జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 8 52

చిన్న బెడ్ రూమ్ లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి మామయ్య నా పని పూర్తి చేశాను మరి నీ మాట అని చెప్పగా , మా మంచి చిన్న అని పైకి ఎత్తుకొని చెంపపై ముద్దు పెట్టి అమ్మకు మరియు అక్కయ్యకు చెప్పి రా బయటకు వెళ్తున్నామని అని చెప్పగా పరిగెత్తుకుంటూ అమ్మకు చెప్పి , మహికి చెప్పడానికి పైకి వెళ్లగా చిన్న తో పాటు మహి కూడా రెడి అవుతారు.

సమయం వొంటి గంట అవుతుండగా తలుపు ముందరికి వేసి ముందుగా పెయింట్ షాప్ కు వెళ్లి మొత్తం ఇంటికి అంటే ఇప్పుడు సమయం లేదు కాబట్టి బయటి గోడలకు మొదట రంగు వేయించాలి అని నిర్ణయించుకొని వాళ్లకు వివరించగా ముందుగా ఇంటిని చూడాలని పనివాళ్ళు చెప్పగా వాళ్ళను తీసుకొని వెళ్లి చూపించి పిలుచుకొని రాగా ఏమేమి కావాలో మొత్తం అంచనా వేసి చెప్పగా వెంటనే చక చక డబ్బులు పే చేసి మొత్తం సామాగ్రిని ఆటో లో పెట్టి వాళ్ళతో పాటు ఇంటికి పంపించి , బెస్ట్ భేకరీకి వెళ్లి 3 స్టెప్స్ ఉండే కేక్ ఆర్డర్ చేసి 3 గంటలకళ్ల కావాలని చెప్పి అడ్వాన్స్ పే చేసి , రేపటి కోసం ఇంటికి దగ్గరలోని S S ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఒక 500 పై మందికి మాములుగా కాకుండా ప్రత్యేకమైన ఒక లిస్ట్ చెప్పి భోజనాలు ఉండాలని చెప్పి సగం అడ్వాన్స్ ఇచ్చి decoration వాళ్ళను పిలిపించమనగా 10 నిమిషాల్లో వాళ్ళు రాగా ఫంక్షన్ దేనికో వివరించి ఇప్పటివరకు ఎవ్వరు చేయించుకో లేని విధంగా బయటి నుండి లోపలి వరకు అలంకరించాలి బయట పెద్ద బోర్డింగ్ ఉండాలి అని చెప్పి అది రాసి ఇచ్చి, ఎంత డబ్బు అయినా పర్వాలేదు అని చెప్పి వాళ్ళు అడిగిన డబ్బును ఇచ్చి , అలాగే తమ ఇంటిలో birthday 4 గంటలకు ఫంక్షన్ ఉంది కొంత మంది ద్వారా ఇంటి దగ్గర కూడా దానికి decorate చెయ్యాలి అని చెప్పగా ok సర్ అని చెప్పి నలుగురిని పంపగా అప్పటికి తమ దగ్గర ఉన్న వస్తువులను తీసుకొని వెనుక వాహనంలో పెట్టి ఇంటికి పిలుచుకొని వెళ్లగా పెయింట్ కొట్టేవాళ్ళు తమ పని చేసుకొని పోతుండగా, ఎండిపోయిన మొక్కల ప్లేస్ చూపించి 4 గంటల లోపల చేసేయ్యాలని చెప్పి కొంత డబ్బు ఇచ్చి ఏమైనా వస్తువులు కావాలి అంటే ఈ డబ్బును వాడండి అని చెప్పి మాకు కొద్దిగా పని ఉంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చెయ్యండి అని వాళ్ళ పనికి గౌరవమిస్తూ చెప్పి ఇంటిలో ఉన్న మొబైల్ తెప్పించుకుని దానిలోకి ఒక 500 టాక్ టైం వేసి చిన్నాను పిలిచి నీకు నీ పుట్టినరోజు ఫంక్షన్ కు ఎంత మందిని పిలవాలి అనుకుంటే అంత మందిని పిలవమని చెప్పి , మీ స్నేహితులు నెంబర్లు ఉన్నాయా అని అడుగగా బుక్ లో మొత్తం ఉన్నాయి మావయ్య అని చెప్పగా అయితే అందరిని పిలువు అని చెప్పి లోపలికి వెళ్ళి తలుపు వేసుకో అని చెప్పి , వచ్చిన పిల్లలకు సంవత్సరం మొత్తం గుర్తుండి పొయ్యేలా ఏదో ఒకటి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉండగా మంచి ఆలోచన రాగా స్కూల్ పిల్లలకు అవసరమయ్యే వస్తువుల షాప్ కు వెళ్లి ప్రతి దాంట్లో ఒక నాణ్యమైన స్కూల్ బ్యాగ్ , ఒక జామెట్రీ బాక్స్ , పెన్సిల్ , మెండరు మరియు రబ్బరు బాక్స్ లను ఉంచి గిఫ్ట్ బాక్స్ మాదిరి ఒక 100 ప్యాక్ చెయ్యమని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి ఒక గంటలో వస్తామని చెప్పి , మహి మొబైల్ లోకి కొంత టాక్ టైం ట్రాన్స్ఫర్ చేసి రేపటి ఫంక్షన్ కు నాన్న తరుపు బంధువులను మరియు నీ స్నేహితులను పిలవమని చెప్పి షాపింగ్ మాల్ వైపు వాహనాన్ని తిప్పాను.

1 Comment

Comments are closed.