నీరజా టీచర్ 2 246

అతను మౌనంగా బైక్ స్టార్ట్ చేసి, ముందుకు పోనిస్తూ, �చెప్పు ఎటు వెళ్ళాలీ!?� అన్నాడు. నేను దారి చెబుతూ ఉంటే, అతను తీసుకెళ్ళసాగాడు. మా ఏరియాకి రాగానే, �ఇక్కడ ఆపు.� అన్నాను కంగారుగా. �ఇక్కడేనా మీ ఇల్లు?� అన్నాడు అతను. �కాదు, కానీ ఇంకా ముందుకు వద్దు.� అంటూ, కిందకి దిగి నడవసాగాను. �ఏయ్ నీరూ! వన్ మినిట్..� అని అరిచాడు. నేను ఆగి అతని వైపు చూసాను. అతను బైక్ స్టేండ్ వేసి, నా దగ్గరకి వచ్చాడు. �ఒక విషయం మరచిపోయాను.� అన్నాడు. ఏమిటీ అన్నట్టు చూసాను. అతను అటూఇటూ చూసాడు. ఎవరూ లేరు. పైగా మేమున్నది కాస్త చీకట్లో. ఆ చీకటి ఎందుకో నాలో కాస్త గుబులు రేపుతుంది. ఆ గుబులుతోనే, అతను ఏం చెబుతాడా అన్నట్టు అతని కళ్ళలోకి చూసాను. అయితే అతను ఏమీ చెప్పలేదు. అలానే చూస్తున్నాడు. �మ్.. అలా చూడడానికేనా ఆపిందీ!?� అని, ముందుకు కదలబోతుండగా, అతను గబుక్కున నన్ను కౌగిలిలోకి లాక్కొని, చప్పున నా పెదాలపై ముద్దు పెట్టేసాడు. అదీ ఒక్క అరక్షణం మాత్రమే. ఆ అరక్షణం లోనే, నాకు ఊపిరి ఆగిపోయినంత పని అయ్యింది. అతను మాత్రం తాపీగా తన బైక్ దగ్గరకి వెళ్ళి, �గుడ్ నైట్..� అని చెప్పి, స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన ఐదు నిమిషాలకి గానీ, నాలో చెలరేగిన తుఫాన్ ఆగలేదు. కోపం, మురిపెం, తమకం లాంటి రకరకాల భావాలతో నా మనసు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా, మెల్లగా ఇంటికి చేరాను.

రాత్రి నిద్రపోదామనుకుంటే, నా పెదవులపై అంటిన అతని తడి నిద్ర పోనీయడంలేదు. అతను చేసిన పనికి ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. చిన్నప్పుడు మధు చేసిన పనికి కూడా వేడెక్కింది. కానీ ఆ వేడికీ, ఈ వేడికీ మధ్య తేడా ఉంది. ఆ తేడా ఏంటో ఎంత ఆలోచించినా అర్ధం కావడంలేదు. ఇక ఆలోచించే ఓపిక లేక నిద్ర పోదామన్నా, నిద్ర రావడం లేదు. మాటిమాటికీ ఎందుకో నవ్వొస్తుంది. అంతలోనే కోపం వస్తుంది. ఈ రెంటినీ భరించలేక చిరాకొస్తుంది. ఆ చిరాకు చూసి మళ్ళీ నవ్వొస్తుంది. ఈ విచిత్రమైన భావ ప్రకంపనలను ఏమంటారో తెలియడం లేదు. ఆ ప్రకంపనలలోనే అలాగే గిలగిలా కొట్టుకునేసరికి తెల్లారిపోయింది. నిద్ర లేక కళ్ళు భగ్గుమని మండిపోతున్నాయి. కాలేజ్ కు డుమ్మా కొడదామనుకున్నాను. కానీ నాకే తెలియకుండా నా కాళ్ళు కాలేజ్ వైపుకు నడిచేసాయ్. కాలేజ్ కు వెళ్ళాక, నా కళ్ళు అతని కోసం వెదికేసాయ్. అలా వెదుకుతూ ఉండగా, నాపై ఒక చీటీ పడింది. ఉలిక్కిపడి చుట్టూ చూసాను. అతను కనబడలేదు. తిట్టుకుంటూ చీటీ తెరిచాను. �ఆడపిల్ల కళ్ళు ఎర్రబడ్డాయీ అంటే, కారణాలు రెండు. ఒకటి, ప్రియుడు అల్లరి చేస్తే తాపంతో, అల్లరి చేయకపోతే కోపంతో.. మరి నీ కారణం ఏమిటో!?� అని ఉంది అందులో. నేను చీటీ చదవడం అతను చూస్తున్నాడని తెలుసు. చూస్తూ చిలిపిగా నవ్వుకుంటున్నాడని తెలుసు. ఈ చీటీలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. అలా ఇవ్వడానికి వీలుగా, నేను క్లాస్ కు వెళ్ళకుండా, కాలేజ్ ప్రిన్సిపల్ రూం దగ్గరకి నడిచాను.

