజాలు ఎగరేస్తూ లోపలికి పిలుచుకొని వెళ్లి , మహేష్ నువ్వు ఈ ఇంటికి అండగా ఉండగా నాకు ఇంకేమి భయం కానీ , బాధలు కానీ ఉండవు అని చెబుతూ ,కొన్ని రోజులుగా నిద్ర లేక, …… నాకు ఈ రోజు కలిగిన సంతోషం తో హాయిగా నిద్రపోతాను , ఇక అంతా నువ్వే చూసుకుంటావాని నాకు తెలుసు అని చెబుతూ నా వీపు తట్టి కన్నీళ్లు కారుస్తూ బెడ్ రూమ్ వైపు వెళ్లారు.

నాకు ఆశ్చర్యం కలుగుతూ అంకుల్ కి మొత్తం తెలిసిపోయిందా అని ఆలోచిస్తూ ఉండగా , దివ్యక్క పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ముందు నుండి గట్టిగా కౌగిలించుకొని చాలా చాలా థాంక్స్ అన్నయ్య , అమ్మ , నాన్న , అందరూ చాలా సంతోషంగా ఒప్పుకొని పెళ్లి జరిగేలా చేసావు అని భావోద్వేగంతో చెప్పగా , థాంక్సా నీ అన్నయ్యకా ఇది నా బాధ్యత , నువ్వు భాధపడితే నా హృదయం తట్టుకుంటుందా అని రెండు చేతులను అక్కయ్య చెంపలపై వేసి నుదుటిపై ముద్దు పెడుతూ నవ్వమని కోరగా కన్నీళ్లు కారుస్తూ నవ్వగా మరొకసారి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి మా మంచి అక్కయ్య అని అంటుండగా వంటగదిలో ఉన్నవాళ్లు వస్తుండగా ఇద్దరు వేరయ్యి నవ్వుతూ మాట్లాడసాగాము.

1 Comment

Comments are closed.