జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 8 52

ఆ వీధి దాటగానే మొబైల్ అందుకొని గోవా కు కాల్ చేసి అమ్మ క్షేమసమాచారాలు తెలుసుకొని చాలా విషయాలు మాట్లాడుకుని అమ్మ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానమ్మ అని చెప్పగా అవతలివైపు అమ్మ ఆనందంతో పొంగి పోగా మిస్ యు అమ్మ అని ప్రేమగా ముద్దు పెడతాడు. అప్పటికే ఊరి బయటకు వచ్చి హై వే లోకి ఎక్కగా సమయం చూడగా 10 గంటలు అవుతుండగా 40 స్పీడ్ లో వాహనాన్ని ముందుకు పోనిస్తాడు.

చాలా కాలం తరువాత చిన్నత్తయ్య ఇంటికి వెళుతుండగా, అత్తయ్య నాతో మాట్లాడుతుందో లేదో అని బాధ వేస్తుండగా అసలు దీనికంతటికీ కారణం ,అని నా గతం లోకి వెళ్లగా, నేను పుట్టక ముందు జరిగినది , నాన్నకు ఇద్దరు అక్కలు మరియు ఒక చెల్లెలు , తాతయ్యకు ఆరోగ్యం భాగాలేకున్నందు వల్ల ఇంటి బాధ్యత మరియు ఆస్తి అంతా నాన్న చేతిలోనే పెట్టి చనిపోయాడు.

తన ఇద్దరు అక్కయ్యలకు బెంగళూరు లో జాబ్ చేస్తున్న ఒకరు విజయవాడ మరియు మరొకరు రాజమండ్రి లో నివాసం ఉంటున్న వాళ్లకు ఇచ్చి ఘనంగా పెళ్లి చేసాడు.పెళ్లి అయిన తరువాత నెలకు ఒకసారి అయిన వాళ్ళను ఆహ్వానించి ప్రేమగా చూసుకొనేవాడు.

పెళ్లి అయిన సంపవత్సరం లోపల ఇద్దరు ఒకరు అమెరికాకు మరొకరు ఆస్ట్రేలియా లో ఉద్యోగాలు వచ్చాయని వెళ్లిపోవడంతో చాలా దూరం వెళ్లిపోవడం వలన సంవత్సరానికి ఒక్కసారి కూడా వాళ్ళు రాకపోవడంతో ,బంధువులు అంతా పెళ్లి చేసుకోమని భతిమాలినా తన చిట్టి చెల్లెలికి పెళ్లి చేసేంత వరకు చేసుకొని అనడంతో , దగ్గరి బంధువులంతా నీ చెల్లెలిని చూసుకోవడానికైనా పెళ్లి చేసుకోమనగా అప్పుడే ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటాడు.

1 Comment

Comments are closed.