జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 8 51

అమ్మకు ఏమి చెయ్యాలో తోచక నిన్ననే మీకు ఫోన్ చేస్తే మీరు ఊరిలో లేరని అమ్మకు కాళ్ళు చేతులు ఆడక ఏడుస్తూనే ఉంది. సాయంత్రం వరకు ఏడుస్తున్న అమ్మ దగ్గరికి చిన్న వచ్చి అమ్మ నా స్నేహితులంతా నీ పుట్టినరోజుకు ఒక్కసారి కూడా పిలవవు మా పుట్టినరోజును మాత్రం మొదటగా నువ్వే ఉంటావు అని చెప్పగా రేపు సాయంత్రం వచ్చెయ్యండి మా ఇంటికి అని మాట ఇచ్చానని అమ్మకు చెప్పి అమ్మ ఎలాగైనా రేపు నా పుట్టినరోజు జరుపుకోవాల్సిందే అని మారాం చెయ్యగా అమ్మకు ఏమి చెయ్యాలో తోచక భోజనం కూడా చేయకపోవడంతో , కనీసం చిన్న పుట్టినరోజు అయినా జరపాలని నా స్నేహితురాలు బంధువుల షో రూమ్ లో ఇలా పనికి ఒప్పుకున్నాను అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పగా , అదంతా విన్న వెంటనే నా గుండె బద్దలైనట్లు వొళ్ళంతా జలధరించి చెమటలు పెట్టగా ఇంటికి వచ్చిన వారిని గుర్తు చేసుకుంటూ కోపంతో ఊగిపోతూ గోడకు ఆనుకొని తలను గోడకు వెనుక కొట్టుకోసాగాను.

అది చూసి వేగంగా ముందుకు వచ్చి మహి నా తల వెనుక చేతిని అడ్డం పెట్టి బావ ఏంటిది నువ్వే ఇలా అయిపోతే ఎలా అని నా వొళ్ళో ఏడుస్తూ వాలిపోగా, అదేమీ లేదు బంగారు తట్టుకోలేకపోయాను అని నా రెండు చేతులతో కన్నీళ్లను తుడుచుకుని పక్కనే దిమ్మ ఉండగా మహిని దానిపై కూర్చోబెట్టి నేను వచ్చేసానుగా ఇక నేను చూసుకుంటాను అని తన ముందు మోకాళ్లపై కూర్చొని చేతులతో తన కన్నీళ్లను తుడిచి నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి , ఒక చేతితో చెంపపై సున్నితంగా నిమురుతూ బాధను దిగమింగుకొని జేబులో ఉన్న మొబైల్ అందుకొని అమ్మకు కాల్ చేసి వర్షిని గురించి చెప్పగా అమ్మ మిక్కిలి సంతోషిస్తూ పక్కనే ఉన్న అంటీ కి గట్టిగా విషయం చెబుతూ , ఎప్పుడు అంట కూర్చోబెట్టేది అని అడుగగా రేపు మంచి రోజు అని పంతులు చెప్పాడని చెప్పగా అయితే నేను ,అంటీ వెంటనే ఇంటికి వెళ్లి అన్ని రకాల వంటలు తయారు చేసుకొని రేపు పొద్దున్నే వస్తాము అని చెప్పగా సరే అమ్మ అని ఫోన్ కట్ చేసి మహిని తీసుకొని ఇంటికి భయలుదేరాము.

బయటకు రాగా ఎదురుగా హోటల్ కనిపించగా మీల్స్ కట్టించుకొని ఒక 10 నిమిషాలలో ఇంటికి చేరుకోగా ఇల్లు మొత్తం రంగు వెలిసిపోయి , చిన్న చిన్న మొక్కలన్ని ఎండిపోయి , కాంపౌండ్ గోడకు చీలికలు ఏర్పడి మొత్తం అందవికారంగా కనిపిస్తుండగా ముసలివాళ్ళ దగ్గు వినిపించగా అటువైపు చూడగా పూర్తిగా తాగడం వలన ఎముకలు తేలి ముఖం అంతా ముడుచుకొని పోయి ఎప్పుడు పోతాడా అని అన్నట్లు దగ్గుతూ ఉండగా అతడు చేసిన పనులు గుర్తుకు వచ్చి అతడిపై కోపం రాగా వెంటనే కృష్ణ కు ఫోన్ చేసి మొత్తం వివరించి అడ్రస్ ఇచ్చి ఇక్కడికి వాళ్ళను పిలుచుకొని రమ్మని చెప్పాను.

1 Comment

Comments are closed.