జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 8 52

చెయ్యి పట్టుకొని నీడలోకి తీసుకొని వెళ్తుండగా నాకు వస్తున్న కోపానికి తనని నా వైపుకి తిప్పుకుని చేతితో చెంప చెల్లుమనిపించగా మహి దుఃఖిస్తూ చేతిని చెంపపై పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ నా వైపు దీనంగా చూడగా, హృదయం కరిగిపోయి తన మెడ మీద చెయ్యి వేసి గుండెలపై తన తలను ఉంచి ప్రేమగా తలపై నిమురుతూ , నిన్ను కొట్టినందుకు క్షమించు మహి నిన్ను ఆ పరిస్థితులలో చూసి నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను అని కళ్ళల్లో నీరు కారుస్తూ చెపుతూ నీడలోకి తనని తీసుకువెళతాడు.

కొద్దిసేపటి తరువాత నా రెండు చేతులతో ఆమె చెంపలను సున్నితంగా పట్టుకొని తన ముఖం లోకి బాధగా చూస్తూ ఏమి జరిగింది అని అడుగగా, నిన్న పొద్దున్న 6 గంటలకు వర్షిని పుష్పవతి అయ్యింది అని తెలియగా అమ్మ సంతోషించి అందర్నీ పిలిచి వేడుక జరపాలని జానకి అత్తమ్మ పంపించే డబ్బుతో జరిపించాలని బయటకు తియ్యగా అప్పుడే లేచిన నాన్న దానిని చూసి అమ్మ చేతిలో నుండి లాక్కొని తాగడానికి వెళ్ళిపోయాడు. అమ్మ ఎంత చెప్పినా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు.

ఇప్పుడెలా అని అమ్మ భాధపడుతుండగా ఒక గంట తరువాత కొంత మంది లోపలికి వచ్చి మీ ఆయన మా దగ్గర అప్పు తీసుకొని ఈ ఇంటిని తాకట్టు పెట్టాడు కావున రెండు రోజుల్లో మొత్తం ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించగా , అమ్మ ఎదురు తిరగగా ఒక వ్యక్తి ముందుకు వచ్చి అమ్మ భుజం పై చెయ్యి వేసి చాలా అసభ్యంగా మాట్లాడాడు బావ అని ఇంకా బాధపడుతూ ఎడవగా ఒక్కసారిగా నా కళ్లల్లో కోపంతో నీళ్లు కారసాగాయి. రెండే రోజులు మొత్తం ఖాళీ చేయాలని భేదిరించి వెళ్లిపోయారు.

1 Comment

Comments are closed.