జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 8 51

అమ్మ కూడా అది అర్థం చేసుకొని ఇప్పుడే పిల్లలు వద్దు అనుకోని అత్తయ్యను ప్రేమగా చూసుకోవడం వల్ల నాన్న సంతోషానికి అదుపు లేకుండా పోయింది.కొన్ని సంవత్సరాల తరువాత అత్తయ్య పెళ్లీడుకు రావడంతో తను అపురూపంగా చూసుకొనే బంగారు చెల్లెలిని అలా పంపించడం ఇష్టం లేక చాలా సంబంధాలు వెతికి చిన్న ఉద్యోగమైన పర్లేదు ఇల్లరికం వచ్చే సంబంధాన్ని చూసి అనకాపల్లిలో బిజినెస్ చేస్తున్న మామయ్యకు ఇచ్చి ఒక పండగలా వైభవంగా పెళ్లి చేసి మామయ్య పెరు మీద నాన్న సగం ఆస్తిని రాసి మామయ్యను ఇంట్లోనే పెట్టుకొని ఇద్దరిని ప్రేమగా చూసుకొనేవాడు.

తన బాధ్యతలు అన్ని పూర్తి అవ్వడంతో నాన్న ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టకపోవడంతో డాక్టర్లు ను సంప్రదించగా నాన్నకు కౌంట్ తక్కువగా మరియు అమ్మకు గర్భ సంచీలో ఏదో ప్రాబ్లెమ్ ఉందని చెప్పి ఇక పిల్లలు పుట్టారు అని చెప్పగా, ఇద్దరు ఎవరికి చెప్పకుండా భాధపడుతుండగా, సంవత్సరం తిరగకుండానే అత్తయ్య కడుపులో మహి పడగా ఇంటిలో మళ్ళీ సంతోషాలు వెల్లివిరుస్తుండగా అత్తయ్య ఎనిమిదో నెలలో ఉండగా గుడి మెట్ల మీద నేను దొరకడంతో అమ్మ నాన్నల ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది.

నన్ను ఇంటికి తెచ్చిన దగ్గర నుండి ఏడుస్తూనే ఉండటంతో మంచం పై పడుకున్న అత్తయ్య కష్టంగా లేచి వచ్చి నన్ను ఎత్తుకొని లాలి పాడి ఒక్క ముద్దు పెట్టేసారికి అప్పటివరకు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్న నేను ఒక్కసారిగా అత్తయ్య ముఖం పై సుయ్ మని కుళాయి వదులుతూ నవ్వటంతో అందరూ అత్తయ్యకు ప్రశంశించగా అత్తయ్య నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చి దొంగ వేదవా అని ప్రేమగా హత్తుకున్న విషయం అమ్మ నాకు పదే పదే చెప్పి నవ్వుకునేది.

ఆ రోజు సాయంత్రమే ఎన్నో ఏళ్ల నుండి ఊరిస్తున్న తమ గుడి “ధర్మ కర్త” పదవి కూడా ఎంతో మంది తన కన్నా పెద్ద పెద్ద వాళ్ళు పోటీపడుతున్న నాన్నను వెతుక్కుంటూ వచ్చేసరికి అది కూడా నావల్లనే అని తనకు అదృష్టం తన కొడుకు రూపంలో వచ్చిందని అమితంగా పొంగిపోతూ, ఆ తరువాతి రోజు పదవిని అలంకరించి నేను దొరికి నందుకు మరియు తన చెల్లెలు ప్రసవం సులభంగా జరగాలని చాలా ఖర్చు చేసి గుడిలో ఘనంగా పూజ జరిపించి పెద్ద మొత్తంలో పేదలకు అన్నదానం నిర్వహించాడు.

1 Comment

Comments are closed.