చిలిపి కోరిక… 200

“ఇంక చాలు బాబూ ….” అంది సిగ్గుపడుతూ..

“లేదు మధురిమా నిజమే చెప్తున్నాను… అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా… నీలాంటి భార్యతో ఒక్కరోజు గడిపినా చాలు … జన్మ ధన్యమైనట్టే….”

మధురిమ ఏమీ మాట్లాడకుండా కూర్చుంది…

“మధురిమా … ఒక్కటి అడుగుతాను ఏమీ అనుకోవుగా…’ అన్నాను

ఏంటి అన్నట్టు చూసింది మధురిమ తలెత్తి ..

“నువ్వు ఇందాక అన్నమాట నిజమేనా…?”

“ఏ మాట?…”

“అదే … అవకాశం ఉంటె ఈ జన్మలోనే నన్ను పెళ్ళిచేసుకునే దాన్ని .. అని అన్నావే … ఆ మాట”….

“అది నిజం రాజేష్ … నువ్ చేసిన సహాయానికి , నీ ఋణం తీర్చుకోడానికి ఏం చేసినా తక్కువే… నిన్ను పెళ్లిచేసుకోవడం చాలా చిన్నది… కానీ ఆ అవకాశం లేదుగా … ఐ హావ్ ఏ స్వీట్ హస్బెండ్ అండ్ ఐ లవ్ హిమ్ వెరీ మచ్ ” అంది నవ్వుతూ..

“ఉంటె చేసేదానివా”

“తప్పకుండా…నేను చేయగలిగేది ఏదైనా చేస్తాను.. ” అంది నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ…

“అయితే నాకోసం ఒక పని చేస్తావా”

“చెప్పు రాజేష్ నా ప్రాణం ఇవ్వమన్నా సంతోషంగా ఇస్తాను…”

“చిన్న పనే మధురిమా… నేను అడిగాక నీకు ఇష్టమైతే చెయ్… లేదంటే ఊరుకో… కానీ నువ్వు కోప్పడకూడదు…”

“సరే.. ఏంటో చెప్పు…”

“అలా అని నాకు మాటివ్వు…” అంటూ చేయి చాపాను…

“అలాగే … కానీ ఊరించకుండా ఏంటో చెప్పు బాబూ…” అంటూ చేతిలో చెయ్యి వేసింది మధురిమ…

“మధురిమా.. నేను ఈ ఇంటికి వచ్చిన నాటి నుండీ నిన్ను గమనిస్తున్నాను.. నీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. నాకు కూడా నీలాంటి భార్యే దొరకాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నానని, ఒక్క రోజైన నీలాంటి భార్యతో గడిపితే చాలని నేను ఇందాక చెప్పింది నిజం మధురిమా… కానీ నాకు ఆ అదృష్టం దొరుకుతుందో లేదో తెలియదు… అందుకని నాదొక చిన్న కోరిక … నువ్వు ఒక రోజు పాటు నాకు భార్యగా ఆక్ట్ చెయ్యాలి…” అన్నాను భయపడుతూనే…

మధురిమ చివ్వున తలెత్తి చూసింది…

“మధురిమా… నువు కోప్పడనని మాటిచ్చావ్… నేను నాలో ఉన్న కోరికను నీకు తెలియజేశాను… నీకు ఇష్టం ఉంటె చెయ్ లేదంటే లేదు కానీ ప్లీజ్ కొప్పుడొద్దు…” అన్నాను తన చేతులు పట్టుకుని…

తను నా చేతులు విడిపించుకొని సీరియస్ గా చూస్తూ… “ఇంత చిన్న కోరికా…” అంటూ గట్టిగా నవ్వింది…

ఆశ్చర్యపోతూ నేను కూడా తనతో పాటే నవ్వాను…

“అయితే నా కోరిక తీరుస్తావు కదా” అన్నాను …

“తప్పకుండా”

“ఎప్పుడూ”

“ఎప్పుడో ఎందుకు … మురళిని చూడాలి ఒకసారి తీసుకురా అని అమ్మ మొన్నే ఫోన్ చేసింది.. నువ్ రేపు వెళ్లి మురళిని మా అమ్మా వాళ్ళ దగ్గర వదిలిపెట్టి రా… ఆయన రావడానికి ఎలాగు ఇంకో వారం పడుతుంది… ఈలోగా నీ కోరిక తీర్చేస్తా…” అంది నవ్వుతు…

మర్నాడు పొద్దున్నే వెళ్లి మురళిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దిగబెట్టి రాత్రికల్లా ఇంటికి వచ్చేసా… ఆరాత్రి భోజనం చేసాక మధురిమను అడిగా ఎప్పుడూ ? అని…

“తొందరగా ఉందా..? అయితే రేపే” అంది మధురిమ…

ఆ రాత్రి నాకు చాలా సేపటి వరకు నిద్రే పట్టలేదు…. రేపటి గురించి ఆలోచిస్తూ ఎప్పుడు పడుకున్నానో తెలియదు…

ఎవరో తట్టి పిలుస్తున్నట్టనిపిస్తే కళ్ళు తెరిచి చూసాను.. ఎదురుగా మధురిమ ….
నేను ఆ ఇంటికి వచ్చిన రోజు కట్టుకున్న బ్లూ కలర్ చీరలో అప్సరసలా నిలబడి నవ్వుతూ నా వైపే చూస్తుంది… అప్పుడే తల స్నానం చేసినట్టుంది.. జుట్టు తడి తడిగా ఉండి వదులుగా ఉంది… నేను ఆమెనే చూస్తూ ఉంటే…
“ఏంటి శ్రీవారు ఇంకా లేవరా.. బారెడు పొద్దెక్కింది” అంది నవ్వూతూ …
“ఇదిగొండి మీకు బెడ్ కాఫీ తెచ్చా లేచి తాగండి” అంటూ పక్కన ఉన్న కప్ చూపించి వెళ్ళిపోయింది…

నాకు మత్తు వదిలిపోయింది… మధురిమ ఈ రోజు నా భార్య అని తలపుకు రాగానే ఒళ్ళు పులకరించింది… చటుక్కున లేచి కూర్చున్నా… కాఫీ తాగేసి వాష్ రూమ్ కి వెళ్లి బయటకు వచ్చా…
మధురిమ కిచెన్ లో ఉంది…
“ఏం చేస్తున్నావ్” అంటూ నేనూ కిచెన్ లోకి వెళ్ళాను…

“టిఫిన్ రెడి చేస్తున్నానండి” అంది…

“అండి ఏంటి” అడిగా

“భర్తను అలాగే పిలవాలిగా…” అంది

“థాంక్స్ మధురిమా, నా కోరిక మన్నించినందుకు” అన్నాను…

“భార్యా భర్తల మధ్య థాంక్స్ లు ఉండవు…” అంది నవ్వుతూ…

“అవునా .. సారీ అయితే”

“సారీలు కూడా ఉండవు…”

“మధురిమా నువ్ చాలా గడుసుదానివి సుమా… ఏమో అనుకున్నాను…”

“మధురిమా… అంటూ అంత పొడుగ్గా పిలవనక్కరలేదు మధు అంటే చాలు…” అంది నవ్వుతూ…

“ఓ రియల్లీ… థాంక్స్ మధురిమా…”