జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 8 51

చిన్న కొత్త బట్టలను వేసుకొని సంతోషంగా నవ్వుతూ అరెంజ్ చేసిన టేబుల్ ముందు కుర్చీలో కూర్చోగా వాళ్ళ స్నేహితులంతా cycle లలో వచ్చి ఒక్కొక్కరుగా చాలా మంది ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చోగా పిల్లలందరూ కేక్ గురించి , decoration గురించి అరే పెద్ద కేక్ అని ఒక పిల్లవాడు అంటే మరొక పిల్లవాడు అంత సీన్ లేదురా చిన్న కేక్ అంతే అని మాట్లాడుతూ గలాట చేస్తుండగా , ఇంటి పక్కనే ఉన్న పిల్లలతో పాటు తెలిసిన పెద్దవాళ్ళు కూడా రావడంతో మహి అత్తయ్యకు కూడా పిలుచుకు రమ్మనగా మహి లోపలికి వెళ్ళి బలవంతంగా పిలుచుకొని రాగా చిన్న నవ్వుని చూసి ఆనందిస్తూ దూరంగా నవ్వుతూ నిలబడగా , చిన్న కు సైగ చెయ్యగా చిన్న వెళ్లి అమ్మను టేబుల్ పక్క వరకు పిలుచుకొని రాగా మహితో కలిసి కేక్ ను జాగ్రత్తగా తీసుకొని వచ్చి టేబుల్ పై ఉంచి బాక్స్ తీసివేయగా పిల్లలందరూ అంత పెద్ద దానిని చూసి wow అని నిశ్శబ్దన్గా ఆశ్చర్యంగా కూర్చుండిపోతారు.

ఇదంతా వర్షిని కింద కిటికీలో నుండి చూస్తోంది. మహిని ముందుకు తొయ్యగా కేక్ మీద మేజిక్ క్యాండిల్ వెలిగించగా చిన్న కుర్చీ మీద నిలబడి కేక్ కొయ్యగా అందరి happy birthday పాట పడుతుండగా రిమోట్ నొక్కగా టపాకాయలు పేలుతుండగా కేక్ కోసి నా వైపు వస్తుండగా వద్దు ముందు అమ్మకు అన్నట్లు కళ్ళతో సైగ చెయ్యగా అత్తయ్య వైపు తిరిగి నోటిలో పెట్టగా అత్తయ్య కొద్దిగా కేక్ తీసుకొని సంతోషంగా నవ్వుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్న అని ఆనందంగా నుదుటిపై ముద్దు పెడుతుంది.

తరువాత మహికి , నాకు నోటిలో పెట్టగా జేబులో ఉన్న బంగారు గోలుసును చిన్న మెడలో వేసి చిన్న చేతిలో ఉన్న కేక్ ను తినిపిస్తూ happy బర్త్డే చిన్న అని చెంపపై ముద్దు పెట్టి చెప్పసాగాను. చిన్న కేక్ దగ్గరికి వెళ్లి ఒక ముక్కను చేతిలోకి తీసుకొని పరిగెత్తుకుంటూ ఇంటిలోకి వెళ్లి వర్షిని అక్కయ్యకు నోటిలో పెట్టగా తను కూడా కొద్దిగా తీసుకొని విషెస్ చెపుతుంది.

అంతలోపల అత్తయ్య, మహి కేక్ ను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పేపర్ ప్లేట్ లలో పెట్టి అందులో పక్కకు కార వేసి ఒక్కొక్కరికి ఇవ్వసాగారు. పిల్లలంతా తాము తెచ్చిన గిఫ్ట్స్ చిన్నకు ఇస్తూ birthday విషెస్ చెబుతుండగా చిన్న ఆనందానికి అవధులు లేవు. ఒక గంట వరకు ఆనందంగా పిల్లలంతా చిన్న తో గడుపగా పిల్లలు ఇంటికి వెళ్ళడానికి సమయం అవ్వగా గేట్ పక్కనే ఉంచిన గిఫ్ట్స్ ఒక్కొక్క స్నేహితునికి చిన్న చేతుల ద్వారా ఇప్పించగా పిల్లలందరూ సంతోషంగా థాంక్స్ చెప్పి బయటకు వెల్తూ అరే మనకు కూడా గిఫ్ట్స్ ఇచ్చిన చిన్న గాడు సూపర్ రా అనుకోని ఇంటికి వెల్లసాగారు.

1 Comment

Comments are closed.