జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 8 51

ఈ వజ్ర వైఢూర్యాలు తమకు ఏవిధంగా ఉపయోగ పడతాయో ఆ దేవుల్లే తమకు తెలియజేయాలని అంతవరకు, ఇద్దరు తమ ఎదురుగా ఉన్న దేవుళ్ళకు మొక్కి ఆ బాక్స్ మూసివేసి ఎత్తి విగ్రహాల వెనుక జాగ్రత్తగా దాచిపెట్టి బయట నుండి ఒక పెద్ద చెక్కను తెచ్చి శుభ్రన్గా కడిగి దాని మీద పెట్టి కొత్త గుడ్డ తీసుకొని కప్పేస్తాడు.

కన్నా నువ్వు రెడి అవ్వు అంతలోపల నేను tiffen తయారుచేస్తాను అని చెప్పగా మహేష్ బయటకు వెళ్లి తాము అరకు వెళ్లిన వాహనం లోని సమానులన్ని లోపల పెట్టేసి , వాహనం వెనుక బెడ్ పై రక్తపు మరకలు ఉండగా బెడ్ పై ఉన్న కవర్లు మరియు దుప్పట్లన్నీ వాషింగ్ మెషిన్ లో వేసి అమ్మకు చెప్పి వాహనం మొత్తం వాచ్ మాన్ సహాయంతో శుభ్రం చేసి , ఇంటిలోపలికి వచ్చి ఎందుకైనా అవసరం రావచ్చునని ఒక జత బట్టలను చిన్న బ్యాగులో సర్దుకొని వాహనం లో పెట్టేస్తాడు.

8 గంటలు అవుతుండగా లోపలికి వస్తుండగా tiffen ను డైనింగ్ టేబుల్ మీద పెట్టి కన్నా తిందువుగాని రమ్మని పిలువగా ఇద్దరు తినేసి అమ్మ ఇద్దరం షాపింగ్ వెళ్లి అత్తయ్యకు మరియు పిల్లలకు కొత్త బట్టలు తీసుకొని నువ్వు అంటే దగ్గరికి వేళ్ళు నేను అటు నుండి ఆటే ఆనంకాపల్లి వెళతాను అని చెప్పగా అమ్మ రెడి అయ్యి రాగా కారు తాళాలు ఆమెకు ఇచ్చి, తను వాహనం తాళాలు అందుకొని ఇంటికి తాళాలు వేసి అమ్మకు ఇవ్వగా హాండ్ బ్యాగ్ లో పెట్టుకోగా ఇద్దరు ఒక్కొక్క వాహనంలో బయటకు వస్తూ వాచ్ మ్యాన్ కు కొంత డబ్బు ఇచ్చి సిటీ లోకి వస్తారు.

షాపింగ్ మాల్ కు చేరుకొని అత్తయ్యకు రెండు పట్టు చీరలు మరియు పిల్లలకు ఒక్కొక్కరికి రెండు జతల బట్టలు అమ్మ సెలెక్ట్ చెయ్యగా , జ్యువెలరీ షాప్ కు వెళ్లి చిన్నకు ఒక ఉంగరం మరియు ఇద్దరు మరుదళ్లకు రెండు బంగారు గొలుసులు అమ్మ సెలెక్ట్ చెయ్యగా , బట్టలను వాహనం లో పెట్టి బంగారు గొలుసులు స్టీరింగ్ పక్కనే ఉన్న లాకర్ లో పెట్టి, అమ్మ ,నేను అంటీ ఇంటికి చేరుకొనగా అమ్మ లోపలికి వెళుతుండగా అమ్మ హాండ్ బ్యాగ్ లోకి కొంత డబ్బును పెడుతుండగా అప్పుడు ఇచ్చినదే రూపాయి కిడా ఖర్చు అవ్వలేదు అని చెబుతుండగా, అంటీ మరియు కృష్ణ బయటకు వచ్చి లోపలికి రమ్మనగా టైం లేదు అంటీ అని అనకాపల్లి వెళ్తున్నాను అమ్మ జాగ్రత్త అని చెప్పి ఏదైనా అవసరమైతే కాల్ చెయ్యమని చెప్పి భయలుదేరుతాడు.

1 Comment

Comments are closed.