ఇంటి లోపలి నుండి ఒక ముగ్గురు స్త్రీలు బయటకు వస్తూ ఇలా బాధ పడుతూ తినకుండా ఉంటే రోజులు గడుస్తాయా,ఇప్పటికే ఒక రోజు గడిచిపోయింది ఏదో ఒకటి చేసి , ఎలాగోలా సింపుల్ గా ఇంటిలోనే కూర్చోబెట్టి జరిపించాలి గాని ఊరికే ఉంటే ఎలా అని తమలో తాము ముగ్గురు గొణుక్కుంటూ వెళ్ళిపోతారు. మహి వాళ్ళను చూసి అమ్మకు బాగా తెలిసిన వాళ్ళు అని చెబుతుంది.
వెంటనే లోపలికి వెళ్లగా ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు భోజనాలు తీసుకొని రాగా అన్ని హాల్ లో పెట్టి ఉండగా అత్తయ్య కోసం బెడ్ రూమ్ లోకి వెళ్లగా బాధపడుతూ పడుకొని ఉండగా, లోపలికి వెళ్లగా నన్ను చూసి అటువైపు తిరిగి పడుకోగా ,హాల్ లోకి వచ్చి ప్లేట్ లో అన్నం పెట్టుకొని మహికి ఇచ్చి అమ్మకు తినిపించమని చెప్పి పంపగా అప్పటికి తినకపోవడంతో చిన్నాను పిలువగా , తాను చెప్పిన విషయం ఎవరు పట్టించుకోకుండా ఉండటంతో కోపంగా నా దగ్గరికి రాగా birthday విషెస్ చెయ్యగా కోపంగా థాంక్స్ మామయ్య అని చెప్పి సోఫా లో కూర్చుండిపోతాడు.
చిన్న పక్కనే కూర్చుని చూడు నీవల్ల అమ్మ ఎలా తినకుండా భాధపడుతుందో , నువ్వు ఇప్పుడు వెళ్లి అమ్మ తినేటట్లు చేస్తే సాయంత్ర నీ బర్త్డే నేను ఘనంగా జరిగేలా చేస్తాను అని చెప్పగా , అవునా మావయ్య అయితే ok అని చిన్న అత్తయ్య రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మ ఆకలిగా ఉంది అని చెప్పగా అత్తయ్య వెంటనే లేచి మహి చేతిలో ఉన్న ప్లేట్ ను ఆత్రంగా తీసుకొని చిన్న కు తినిపించబోగా , నువ్వు తింటేనే నేను తినేది అని అలుగుతూ చెప్పగా సరే అని కళ్ళు తుడుచుకుని తను ఒక ముద్ద తిని ఇద్దరికి తినిపించగా అది వాకిలిలో నుండి చూడగా కొద్దిగా మనసు హాయిగా కుదుటపడింది. పూర్తిగా తిన్న తరువాత మహి బయటకు వచ్చి థాంక్స్ బావ అని చెప్పి మరొక ప్లేట్ లో అన్నం కలుపుకొని పైన రూమ్ లో ఉన్న వర్షిని తినడానికి తీసుకు వెళ్తుంది.

👌👌👌👌