ప్రేమ కథలు – Climax 91

విద్య కిషన్ తో మెల్లగా దెగ్గర అవ్వడం మొదలు పెట్టింది ముందు ఏదో స్నేహం కొద్ది అతనితో పాటు ఉండేది తరువాత మెల్లగా చనువు పెరిగి ఒకరి ఇంటికి మరొకరు వెళ్లే అంతగా ఇద్దరి మధ్య స్నేహం గట్టి పడింది, కిషన్ విద్య దెగ్గర ఏ విషయం దాచ్చలేదు అన్ని వివరంగా చెప్పాడు దాంతో కిషన్ కీ ఒక అర్థం చేసుకునే తోడు కావాలి అని విద్య కీ అర్థం అయ్యింది రోహిత్ విద్య ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు కాకపోతే రీహ కీ మాత్రం విద్య మీద ఎందుకో తెలియని కోపం ద్వేషం మొదలు అయ్యాయి ఒకసారి పార్టీలో శిల్పా, మమత ఇద్దరు అడిగారు కిషన్ నీ లవ్ చేస్తున్నావా అని దానికి విద్య “అది ప్రేమ, స్నేహం అని నేను చెప్పలేను ఈ సమాజం దృష్టిలో నేను ఒక పెళ్లి అయిన ఆడదాని అతను ఒక పెళ్లి అయిన మగాడు మా ఇద్దరి మధ్య ఆ అడ్డు గీత ఉంది దాని చెరిపే సాహసం చేస్తే బరి తెగించాము అంటారు కాకపోతే నా దృష్టిలో మాత్రం మాది ఒక పట్టాలు తప్పిన జీవితం లో కలిసి ప్రయాణిస్తున్న చక్రాలం నాకూ తనతో పాటు ఉండడం నచ్చింది తనకి నాలాంటి అర్థం చేసుకునే తోడు కావాలి ప్రస్తుతానికి ఇది మా ఇద్దరి మధ్య బంధం రేపు వినయ్ తిరిగి వచ్చి నా మీద ప్రేమ ఉంది అంటే నేను ఇంకా వినయ్ నే accept చేస్తాను ఒక వేళ నేను కిషన్ తో ముందు ముందు ప్రేమ లో పడితే కనుక అతనికి ప్రేయసి లా కాదు అతని పిల్లలకు తల్లి స్థానం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నా నా అవసరం కిషన్ కంటే అతని పిల్లలకు ఎక్కువ ఉంది ” అని చెప్పింది దాంతో శిల్పా విద్య నీ గట్టిగా కౌగిలించుకున్ని “నిజంగా నేను నీ ప్లేస్ లో ఉంటే కనుక వినయ్ వచ్చి కాలు పట్టుకున్న accept చేయను కిషన్ కేర్ కీ తనకే ఒకే చెప్పేదాని కానీ నువ్వు అతని పిల్లల కోసం ఆలోచించావు చూడు అక్కడ you earned my respect babes” అని మెచ్చుకుంది.

