జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 8 63

B పాజిటివ్ రక్తం కావాలి అని ఒక నర్స్ వేరే ఆసుపత్రికి ఫోన్ చేస్తుండగా నాది అదేనండి అనగా ICU లోనికి తీసుకొనివేల్లి బెడ్ చూపించగా దానిపైకి వాలగా రక్తం తీసుకుంటారు జానకి కూడా లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి పక్కనే నిలబడగా తన తల్లి చేతిని గట్టిగా పెట్టుకొంటుంది, అమ్మ ఏమి కాదు అని ధైర్యం చెప్పసాగింది.. ఒక 10 నిమిషాల తరువాత డాక్టర్ మహేష్ దగ్గరికి వచ్చి కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది ఆపరేషన్ చెయ్యాలి అని సంతకం చెయ్యమనగా తన తల్లి వైపు చూడగా సరే అన్నట్లు సైగ చెయ్యగా సంతకం చేస్తాడు. రక్తం ఇచ్చి మహేష్ మరియు జానకి బయటకు వస్తుండగా ఇంకో డాక్టర్ గాయపడిన వ్యక్తిని ట్రీట్ చేస్తున్నాడు.

ICU పక్కనే ఉన్న కుర్చీలలో కూర్చోగా అదంతా చూసిన మహేష్ చేతులు వణుకుతుండగా జానకి తన కొడుకు చేతులను గట్టిగా పట్టుకొనగా తన తల్లి భుజం పై వాలతాడు. సమయం నిదానంగా గడుస్తుండగా సుమారు ఒక గంట తరువాత అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు వినిపించగా ఒక్కసారిగా ఆనందం వెయ్యగా తలుపు దగ్గరికి వెళ్లి నిలబడతారు. ఒక 10 నిమిషాల తరువత్త డాక్టర్లు బయటకు బాచ్చి మగ పిల్లవాడు అని చెప్పి , తల్లి బిడ్డ తో సహా ముగ్గురు క్షేమం అని చెప్పగా ముగ్గురు ప్రాణాలు కాపాడాననే అంతులేని ఆనందం వెయ్యగా లోపలికి వెళ్ళి చూడవచ్చు అని చెప్పగా లోపలికి వెళ్లగా గాయపడిన వ్యక్తి ఊయలలో ఉన్న పిల్లవాడి పక్కన కట్లతో ఉన్నా కూడా సంతోషంగా పిల్లవాన్ని చూస్తున్నాడు.

ఇద్దరు లోపలికి వెళ్లగా మంచం మీద కళ్ళు మూతపడుతుండగా మహేష్ ను చూసి కన్నీళ్లు కారుస్తూ రెండు చేతులతో దండం పెట్టగా ఆపుతున్నట్లు సైగ చెయ్యగా నర్సు వచ్చి బిడ్డను చేతులతో ఎత్తుకొని ఈ ప్రాణం బ్రతికి ఉందంటే నీ వల్లనే అని తనకు అందించబోతుండగా చేతులని మసిగా ఉండటంతో పక్కనే ఉన్న సింక్ లో చేతులు శుభ్రన్గా కడుక్కొని తుడుచుకుని ఎత్తుకోగా తన చేతులలో పిల్లవాడు థాంక్స్ చెబుతున్నట్లుగా ఎడవగా ఒక్కసారిగా మహేష్ కళ్ళల్లో ఆనంద భాస్పాలు జల జల కారసాగాగుతుండగా పైకి ఎత్తుకొని ఆప్యాయంగా ముద్దు పెట్టి తన తల్లికి చూపించగా సంతోషంగా చిటికెలు వేస్తూ పలకరించసాగింది.

నర్సు చెప్పినదంతా విని బిడ్డ తండ్రి మహేష్ కాళ్ళు మొక్కబోతుండగా బిడ్డను నర్సు చేతికి నెమ్మదిగా అందించి అతడిని లేపి కౌగిలించుకుంటాడు. అంతలో ఫోన్ చేసి తెలియపరిచిన వారు రాగా తమ కొడుకు మరియు కోడలు క్షేమం అని సంతోషిస్తూ తమ కొడుకుని ఆప్యాయంగా కౌగిలించుకోగా , అమ్మ వర్షిని అని తన కోడలు దగ్గరికి వెళ్లగా అత్తయ్య అని ఆమె చేతిని చేతిలోకి తీసుకొంటుంది.

1 Comment

  1. 👌👌👌👌

Comments are closed.