ప్రేమ కథలు – Climax 91

విద్య స్ప్రుహ లోకి వచ్చింది అని ఫోన్ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాడు వినయ్ కాకపోతే అక్కడ విద్య ఫ్యామిలీ కూడా ఉంది వాళ్లు అంతా వినయ్ దే తప్పు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు దాంతో వినయ్ విద్య బాబాయ్ నీ లాగి కొట్టాడు అందరూ సైలెంట్ అయ్యారు అప్పుడు వినయ్ “4 నెలల నుంచి మీ ఇంటి అమ్మాయి ఏమైంది అన్న దిగులు లేదు పట్టింపు లేదు కానీ ఇప్పుడు రోషం పుట్టుకొని వచ్చిందే తన జీవితంలో ఒక కష్టం వస్తే తన కుటుంబం ఆదుకుంటుంది అనే దైర్యం తో ఇంటికి వస్తే సొంత ఇంట్లో పరాయి మనిషిని చూసినట్లు చూశారు ఇప్పుడు ప్రేమ నటిస్తున్నారు నిన్నటి వరకు కూడా నాకూ విద్య మీద ఉన్నది జాలి, లేదా కన్సర్న్ అనుకున్నా కానీ ఇప్పటి నుంచి చెప్తున్నా విద్య నా భార్య I love her ఇక నుంచి మీకు తనకు ఎలాంటి సంబంధం లేదు ఇంకోసారి నా ఇంటి వైపు వస్తే చంపేస్తా” అన్నాడు ఇది అంతా లోపలి నుంచి వింటున్న విద్య ముందు తన వాళ్లను తిట్టినందుకు కోపడిన తరువాత తన మీద ప్రేమ ఉంది అని చెప్పినందుకు సంతోషించింది ఆ తర్వాత వినయ్ లోపలికి వెళ్లి విద్య చెయ్యి తన చేతిలోకి తీసుకుని “నేను ఇంకా పూర్తిగా మారలేదు దారి తప్పిన నా జీవితంలో నువ్వు నను నా పిచ్చితనాన్ని భరిస్తు ఉండగలను అని నమ్మితే నాతో ఉండు లేదు అంటే మన ముందు ప్లాన్ ప్రకారం విడిపోదాం” అని అన్నాడు దానికి విద్య వినయ్ నీ మీదకు లాగి ముద్దు పెట్టింది తనకు ఓకే అని సంకేతంగా ఆ తర్వాత కిషన్ తన పిల్లల తో వచ్చి వినయ్ కీ విద్య కీ సారీ చెప్పి ఇక నుంచి తన పిల్లల కోసమే బ్రతుకుతా అని చెప్పాడు రోహిత్ విద్య నీ పట్టుకొని ఏడుస్తు సారీ చెప్పాడు విద్య ప్రేమగా వాడి తల నిమ్మురుతు నవ్వింది క్షమించాను అన్నట్లుగా,కిషన్ వెళ్లుతు రామ్ వైపు తిరిగి సారీ చెప్పాడు వినయ్ ఎందుకు అని అడిగాడు ఒకసారి విద్య తో క్లోజ్ గా ఉన్నాడు అని కోపం వచ్చి కిషన్ కీ వార్నింగ్ ఇచ్చాడు అప్పుడు కిషన్ రామ్ చేయి విరిచాడు ఇది విని వినయ్ పడి పడి నవ్వుకున్నాడు.

(3 నెలల తరువాత)

ప్రిన్స్ జైల్ కీ వెళ్లడం వల్ల దానికి తోడు వినయ్ న్యూయార్క్ లో ఇద్దరు ఫైటర్స్ నీ కొట్టిన వీడియో వైరల్ అవడం వల్ల ఇండియన్ స్పాన్సర్స్, ఫారిన్ స్పాన్సర్స్ వినయ్ దగ్గరికి వచ్చాడు దాంతో వినయ్ ఇప్పుడు ఫుల్ టైమ్ MMA ఫైటర్ గా సెటిల్ అయ్యాడు అలా తన మ్యాప్ లో v ఆకారం లో చివరి ప్రదేశం వెనిస్ అక్కడికి విద్య తో కలిసి వెళ్లి ఫైనల్ పిన్ కొట్టాడు అలా ప్రపంచం మీద తన సంతకం చేశాడు వినయ్ ఆ తర్వాత ఇద్దరూ సాయంత్రం ఇద్దరు వెనిస్ లో ఒక రెస్టారెంట్ కీ వెళ్లారు వాళ్లు వెళ్లి కూర్చోగానే వెయిటర్ బిల్ ఇచ్చాడు అది చూసి విద్య “hey we just came now” అనింది అప్పుడే వెనుక టేబుల్ నుంచి “check please” అని వినిపిస్తే అటు చూసి షాక్ అయ్యింది విద్య అప్పుడే ఒక జంట వినయ్ టేబుల్ దగ్గరికి వచ్చి “excuse me this is our reserved table” అన్నారు వాళ్ల వైపు చూసిన వినయ్ షాక్ అయ్యాడు వాళ్ల వెనుక టేబుల్ లో ఉన్న వాళ్లు కూడా వాళ్ల బాబు నీ తీసుకోని ముందుకు వచ్చారు వాళ్లు ఆరుగురు ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్య పోయారు ఎందుకంటే వాళ్ళు అంతా ఒకే లాగా ఉన్నారు వినయ్ టేబుల్ దగ్గరికి వచ్చిన ఆ రెండు జంటలు కార్తీక్, కీర్తి, శ్రీని, స్వీటీ ఈ మూడు జంటలు ఒకరికి ఒకరు తెలియదు ఎప్పుడు చూసుకోలేదు కానీ వీళ్లందరీ జీవితంలో ఒక అద్భుతం తమలాగే ఉండే వేరు వేరు వ్యక్తులను ఒకేసారి కలుసుకున్నారు ఆ తర్వాత అందరూ కలిసి వెనిస్ తిరుగుతూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు అలా వెనిస్ లో వాళ్ల కథ సుఖాంతం అయింది.

The end