జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 8 51

ఎప్పుడు ఏడ్చినా అత్తయ్య నన్ను ఎత్తుకొని bottle పాలు పడుతూ జోల పాడుతూ నవ్వించేది అంట , నెలలోనే నా మీద అత్తయ్యకు ఎనలేని ప్రేమ కలిగి ఆప్యాయంగా చూసుకొనేది, రాత్రిపూట తన పక్కనే పడుకోబెట్టుకొని లాలిపాడేది. 9 వ నెలలో అత్తయ్యకు నొప్పులు రాగా , అత్తయ్యకు ఆసుపత్రికి తీసుకు వెళ్లడం మొదలు ప్రసవించేవరకు నేను ఏడుస్తూనే ఉన్నానని అమ్మ చెప్పింది.

సులభమైన ప్రసవం జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకోగా అత్తయ్యకు మెలకువ వచ్చిన తరువాత తన కూతురు కన్నా నన్నే ముందుగా ఎత్తుకుని నేనంటే ఎంత ప్రేమరా బుజ్జి , నాకు నొప్పులు వస్తే నువ్వు ఏడుస్తున్నావు అని ప్రేమగా తన గుండెలపై ఎత్తుకొనగా అమ్మ నాన్నలు అది చూసి సంతోషంతో ఆనంద భాస్పాలు కారుస్తూ ఉండగా మావయ్య ముఖం లో మాత్రం ఏమాత్రం సంతోషం లేకుండా ఉంది.

నీ కూతురిని కూడా చూడవే అని అమ్మ అప్పుడే పుట్టిన పాపను చేతిలో పెట్టి నన్ను ఆమె నుండి తీసుకుంటుండగా పక్కకు తిరుగుతూ బాహుబలి రమ్యకృష్ణ లాగా ఇద్దరిని ఒక్కొక్క చేతిలో పట్టుకొని ప్రేమగా లాలిస్తుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండటం వలన సాయంత్రం లోపల డిశ్చార్జ్ చెయ్యడంతో నాన్న బిల్ కట్టేసి కారులో అందరూ ఇంటికి చేరుకున్నారు.

ఇంటికి చేరుకున్న తరువాత పాప ఏడవటం మొదలు పెట్టగా అత్తయ్య బెడ్ పై కూర్చొని వొళ్ళో ఉన్న నన్ను తన ముందు బెడ్ పై పడుకోబెట్టి , పాపను జాగ్రత్తగా వొళ్ళో పడుకోబెట్టుకొని పాల పొంగును బయటకు తీసి పాలు పడుతుండగా , నేను దానిని అలాగే చూస్తూ కొద్దిసేపటి తరువాత ఆకలితో ఏడవటం మొదలు పెట్టగా అమ్మ bottle లో పాలు తీసుకొని వచ్చి నా నోటికి అందించగా వద్దు అన్నట్లు తలను పక్కకు తిప్పగా , అమ్మ ఎత్తుకొని పాలు పెట్టగా తలను మళ్ళీ వెనక్కు తిప్పి ఇంకా గట్టిగా ఏడవటం మొదలుపెట్టాను.

1 Comment

Comments are closed.