జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 8 51

అన్నయ్య నేను వెళ్లిపోతున్నాను అని గబ గబా బట్టలు సర్దుకొని మావయ్యను తీసుకొని వెళ్లిపోతుండగా కింద పడిన ఇంటి తాళాలు తీసుకొని , అమ్మ ఎంత చెప్పినా వినకపోవడంతో ,నాన్నను ఆపమని అమ్మ వేడుకోగా వెళ్ళనియ్యి జానకి అని చెబుతాడు. అది కాదండి ఇప్పుడు వాళ్ళతో చిల్లి గవ్వ కూడా లేదు ఎలా బతుకుతారు , మీ చెల్లెలు గురించి ఆలోచించమనగా , నువ్వేమి భయపడద్దు జానకి ఇంటిలో కొద్దిగా డబ్బు కూడా ఉంచాను అని నెల నెలా కొద్ది డబ్బు చేరేలా చూసుకుంటాను అని చెప్పగా జానకి మీరు ఎంత మంచివారండి అని నేను ఏడుస్తుండగా పరిగెత్తుకుంటూ వెళ్లి ఎత్తుకొని నాన్నను కౌగిలించుకుంటుంది. అదీ జరిగింది.

అమ్మ రోజు కాల్ చేసి అత్తయ్యకు ఏమైనా కావాలంటే పంపుతుండేది, అమ్మతో మాత్రమే మాట్లాడుతుండేది. నన్ను దగ్గరికి తీసుకొని అత్తయ్య నన్ను ఎంత ప్రేమగా చూసుకొనేదో ప్రతి రోజు చెబుతూ ఉండేది. అత్తయ్య మావయ్య కొన్ని సంవత్సరాలు బానే అత్తయ్యను నమ్మిస్తూ నా మీద ద్వేషం పెంచుతూ నాన్న పంపిన డబ్బులతో సంసారం సాగించగా మరొక కూతురు వర్షిని మరియు చిన్న పుట్టారు.

వాళ్ళు పుట్టినప్పుడు , భారసాల చేసినప్పుడు మాత్రమే నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కానీ అత్తయ్య మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు. నాకు చాలా బాధ వేసేది అది చూసి అమ్మ అత్తయ్య నిన్ను ప్రేమగా చూసే రోజు వస్తుందని నమ్మించేది. అమ్మ ప్రతి సంవత్సరం సెలవులకు ఇంటికి పిల్లలను పిలిపించుకోవడం వల్ల ,పిల్లలందరం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేమంతా చాలా close గా ఉండటం చూసి, మహేష్ అత్తయ్య నిన్ను ఎంత ద్వేషించినా నువ్వు మాత్రం ఎల్లప్పుడూ అత్తయ్యను ప్రేమగానే పలకరించాలి అని పదే పదే చెబుతూ ఉండేది.

ఆ తరువాత మావయ్య నిజ స్వరూపం జూదాలు మరియు తాగుడు , వ్యక్తిత్వం భయటపడగా , తనలో తాను ఏడుస్తూ తన అక్కయ్యలకు మంచి సంబంధాలు చూసి తనకు మాత్రం ఇలాంటి వాడినిచ్చి పెళ్లి చేశారు అని అమ్మను తప్ప నాన్న మీద , నా మీద రోజురోజుకీ ద్వేషం పెంచుకుంటూ పోయింది. అదీ జరిగింది. ఇక ప్రస్తుతానికి వస్తే కళ్ళు మూతలు పడుతుండగా రోడ్ పక్కనే ఉన్న కొట్టు పక్కన వాహనం నిలిపి టీ తాగగా నిద్ర మత్తు ఎగిరిపోగా అప్పటికే సగం దూరం పైనే వచ్చెయ్యగా ముందుకు కాదులుతాడు.

1 Comment

Comments are closed.