విద్య లో వినయ్ తిరిగి వస్తాడు అనే ఆశ ఇంకా తగ్గలేదు కానీ తన మనసు మెల్లగా కిషన్ వైపు లాగుతు ఉంది అలా ఒక రోజు కిషన్ పెళ్లి రోజు అని తెలిసి రోహిత్, విద్య ఇద్దరు కష్టపడి ఇంటిని డేకరెట్ చేశారు అప్పుడు కిషన్ ఇంటికి రాగానే ముందుగా తన భార్య నీ చూశాడు తను వీల్ ఛైర్ లో కూర్చొని ఉండగా వెనుక రోహిత్, రీహ ఇద్దరు కేక్ పట్టుకొని నిల్చోని ఉన్నారు దాంతో కిషన్ కొంచెం హ్యాపీ హ్యాపీగా వాళ్లతో పాటు కూర్చుని తన భార్య చెయ్యి తీసుకోని కేక్ కట్ చేసి అందరూ హ్యాపీగా ఉండగా విద్య వచ్చింది గిఫ్ట్ తనని చూడగానే కిషన్ అదుపు తప్పాడు విద్య ఆరోజు అతనికి అందం గా కొత్త గా కనిపించింది రామ్, మమత, శిల్పా కూడా పార్టీకి వచ్చారు అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉండగా విద్య బాల్కనీ లో నిల్చోని ఉంది దాంతో కిషన్ తన దగ్గరికి వెళ్ళాడు తన చేతిలో ఉన్న వైన్ తాగుతూ విద్య అందం అస్వాదిస్తు ఉన్నాడు విద్య అది ఏమీ పట్టించుకోకుండా సరదాగా మాట్లాడుతూ ఉంది అంతలో కిషన్ విద్య కురులు తన చెవి వెనకు దువ్వుతు దగ్గరగా జరిగాడు విద్య ఎమ్ చేస్తున్నావు అని అడుగుతు ఉంది అంతలో కిషన్ విద్య పెదవి పై ముద్దు పెట్టాడు ముందు కొంచెం బెట్టు చేసిన తరువాత విద్య కూడా మెల్లగా కిషన్ పెదవులు జురుకుంటుంది.

సడన్ గా పేజీలు ఖాళీగా ఉన్నాయి దాంతో వినయ్ డైరీ పక్కన పడేసి పడుకోవడానికి ప్రయత్నం చేస్తే కుదరడం లేదు తన భార్య నీ ఎవరో ముద్దు పెట్టుకున్నారు అని కాదు ఇంత జరిగిన కూడా విద్య తనని accept చేయాలి అని ఎలా ఆలోచిస్తూంది పైగా నాలాంటి వాడిని అని ఆలోచిస్తూ ఇంక తన బాధ కిషన్ ఒకడే అర్థం చేసుకోగలడు అని అర్ధం అయిన వినయ్ కిషన్ ఇంటికి వెళ్లాడు అప్పుడే రీహ స్కూటీ లో ఎక్కడికో వెళ్తుండగా చూసిన వినయ్ తనని ఫాలో అయ్యాడు తను దాదాపు ఊరి చివరికి వెళ్లి అక్కడ ఉన్న ఒక కెనాల్ లో తన బాగ్ నుంచి గన్ తీసి విసిరేయడం చూశాడు వినయ్.

మరుసటి రోజు ఉదయం సెక్యూరిటీ అధికారి లు కిషన్ ఇంటికి వచ్చారు కిషన్ కీ ఎందుకో అర్థం కాలేదు అప్పుడు ఇన్స్పెక్టర్ తన చేతిలో ఉన్న గన్ తీసి చూపించాడు “సార్ ఇది ఒక లైసెన్సు గన్ దీని రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం ఇది మీది ఈ రోజు ఉదయం కెనాల్ లో చేపలు పట్టేవారు వాళ్ల వలలో దొరికింది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంతో మేము ఇక్కడికి వచ్చాము” అని మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు రోహిత్, రీహ కీ ఫోన్ చేశాడు కానీ తను ఎత్తలేదు, ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు ఆ గన్ లో ఉన్న బుల్లెట్ విద్య బాడి నుంచి కలెక్ట్ చేసిన బుల్లెట్స్ తో మ్యాచ్ అయ్యాయి అని చెప్పారు దాంతో కిషన్ ఇది కచ్చితంగా రీహ పని అర్థం అయ్యి సెక్యూరిటీ ఆఫీసర్లను తీసుకుని రీహ కాలేజీ కీ వెళ్లారు కానీ తన ఫ్రెండ్స్ తనని అసలు చూడలేదు అని చెప్పారు దాంతో ఎన్ని సార్లు ఫోన్ చేసిన తను ఫోన్ ఎత్తలేదు ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్లు రీహ నెంబర్ నీ ట్రాక్ చేసి అక్కడికి వెళ్లారు, అప్పటికే వినయ్ నదిలో దూకిన రీహ నీ కాపాడి బయటకు తీసుకోని వచ్చాడు.

(రెండు గంటల ముందు)