జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 8 51

మహి అందరికి ఫోన్ చేసి విషయం చెప్పి ప్లేస్ చెప్పి తప్పకుండా రావాలని చెబుతుండగా, ఒక 10 నిమిషాలలో షాపింగ్ మాల్ కు వెళ్లి manager ను కలిసి ఒక 300 దాకా 10000 రేంజ్ లో పట్టు చీరలు కావాలని చెప్పగా వెనుక ఉన్న పెద్ద గోడౌన్ కు తీసుకెళ్లి చూపించగా నిలువుగా పేర్చిన చీరలను చూసి మహి ఆశ్చర్యంగా చూస్తూ నా భుజం పై తల వాలుస్తుంది. మాకు ఇప్పుడు సెలెక్ట్ చేసే సమయం లేదు కావున ఇచ్చిన వాళ్ళ నుండి మాట రాకుండా మంచివాటిని మీరే చూసి గిఫ్ట్ మాదిరి ప్యాక్ చెయ్యమని చెప్పి కాష్ కౌంటర్ కు వచ్చి 10 లక్షల రూపాయలను స్వైప్ చేసి బిల్ తీసుకొని బయటకు రాగా ఆకలి వేస్తుండటంతో పక్కనే ఉన్న భేకరీలో 4 బర్గర్లు తీసుకొని వాహనం లో కూర్చొని ఇద్దరు తినసాగాము.

అప్పటికే 2:30 గంటలు అవుతుండగా ముందుగా పిల్లలకు గిఫ్ట్స్ ఆర్డర్ ఇచ్చిన దగ్గరికి వెళ్లి మొత్తం ఒక లగేజీ ఆటో లో వెనుక మరియు పైన సర్ధేశి మొత్తం డబ్బు పే చేసి ,మేము ముందు వెళుతుండగా ఆటో మా వాహనాన్ని ఫాలో అవుతుండగా భేకరీకి వెళ్లి ఆర్డర్ ఇచ్చిన కేక్ మరియు వేరేగా 5 kg ల కేక్ పీసెస్ మరియు 5kg హాట్ కార తీసుకొని 3:30 కల్లా ఇంటికి చేరుకోవడంతో తామే నమ్మలేనంతగా బాగా decorate చేసి ఉండటంతో సంతోషంగా ఫీల్ అయ్యి కొంచెం ఎక్కువే డబ్బులు ఇవ్వగా రిమోట్ ను నా చేతిలో పెడుతూ ఫైర్ క్రాకెర్స్ కూడా ఆరెంజ్ చేశామని ఒక్క నొక్కు నొక్కితే మొత్తం పైకి వెళ్లి పేలతాయని చెప్పగా థాంక్స్ చెప్పి పంపించివేశాను.

ఆటో లో ఉన్న గిఫ్ట్స్ ను గేట్ పక్కనే ఉంచి నల్లని ప్లాస్టిక్ కవర్ తో కప్పేసాను. వాహనం లో ఉన్న బట్టలను మహికి ఇచ్చి అందరూ వేసుకొమ్మని చెప్పి అత్తయ్యకు కూడా రెడి అవ్వమని లోపలికి పంపించి చిన్న చిన్న మిగిలిన పనులను చూసుకొని లోపల మహి కొత్త బట్టలు వేసుకొని ఇంటి పక్కనే బాగా పరిచయస్థులను ఇంటికి వెళ్లి మరీ స్వయానా ఆహ్వానించి ఇంటికి చేరుకుంటుంది.

1 Comment

Comments are closed.