ప్రేమ కథలు – Climax 91

డాక్టర్ కిషన్ కౌశ్ల చండీగఢ్ లోనే టాప్ న్యూరో సర్జన్ తను డీల్ చేసిన ప్రతి కేసు లో అతనికి కేసు ఉంది ఇంత సక్సెస్ ఫుల్ కెరీర్ లో ఆయనకు ఉన్న ఒకే ఒక బ్లాక్ మార్క్ తన సొంత భార్య నీ కాపాడుకోలేక పోయాను అంతే కాక దానికి కారణం తనే అనే బాధ ఒక్కటీ ఎప్పుడు తన మెదడు లో తొలిచి వేస్తుంది, తన బాధ మరిచి పోవడానికి రోజు సాయంత్రం బార్ లేదా పబ్ లో రెండు పెగ్ లు తాగి తన బాధ కోపం అంతా తీర్చుకుంటాడు అలా ఒక రోజు పబ్ లో ఉండగా విద్య, శిల్పా ఇద్దరు వచ్చారు అప్పుడు విద్య డాన్స్ ఫ్లోర్ లో డాన్స్ చేస్తూ సందడి సందడిగా ఉంది ఆ టైమ్ లో కిషన్ విద్య నీ చూశాడు చూడగానే చాలా బాగుంది అనిపించింది అంతే కాకుండా ఇంత అందమైన అమ్మాయి తన జీవితంలో ఎందుకు లేదు అని ఆలోచిస్తూ ఉన్నాడు విద్య నీ చూస్తూ ఉండగా కిషన్ కీ తన వయస్సు తనకే సగం తగ్గింది అనిపించింది.

ఆ మరుసటి రోజు కిషన్ ఒక సూపర్ మార్కెట్ లో సరుకులు తీసుకుంటూ ఉండగా మళ్లీ విద్య నీ చూశాడు ఒక చిన్న పాప తో తను ఇంకో చిన్న పిల్లల అనిపించింది విద్య లోని అమాయకత్వం, cuteness, తన అల్లరి కిషన్ లో ఏదో చిలిపి కోరిక రేపింది ఆ తర్వాత బిలింగ్ దెగ్గర కిషన్ తన పర్స్ కోసం చూశాడు అది మిస్ అయ్యింది అని అర్థం అయ్యింది అప్పుడు విద్య ముందుకు వచ్చి అతని బిల్ కట్టింది ఆ తర్వాత బయట ఆటో కోసం చూస్తున్న విద్య నీ చూసిన కిషన్ “హలో రండి నేను లిఫ్ట్ ఇస్తా” అని అన్నాడు దాంతో విద్య పర్లేదు అనింది “లోపల నాకూ సహాయం చేశావు కదా నీకు ఇది హెల్ప్ అనుకో” అన్నాడు దానికి విద్య కూడా సరే అని వెళ్లి అతని కార్ ఎక్కింది ఆ తర్వాత ఇద్దరూ ఒకరి గురించి ఒకరు పరిచయం చేసుకున్నారు ఆ తర్వాత విద్య కిషన్ నీ ఇంట్లోకి పిలిచి కాఫీ ఇచ్చింది కిషన్ ఇళ్లు మొత్తం చూసి “ఇళ్లు చాలా బాగుంది నీకు మంచి టేస్ట్ ఉంది ” అన్నాడు దానికి విద్య “థాంక్స్ కానీ ఇది అంతా నా హస్బెండ్ టేస్ట్” అని చెప్పింది దాంతో కిషన్ కీ పోరబోయింది దాంతో విద్య అతని తల పైన మెల్లగ కొడుతూ ఉంటే కిషన్ కీ తనలో తన భార్య కనిపించింది దాంతో వెంటనే పని ఉంది అని చెప్పి వెళ్లిపోయాడు.

కార్ లో వెళుతున్న కిషన్ కీ తన గతం తన్నుకొని వచ్చింది చిన్న వయసులోనే పెళ్లి అయ్యింది తన అత్త కూతురు తో ఆ అమ్మాయి అంటే తనకు ఇష్టం ప్రేమ కానీ కిషన్ గురించి ఎవరికీ తెలియనిది ఏంటి అంటే తనకు దేని మీద ఇంటరెస్ట్ ఉండదు ఈ రోజు ఉన్నది రేపు ఉండదు, అలా తన మరదలు తో పెళ్లి అయిన మూడు నెలల తరువాత నుంచి తను తన ముందు ఉంటే చిరాకు పడ్డేవాడు తనని అసహించుకుంటు ఉండేవాడు ఆ తర్వాత ఆమె తల్లి కాబోతోంది అని తెలిసి బిడ్డ పుట్టే వరకు బాగా చూసుకున్నాడు ఆ తర్వాత మెల్లగా మళ్లీ మామూలుగా అయిపోయింది వాళ్ల మధ్య బంధం ఇలా తన భర్త మనోభావాలు రోజుకు ఒకటి మారుతు ఉంటే అతని మార్చుకోలేక, అతనికి నచ్చినట్లు ఎలా ఉండాలో తెలియక సతమతం అవుతు ఉంది అందుకే ఇంక వేరే ఆలోచన లేకుండా ఆత్మహత్య చేసుకుంది తనని కాపాడాలి అని అన్నిరకాల ప్రయత్నాలు చేశాడు ప్రాణం కాపాడుకోగలిగాడు కానీ తను ఎప్పటికీ మంచం కీ అతుకు పోయే పరిస్థితి లో ఉంది.

(ప్రస్తుతం)