అలా వెళ్ళడానికి ఒక కారణం ఉంది. మామూలుగా కాలేజ్ ఎగ్గొట్టేస్తే, వెంటనే నాన్నకి కాల్ వెళ్ళిపోతుంది. అదే ప్రిన్సిపాల్ దగ్గర పెర్మిషన్ తీసుకుంటే, కాల్ వెళ్ళదు. అందుకే ప్రిన్సిపాల్ దగ్గర పెర్మిషన్ తీసుకొని, కాలేజ్ నుండి బయటపడి, నెమ్మదిగా బస్ స్టాప్ దగ్గరకి చేరుకున్నాను. కాసేపట్లో అతను వస్తాడు అని తెలుసు. రావడం అయితే వచ్చేసాను గానీ, అతను వస్తే ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు. అసలు అతను ఏం చేస్తాడో అర్ధం కావడంలేదు. ఎక్కడికైనా తీసుకెళ్ళి మళ్ళీ ముద్దు పెట్టేస్తాడా! అమ్మో.. అనుకుంటూ ఉంటూ ఉంటే, �ఏయ్! అతను ముద్దు పెడితే బావుందా లేదా!?� అంటూ నా మనసు కసిరింది. �బావుందనుకో.. అయినా..� అంటూ, నా మనసుకు నచ్చచెప్పబోతుండగా, అతని బైక్ నా ముందు ఆగింది. తల దించుకొని, కళ్ళు మాత్రం పైకెత్తి అతన్ని చూసాను. అతను కొంటెగా నవ్వుతున్నాడు. ఆ నవ్వు చూడగానే నేను ఉడికిపోతూ, �నేనేం నీ కోసం రాలేదు.� అన్నాను. �ఓకే! నేనే నీకోసం వచ్చాను..సరేనా!� అన్నాడు అతను ఇంకా కొంటెగా నవ్వుతూ. నేను అలుగినట్టు తల పక్కకి తిప్పేసుకున్నాను. అతను వెంటనే, �సారీ..సారీ..ప్లీజ్.. నవ్వవా!� అన్నాడు జాలిగా. అతను అలా అనగానే అలక పోయి నవ్వు వచ్చేసింది. అయినా దాన్ని దాచుకుంటూ, అతని వైపు చూసాను. నేను చూడగానే, మళ్ళీ �ప్లీ..జ్..� అన్నాడు. ఇక అతనితో బతిమాలించుకోవడం ఇష్టంలేక, అటూఇటూ చూసి నెమ్మదిగా బైక్ ఎక్కాను.

బైక్ వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో బ్రేకులూ, స్పీడుబ్రేకర్లూ అల్లరి పెట్టసాగాయి. ఆ అల్లరికి నా శరీరం అంతా కితకితలు పెట్టినట్టు ఒకటే పులకరింతలు. ఆ పులకరింతలను ఆశ్వాదించేలోగానే, అతను ఒకచోట బైక్ ఆపాడు. చూస్తే, అది ఒక మధ్య తరగతి ఇల్లు. �ఇదేంటీ!?� అన్నాను ఆశ్చర్యంగా. �మా ఇల్లు.. దిగు..� అన్నాడు అతను. నేను కిందకి దిగి, �ఇక్కడకి ఎందుకు తీసుకొచ్చావ్!?� అన్నాను. అతను బైక్ పార్క్ చేసి, �మా అన్న, వదినలకు నిన్ను పరిచయం చేద్దామని.� అన్నాడు. �ఎందుకూ!?� అన్నాను ఇంకా ఆశ్చర్యంగా. అతను నన్ను సూటిగా చూస్తూ, �ఏదో కాస్త ఫన్ చేసి వదిలేయడానికి నీ వెంటపడ్డాననుకున్నావా! నువ్వు నాకు నచ్చావ్. అదే విషయం మా వాళ్ళకి చెప్పాను. వాళ్ళు కూడా ముచ్చటపడి, నిన్ను తీసుకురమ్మన్నారు. పద..� అంటూ, కాంపౌండ్ వాల్ గేట్ తీయబోతుంటే, నేను కంగారుగా అతనికి అడ్డుపడి, �అయ్యో.. ముందు మా నాన్నకు చెప్పాలిగా.. ఇలా సడెన్ గా చెప్తే ఎలా!?� అన్నాను. అతను నా మొహంలోకే చూస్తూ, �నేనంటే నీకు ఇష్టమా కాదా చెప్పు..� అన్నాడు. నేను తల దించుకొని, �ఇష్టం కాబట్టే కదా నీ కూడా వచ్చాను.� అన్నాను. �అయితే ఇక ఏం మాట్లాడకు. ఇక్కడనుండి నేరుగా మా అన్నా, వదినలను తీసుకొని మీ ఇంటికి వెళ్దాం, ఓకేనా!� అన్నాడు. ఇంకేం అంటానూ! మనసంతా చల్లని ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ తో గిలిగింతలు అవుతూ ఉండగా, అతని కూడా లోపలకి నడిచాను. అతను డోర్ కు ఉన్న కర్టైన్ ను తొలగించి, తలుపు తోయబోయి ఆగిపోయాడు. ఎందుకంటే, దానికి తాళం వేసి ఉంది. �ఇదేంటీ! వచ్చేముందు కాల్ చేసానూ, ఉంటానన్నారూ..� అనుకుంటూ, తన సెల్ తీసి, అతని అన్నకు కాల్ చేసి, �ఎక్కడికి పోయారూ!� అన్నాడు. అవతల చెప్పింది విన్న తరవాత, అతను నవ్వుతూ, �సరే! ఆ విషయం నీ మరదలికి చెప్పు..� అంటూ, ఆ సెల్ ను నాకు ఇచ్చాడు. అతను మరదలూ అనగానే, నాకు సిగ్గు ముంచుకొచ్చింది. ఆ సెల్ అందుకుంటుంటే, నాలో చిన్న వణుకు.

1 Comment

Comments are closed.