జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 7 71

వెనుక తన తల్లి పక్కనే ఉన్న దుప్పటిని కప్పి టవల్ తో తల నుండి కారుతున్న రక్తపు మరకలు ఆపుతూ ఆమెకు ధైర్యం చెపుతూ ఉండగా 15 నిమిషాల్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకుని ఎమర్జెన్సీ ప్రవేశం దగ్గరికి వెళ్లగా కంపౌండేర్స్ వీల్ బెడ్స్ తో సహా వచ్చి ఇద్దరిని జాగ్రత్తగా అందులోకి మార్చి వేగంగా వాటిని icu లోకి తీసుకొని వెళతారు.

వెంటనే ఇద్దరు డాక్టర్ లు లోపలికి వెళ్లగా , నర్స్ లోపలినుండి ఇద్దరి వస్తువులు తెచ్చి తనకు ఇచ్చి ముందుగా 25000 కట్టెయ్యండి అని కౌంటర్ చూపించగా ఏ మాత్రం ఆలోచించకుండా ATM ద్వారా స్వైప్ చేసేస్తాడు.

ఆ వస్తువులలో ఫోన్ ఉండగా కాల్ లిస్ట్ చూడగా కొద్దిసేపటి ముందే నాన్న అనే నెంబర్ కు కాల్ చేసి ఉండటంతో దానికి కాల్ చేసి మొత్తం చెప్పి కంగారు పడాల్సిన పని లేదు ఆసుపత్రిలోనే ఉన్నామని ధైర్యం చెప్పగా బాబు చాలా థాంక్స్ బాబు ఒక గంటలో అక్కడ ఉంటాము అని చెప్పి తమ కారులో భీమునిపట్నం నుండి ఒక ముగ్గురు భయలుదేరుతూ తమ కోడలు ఇంటికి వైజాగ్ లో ఉండే వారి తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యగా తగలక పోవడంతో ఏమి జరుగుతుందో అని భయం భయంగా భీమునిపట్నం నుండి భయలుదేరుతారు. Continue…

2 Comments

  1. bro part 6 ravadam ledhu Cen you pls send my email full story

Comments are closed.