ప్రేమ కథలు – Climax 91

“వాడు పోయే వాడు పోయాడు ఇది అక్కడే ఉండకుండా ఇంటికి వచ్చి పరువు బజారు లో పెట్టింది అన్న నాకూ ఒక కూతురు ఉంది నీకు ఇంకో కూతురు ఉంది రేపు సాయంత్రం నా కూతురికి పెళ్లి చూపులు ఇప్పుడు ఇది ఇక్కడ ఎందుకు ఉంది దాని మొగుడు ఎక్కడ అంటే తల ఎక్కడ పెట్టుకోవాలి” అన్నాడు విద్య బాబాయ్ దానికి విద్య నాన్న “దాని కాలేజీ లో ఎవడో రోజు వెంట పడుతున్నాడు ఈ విషయం ఊరిలో తెలిస్తే పరువు పోతుంది అని దానికి తొందరగా పెళ్లి చేశా కానీ దాని మొగుడు ఇలా మధ్యలో వదిలేసి పోతాడు అని నేను మాత్రం ఊహించాన్న సరే వచ్చింది కూతురు కదా బయటికి పో అని చెప్పలేను కాబట్టి రేపు ఒక్క రోజు దాని vro ఆఫీస్ లో మన పొలం తాలూకు పనులు ఉన్నాయి కదా దానికి పంపిదాం ” అన్నాడు ఇది అంత విన్న విద్య తన ధైర్యం అని నమ్మే తన తండ్రే తనని భారం అనుకుంటున్నాడు అని తెలుసుకొని బాధ పడింది వెంటనే తన లగేజ్ సర్దుకోని తిరిగి చండీగఢ్ వచ్చింది ఎవరికి చెప్పకుండా ఇలా ఇంట్లో అమ్మాయి చెప్పకుండా వచ్చేసింది అని బాధ లేకుండా కనీసం ఎక్కడ ఉన్నావు ఎక్కడికి వెళ్లావు అని విచారణ కూడా లేకపోవడంతో విద్య కీ వినయ్ మాటలు గుర్తుకు వచ్చాయి “ఫ్యామిలీ అనేది ఒక బరువైన బాగ్ లాంటిది దాని మోసే కొద్ది అలిసిపోతాము పైగా ఆ బాగ్ లో నువ్వు ఏది మోసిన అది నీతో నీ ప్రయాణం చివరి వరకు రాదు నీ ప్రయాణం చివరి వరకు నీతో ఉండేది నువ్వే కాబట్టి అని వదిలేసి నువ్వు నీతో ప్రయాణం చెయ్యి” అది గుర్తు చేసుకొని తన ఫ్రెండ్ పింకి లాగే తను పాష్ గా లగ్జరీ గా ఎంజాయ్ చేయాలి అనుకున్నది గుర్తుకు వచ్చి ఇప్పుడు ఇక్కడ తనకు అడ్డు చెప్పే వాళ్లు లేరు అని నిర్ణయం తీసుకుంది తన లైఫ్ స్టయిల్ మార్చుకుంది శిల్పా, మమత తో కలిసి చండీగఢ్ మొత్తం పార్టీ షాపింగ్ ఇలా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టింది.

ఇలా వినయ్ విద్య డైరీ చదువుతూ ఉంటే శిల్పా వెనుక నుంచి వచ్చి వినయ్ బుజం పైన చెయ్యి వేసి “నువ్వు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో మేము ఉన్నాం కదా చూసుకుంటాం” అని చెప్పింది దాంతో వినయ్ ఇంటికి వెళ్లాడు డైరీ తీసుకుని వెళ్లాడు అప్పుడు ఆ డాక్టర్ విద్య నీ చూడడానికి వచ్చాడు వచ్చి విద్య పక్కన కూర్చుని “బేబీ నేను కిషన్ నీ కళ్లు తెరువు” అని ఏడుస్తు కూర్చున్నాడు.

ఇంటికి వెళ్లిన వినయ్ రెడీ షవర్ కింద స్నానం చేస్తూ ఉండగా ఎవరో తలుపు కోడితే వెళ్లి తీశాడు చూస్తే సెక్యూరిటీ ఆఫీసర్లు చిన్న ఎంక్వయిరీ కోసం వచ్చాము అని చెప్పారు ఆ తర్వాత లోపలికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా ఆ కుర్రాళ్లు వాడిన బైక్ నెంబర్ కాలనీ సెక్యూరిటీ గేట్ దెగ్గర రికార్డ్ అయిన వీడియో లో చూసి దాని రిజిస్ట్రేషన్ అడ్రస్ చూస్తే ఈ ఇల్లు చుపిస్తుంది దాంతో వినయ్ అర్థం కాక బయటకు వచ్చి తన గ్యారేజ్ లో ఉన్న బైక్, కార్ నెంబర్ చెక్ చేశాడు ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు తెచ్చిన నెంబర్ విద్య కొత్త కార్ నెంబర్ ఒక్కటే అంటే వాడు ఎవడో విద్య నీ క్లోజ్ గా ఫాలో అయ్యి పక్క ప్లానింగ్ తో వచ్చి ఎటాక్ చేశారు ఆ తర్వాత సెక్యూరిటీ అధికారి లు వెళ్లిపోయారు వినయ్ బయటికి వెళ్లి వాళ్ల కాలనీ కీ వచ్చే అని రూట్ మ్యాప్ లో ఉన్న cctv, ట్రాఫిక్ కెమెరా లో ఆ బైక్ కీ సంబంధించిన ఏమైన క్లూ దొరుకుతుంది ఏమో అని అంతా వెతుకుతూ ఉన్నాడు, హాస్పిటల్ లో ఉన్న కిషన్ విద్య నీ వదిలి వెళ్లాలి అని అనుకోవడం లేదు బయట ఉన్న రామ్, మమత, శిల్పా కీ టెన్షన్ పెరిగిపోతుంది వినయ్ వస్తే ఏమీ జరుగుతుందా అని కంగారు పడుతూ ఉన్నారు.