ప్రేమ కథలు – Climax 91

ఆ బైక్ కోసం కాలనీ చుట్టూ పక్కల ఉన్న కాఫీ షాప్ లో cctv footage చూస్తూ ఉంటే తనకి విద్య కిషన్ ఒక కాఫీ షాప్ లో కలిసి ఉండటం కనిపించింది ఆ తర్వాత వినయ్ నవ్వుకోనీ విద్య తన జీవితం నుంచి వెళ్లిపోయింది అని సంతోష పడ్డాడు ఆ తర్వాత హాస్పిటల్ కీ వెళ్లాడు అప్పుడు కిషన్ ఒక రూమ్ లో పాయిజన్ injection ఎవరికో ఇవ్వడం చూశాడు వినయ్ వెంటనే ఆ రూమ్ లోకి వెళ్లి అది ఆప్పాడు.

కిషన్ ఇస్తున్న injection నీ ఆప్పడం తో బయట ఉన్న లాయర్, సెక్యూరిటీ అధికారి, డాక్టర్ లు లోపలికి వచ్చారు కిషన్ పాయిజన్ injection ఇస్తున్నాడు అని వినయ్ చెప్తే అది కోర్టు ఆర్డర్ ప్రకారం mercy killing అని చెప్పారు ఆయన భార్య 15 సంవత్సరాల నుంచి ఇలాగే బెడ్ పైన ఉండి పోవటంతో ఇంక ఆమెకు శాశ్వతంగా సెలవు ఇద్దాం అని నిర్ణయించారు అని చెప్పారు దాంతో వినయ్ ఇది ఏమైనా విద్య నీ పెళ్ళి చేసుకోవడానికి చేస్తున్నాడా అని అనుకున్నాడు అప్పుడే ఒక 19 సంవత్సరాల ఒక అమ్మాయి ఆవేశంగా లోపలికి వచ్చి కిషన్ చేతిలో ఉన్న injection నీ తీసుకొని విసిరేసింది కోపంగా కిషన్ వైపు “చాలు డాడీ ఇన్ని రోజులు అమ్మ నీ tourture చేసింది చాలు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది తనని అలాగే ఉండనివు ఇంకొక సారి ఇలాంటివి ట్రై చేస్తే బాగుండదు అయిన ఇది అంత that bitch విద్య కోసమే కదా I will see end of that bitch ” అని కోపంగా బయటికి వెళ్ళింది కిషన్ కూతురు రీహ బయట తలుపు దగ్గర ఉన్న కిషన్ కొడుకు రోహిత్ “దీది ఆగు ప్లీజ్ ” అంటూ కోపంగా ఉన్న రీహ నీ ఆపాలని చూశాడు కానీ తను ఆవేశంలో వెళ్లిపోయింది అ తరువాత వినయ్ నీ చూసిన రోహిత్ “హే బ్రో మొత్తానికి నిన్ను కలిశాను ” అని అన్నాడు.

వినయ్ : నేను నీకు ఎలా తెలుసు

రోహిత్ : విద్య మేడమ్ ఎప్పుడు నీ గురించి చెప్పేది

వినయ్ : మేడమ్ ఏంటి

రోహిత్ : నేను విద్య దగ్గర MBA entrance కీ commerce ట్యూషన్ తీసుకుంటూన్నా

వినయ్ : అవునా

రోహిత్ : హా ఒక్కో రోజు మీ ఒక్కో రోజు మా ఇంట్లో

వినయ్ : మీ అక్క కీ మీ నాన్న కీ ఏంటి గొడవ

రోహిత్ : అమ్మ ఇలా అవ్వడానికి నాన్నే కారణం అని అక్కకి చిన్నప్పటి నుంచి కోపం పైగా ఇప్పుడు నాన్న విద్య తో క్లోజ్ గా ఉండటం తో అక్కకు కోపం ఎక్కువ అయ్యింది

వినయ్ : మీరు ఇద్దరు ఒకే వయసు లా ఉన్నారు

రోహిత్ : మేము twins

ఆ తరువాత విద్య నీ చూసి ఇంటికి వెళ్లాడు విద్య డైరీ తీసి చదవడం మొదలు పెట్టాడు.