ప్రేమ కథలు – Climax 91

రీహ కాలేజీ కీ వచ్చిన తర్వాత పార్కింగ్ లో ఉండగా తనకి ఒక వీడియో వచ్చింది అందులో రీహ తన గన్ కెనాల్ లో పడేసిన వీడియో వచ్చింది అది చూసి రీహ షాక్ అయ్యింది వెంటనే ఒక ఫోన్ వచ్చింది ఒక 5 లక్షలు తీసుకోని సుఖనా లేక్ పార్క్ కీ రమ్మని చెప్పాడు దాంతో రీహ తన అమ్మ అకౌంటు నుంచి డబ్బు తీసుకోని పార్క్ కీ వెళ్లింది అక్కడ ఒక బోట్ లోకి ఎక్కమని చెప్పారు అందులో ఎప్పటి నుంచో తనని ఇబ్బంది పెడుతున్న ప్రిన్స్ ఉన్నాడు (నిన్న రాత్రి రీహ ఒంటరిగా ఉంది అని తెలుసుకున్న ప్రిన్స్ రేప్ చేయడానికి వచ్చాడు కానీ రీహ బయటికి వెళ్లడం చూసి తనని ఫాలో అయ్యి తను గన్ పడేసినది వీడియో తీసి తనని కంట్రోల్ చేయాలి అని ప్లాన్ చేసాడు) రీహ డబ్బు ఇచ్చి తన వీడియో తీసేయమనింది అప్పుడు ప్రిన్స్ రీహ నీ దగ్గరకు లాగి ముద్దు పెట్టాలి అని చూశాడు అప్పుడే వినయ్ వచ్చి ప్రిన్స్ బాడిగాడ్స్ నీ కొట్టడం మొదలు పెట్టాడు (రీహ తో రాత్రి జరిగిన విషయం గురించి మాట్లాడాలి అని కాలేజీ దగ్గరికి వచ్చాడు వినయ్ కానీ రీహ కంగారుగా వెళ్లడం చూసి తనని ఫాలో అవుతూ వచ్చాడు) అలా అందరినీ కొట్టి ప్రిన్స్ దగ్గరికి వచ్చి కొడుతూన్నప్పుడు ప్రిన్స్ వెళ్లి రీహ మీద పడటం తో తను నది లో పడింది దాంతో వినయ్ ప్రిన్స్ నీ కూడా నీళ్లలో తోసి తను దూకి రీహ నీ కాపాడాడు.బయటికి వచ్చాక రీహ, ప్రిన్స్ నీ సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేశారు ఆ తర్వాత రీహ తనే తన ఫ్రెండ్ తో కలిసి విద్య మీద ఎటాక్ చేశాను అని ఒప్పుకుంది అప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్లు తన మీద కేసు ఫైల్ చేస్తుండగా రోహిత్ వచ్చి తను అబద్ధం చెప్తోంది అని అన్నాడు అప్పుడు రీహ రోహిత్ నీ ఆపాలని చూసింది కానీ కుదరలేదు దాంతో రోహిత్ ఎటాక్ చేసింది నేను నిజం చెప్పాడు.

విద్య అంటే రోహిత్ కీ చాలా ఇష్టం కానీ తనకంటే తన తల్లి అంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఆ రోజు విద్య కిషన్ ఇద్దరు ముద్దు పెట్టుకోవడం రోహిత్ చూశాడు దాంతో కోపం వచ్చి ఆ రోజు రాత్రి తన తండ్రి నీ నీలదియాలి అని అనుకున్నాడు అప్పుడు కిషన్ రూమ్ లోకి వెళ్తుండగా తనకి ఏవో మాటలు వినిపించాయి “చూడు రాధ నువ్వు అంటే నాకూ ఇప్పటికీ ఇష్టం కాకపోతే నా మనసు అర్థం చేసుకునే తోడు నాకూ కావాలి అది నీకంటే విద్య బాగా అర్థం చేసుకుంటుంది నువ్వు ఎలాగో ఎప్పుడు నాకూ మానసికంగా కానీ శారీరకంగా సుఖం ఇవ్వలేదు, నేను కోరుకున్న అందం, ఆనందం రెండు విద్య నాకూ ఇవ్వగలదు అందుకే నువ్వు శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాలని నేను mercy killing కీ అప్లై చేశా నువ్వు నా కోసం చాలా చేశావు ఈ ఒక చివరి పని చెయ్యి ” అని అన్నాడు అది విన్న రోహిత్ కీ కోపం వచ్చింది అక్కడికక్కడే తన తండ్రి నీ ముక్కలు ముక్కలుగా నరికి చంపాలి అనిపించింది కానీ విద్య నీ దారి నుంచి తప్పిస్తే చాలు అనుకోని మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్య నీ ఫాలో అయ్యి సాయంత్రం విద్య కార్ నెంబర్ నీ తన బైక్ కీ అతికించి తన ఫ్రెండ్ నీ బైక్ నడపమని చెప్పి విద్య ఇంట్లోకి వెళ్లుతున్న టైమ్ చూసి కాల్చి పారిపోయాడు కాకపోతే తనని ఇన్ని రోజులు ఒక ఫ్రెండ్ లాగా ప్రేమ పంచి చూసుకున్న విద్య నీ చంపాను అనే బాధ లో ఉన్నాడు రోహిత్ దాంతో పూర్తిగా డిస్టర్బ్ అయ్యాడు నిన్న రాత్రి ఎక్కడ సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేస్తారా అనే భయం లో తన తండ్రి గన్ తో ఆత్మహత్య కీ సిద్ధపడ్డాడు అప్పుడు రీహ వచ్చి చూసి షాక్ అయ్యింది దాంతో రోహిత్ మొత్తం జరిగింది చెప్పాడు దాంతో రీహ సాక్ష్యం నాశనం చేయడానికి గన్ పారేసింది.

