జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 7 71

కొద్దిగా ముందుకు వెళ్లగా అదే రంగు కారు వాహనాలను దాటడానికి ప్రయత్న చెయ్యగా అదుపు తప్పి రోడ్ పక్కనే ఉన్న గుంతలోకి దూసుకు పోయినట్లు తెలుస్తుండగా , వర్షం లో కూడా జనాలు గుంపుగా చేరితుండగా అది చూసిన మహేష్ ముందుకు వెళ్లి రోడ్ పక్కనే వాహనాన్ని ఆపి అమ్మ ఇక్కడే ఉండమని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా అందరూ చూస్తున్నారు తప్ప కిందకు దిగి ఏమి జరిగిందోనని ప్రయత్నం చేయలేదు. వెంటనే కిందకు దుంకి చూడగా ముందు సీట్లలో ఇద్దరు ముందుకు వాలిపోయి ఉన్నారు.

డోర్ తెరవడానికి ప్రయత్నించగా ఇరుక్కుపోయి ఉండటంతో రెండు చేతులతో బలంగా లాగగా కిర్రుమని శబ్దం చేస్తూ కొద్దిగా తెరుచుకోవడంతో ఇద్దరు మగవాళ్ళు డ్రైవర్ సీట్ పక్కకు దూకి ఒకేసారి డోర్ ని లాగగా తెరుచుకొని డ్రైవింగ్ సీట్ లో ఉన్న అతన్ని వెనుకకు సీట్ లోనికి వాల్చగా తలకు దెబ్బ తగలడం వల్ల రక్తం కారుతుండటంతో అంబులెన్స్ అని ఇద్దరు అరుస్తుండగా , డోర్ ను మరికొంత తెరువగా ఒక మహిళ ఉండటంతో నెమ్మదిగా వెనక్కు వాల్చడంతో రెండు చేతులను కడుపుపై పెట్టుకొని స్పృహ కోల్పోపోయి ఉండటం చూసి ఒక్కసారిగా వొళ్ళంతా గగుర్పాటుకు లోనయ్యి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి.

ఆమె కడుపుతో ఉండటం, నొప్పులు రావడం వల్లనే అంత వేగంగా వెళ్తున్నారని గ్రహించి అంబులెన్స్ వచ్చేవరకు ఆగడం మంచిది కాదు అని మిగితావారికి చెప్పి కొద్దిగా వొంగి రెండు చేతులను ఆమె కింద వేసి జాగ్రత్తగా కారు లో నుండి బయటకు తీసి పక్కనే రోడ్ మీదకు పైకి ఎక్కడానికి దారి ఉండటంతో వేగంగా పైకి వస్తుండగా వర్షపు చినుకులు ఆమె ముఖం మీద పడగా స్పృహ వచ్చి నొప్పులకు రెండు చేతులను తన కడుపుపై వేసుకొని తన కడుపులో బిడ్డను రక్షించమన్నట్లు తన కళ్ళల్లోకి చూడగా మహేష్ హృదయం కొట్టుకోవడం ఒక్కసారిగా పెరుగగా పరిగెత్తుకుంటూ తన వాహనం దగ్గరికి వస్తుండగా , అదంతా చూస్తున్న జానకి త్వరగా వాహనం దిగి వెనుకకు వచ్చి డోర్ ను పూర్తిగా తెరువగా జాగ్రత్తగా లోపల పడుకోబెట్టగా జానకి ఆమె పక్కనే కూర్చునగా , తన వెనుకే ఇద్దరు గాయపడిన వ్యక్తిని కూడా లోపల పడుకోబెడుతుండగా వాహనం నుండి ట్రాలీ ని వేరు చేసి వర్షం లో కూడా ఇంత వేగంగా వీలు అయితే అంత వేగంగా హాస్పిటల్ వైపు పోనిస్తాడు.

2 Comments

  1. bro part 6 ravadam ledhu Cen you pls send my email full story

Comments are closed.