ప్రేమ కథలు – Part 2 120

హాస్పిటల్ కీ వెళ్లిన ఒక అర గంటకు స్వీటీ కళ్లు తెరిచింది అప్పుడు అను ఒక్కటే తన పక్కన ఉంది వాళ్ల అక్క, బావ బయట ఉన్నారు, “నీకు ఇప్పుడు చెప్పే విషయం చాలా complicated ఇది ఎలా జరిగింది అని అడగను కానీ కారణం ఎవరో నీకు తెలిస్తే చాలు” అని చెప్పింది అను, స్వీటీ అయోమయంగా చూస్తూ ఉంది అప్పుడు అను “స్వీటీ నువ్వు pregnant అసలు దీనికి కారణం ఎవరో నీకు ఏమైన తెలుసా” అని అడిగింది అప్పుడే టివి లో “వరల్డ్ బైక్ రేసింగ్ చాంపియన్ షిప్ లో కూడా తనకు ఎదురు లేదు అని తన సత్తా చాటిన మన ఇండియన్ రేసర్ శ్రీనివాస్ చక్రవర్తి అలియాస్ శ్రీని” అని చెప్పడం చూసి ట్రోఫీ తీసుకుంటున్న శ్రీని నీ చూసి తన కడుపు పైన మెల్లగ రుదుకుంది స్వీటీ.

ఫ్రెండ్స్ కొంచెం కామెంట్స్ చేయండి ఒకటి రెండు తప్ప పెద్దగా రావడం లేదు మీరు కామెంట్స్ చేస్తే boosting గా ఉంటుంది

తను pregnant అని తెలియగానే స్వీటీ లో కొంచెం కంగారు, కొంచెం భయం వేసింది ఇప్పుడు ఈ విషయం తన అక్క బావ కీ తెలిస్తే ఎలా అని అనుకుంది కానీ ఆ విషయం దాచి పెట్టాలి అని మాత్రం అనుకోలేదు ఎలాగైనా ఇంట్లో చెప్పాలి అని డిసైడ్ అయ్యింది కార్ లో ఇంటికి వెళుతున్న అంత సేపు తను దీని గురించే ఆలోచిస్తూ ఉంది, ఇంటికి వెళ్లాక స్వీటీ తన అక్క సంధ్య, బావ రవి నీ ఇద్దరిని కూర్చోబేటి వాళ్ల కొడుకు లడ్డూ నీ రూమ్ లోకి పంపించి తను pregnant అనే విషయం చెప్పింది దాంతో ఇద్దరు షాక్ అయ్యారు

సంధ్య : ఎమ్ మాట్లాడుతూన్నావు స్వీటీ

స్వీటీ : నిజం అక్క మీకు దీని వల్ల ఏమైన ఇబ్బంది అంటే చెప్పండి నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతా

సంధ్య : పిచ్చి దాన ఇది అంతా నువ్వు సంపాదించిన అస్తి నేను ఆశ్చర్య పోతుంది నువ్వు శ్రీని తప్ప ఎవరినీ లవ్ చేయలేదు కదా మరి ఇది ఎలా

స్వీటీ : దీనికి కారణం కూడా శ్రీని

సంధ్య : అవునా ఎప్పుడు ఎలాగే

స్వీటీ : రెండు నెలల క్రితం నేను చరణ్ పెళ్లి కీ వెళ్లా కదా అప్పుడు జరిగింది

సంధ్య : మరి ఇప్పుడు శ్రీని కీ ఈ విషయం తెలుసా

స్వీటీ : తెలియదు చెప్పాలి అని కూడా అనుకోవడం లేదు

రవి : అది ఏంటి స్వీటీ చెప్పక పోతే ఎలా

స్వీటీ : బావ ఇందులో వాడి తప్పు లేదు ఆ రోజు నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది వదిలేయండి నేను నా బిడ్డ జాగ్రత్తగా ఉంటాం నా ప్రేమ లో నిజాయితీ ఉంటే ఎలాగైనా వాడు నా దగ్గరికి వస్తాడు సరే నేను కొద్ది సేపు పడుకుంటా అని తన రూమ్ లోకి వెళ్లి టివి పెట్టుకొని చూస్తూ ఉంది అప్పుడే టివి లో శ్రీని గురించి ఇంటర్వ్యూ వస్తుంది.

“వరల్డ్ బైక్ రేసింగ్ చాంపియన్ షిప్ లో గెలిచిన శ్రీనివాస్ చక్రవర్తి తో ఈ రోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ” అంటూ ఒక యాంకర్ మాట్లాడుతూ ఉంది,
“శ్రీనివాస్ చక్రవర్తి గారు 4 సంవత్సరాల క్రితం వరకు మీరు ఒక సాధారణ బైక్ మెకానిక్ అప్పుడప్పుడు కొన్ని బైక్ రేస్ లో పాల్గొనడం అంతే తప్ప ఒకేసారి ఇంత సక్సెస్ కీ ఎలా చేరుకో గలిగారు ” అని అడిగింది.

దానికి శ్రీనివాస్ నవ్వుతూ “దీనికి కారణం ముగ్గురు నా మేనేజర్ అంతేకాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ చరణ్, అంతేకాకుండా ఇంకో స్పెషల్ పర్సన్ తన గురించి నేను ఎలాంటి విషయాలు చెప్పలేను, నా స్పాన్సర్ ప్రమోద్ సిన్హా, వీలు లేక పోయి ఉంటే నేను ఇంకా బైక్ మెకానిక్ గానే ఉండే వాడిని” అని చెప్పాడు దాంతో స్వీటీ శ్రీని చెప్పిన ఆ స్పెషల్ పర్సన్ తనే అని తెలుసుకుంది, అంటే శ్రీని తనని ఎప్పటికీ మరిచిపోలేదు అని అర్థం అయ్యింది.

2 Comments

  1. Readers require some sex stories but not cinema stories since last 12 episodes are like that only. Pl post some interesting readable sex stories.

  2. Nice love story. Keep it up

Comments are closed.