ఇది అంతా విన్న తర్వాత వినయ్ కేసు వాపసు తీసుకున్నాడు సెక్యూరిటీ ఆఫీసర్లకు కొంచెం డబ్బు ఇచ్చి కేసు క్లోజ్ చేయమని అడిగాడు సరే డబ్బులు వస్తూన్నాయి అని వాళ్లు కూడా కేసు క్లోజ్ చేశారు.

రీహ, రోహిత్, కిషన్ నీ తీసుకోని వినయ్ సెక్యూరిటీ అధికారి స్టేషన్ నుంచి వాళ్ల ఇంటికి బయలుదేరాడు కిషన్ లో కోపం వినయ్ గ్రహించాడు ఇంటికి వెళ్లగానే కిషన్ రోహిత్ నీ కొట్టడానికి చెయ్యి ఎత్తాడు కానీ వినయ్ కిషన్ చెయ్యి పట్టుకుని ఆపి “కోడితే నను కొట్టు లేదా నిన్ను నువ్వు కొట్టుకో ఇక్కడ వీళ్లేవరిది తప్పు లేదు ఇక్కడ తప్పు ఉంటే అది మనిద్దరిది ఇంక ఎవరి తప్పు లేదు తప్పు చేసింది మనమే కానీ కోపం వీల పైన చూపిస్తాం నీకు నాకూ పెద్ద తేడా లేదు కాకపోతే నువ్వు సంతోషం నిన్ను వెతుక్కుంటూ రావాలి అనుకుంటావు నేను ఏది ఏమైనా సరే నా సంతోషం సాధించుకుంటా మనల్ని నమ్మి వచ్చిన అమ్మాయిలకి సంతోషం పంచలేక పోయాం అప్పుడే మనం చచ్చిపోయినట్టు అయిన నీ కంటే నేనే నయం ఆ అమ్మాయి కీ నా మీద ఎలాంటి నమ్మకం కానీ ఉద్దేశం కానీ రానివ్వలేదు నేను అన్న మాట పైన నిలబడ తనకి కొన్ని రోజులు తన జీవితం గడిపే అవకాశం ఇచ్చా కానీ నీలాగా లేనిపోని ఆశ కల్పించి నీ మీద నీకు క్లారీటి లేక ఒక నిండు ప్రాణం నీ నాశనం చేసినట్లు నేను చేయలేదు నువ్వు నీ సంతోషం కోసం ఆలోచించేవాడివి అయితే ఇంత పెద్ద neurosurgeon వీ కదా ఒక condom వాడాలి తెలియలేదా అది వాడి ఉంటే నీ మోజు తీరిపోగానే డివోర్స్ తీసుకోని ఉండొచ్చు వీళ్ల జీవితాలను అతలాకుతలం కాకుండా కాపాడి ఉండొచ్చు ” అని తన కోపం బాధ మొత్తం కక్కేసాడు వినయ్ తరువాత కిషన్ దగ్గరకు వెళ్లి “నాకూ చిన్న డౌట్ నీ భార్య నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నావు మూడు నెలల తరువాత మోజు తీరగానే tourture పెట్టావు రేపు విద్య నీ పెళ్ళి చేసుకుని మోజు తీరాక నీ భార్య లాగే tourture పెట్టవు అని ఏంటి గ్యారంటీ అలా చేయవు అని కనీసం నీకైన ఉందా క్లారీటి” అని అన్నాడు దాంతో కిషన్ ఉన్న చోటే కూర్చుని ఉండిపోయాడు ఆ తర్వాత రోహిత్, రీహ వైపు చూసి విద్య డైరీ లో నుంచి తెచ్చిన పేపర్ ఇచ్చి వెళ్లిపోయాడు ” నేను కిషన్ తో ముందు ముందు ప్రేమ లో పడితే కనుక అతనికి ప్రేయసి లా కాదు అతని పిల్లలకు తల్లి స్థానం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నా నా అవసరం కిషన్ కంటే అతని పిల్లలకు ఎక్కువ ఉంది” అని రాసిన లైన్ హై లైట్ చేసి ఉంది అది చూసి రీహ, రోహిత్ ఇద్దరు షాక్ అయ్యి విద్య నీ తప్పుగా అర్థం చేసుకున్నారని బాధ పడ్డారు.