“తిరిగొచ్చిన వసంతం” 83

“అత్తయ్యా వెళ్ళొస్తాను” అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని హడావిడిగా బయటకు వెళ్ళిపోయింది సుమనశ్రీ… అలాగే జాగ్రత్తగా వెళ్ళిరామ్మా అంటూ ఆమె వెనకే గుమ్మం దాకా వచ్చి మళ్ళీ వెనుదిరిగింది పద్మావతి… సోఫాలో కూర్చుని గోడమీద తగిలించి ఉన్న ఫోటో ఫ్రెమ్ వైపు చూసింది.. ఫొటోలో సుమనశ్రీ తో పాటు నవ్వుతూ ఉన్న తన కొడుకును చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆవిడకి.. పెళ్లయిన ఆరు నెల్లకే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసే ఆమె కొడుకు బైక్ కి ఆక్సిడెంట్ అయ్యి ప్రాణాలు కోల్పోయాడు… ఇప్పుడు అతని ఉద్యోగం కోడలు సుమశ్రీకి ఇచ్చారు.. సుమనశ్రీ ఆమెకు మేనకోడలే .. చిన్నప్పుడే తల్లీ తండ్రులని పోగొట్టుకున్న ఆమెని పద్మావతే పెంచి పెద్ద చేసింది … డిగ్రీ వరకు చదివించింది… తన కొడుక్కే ఇచ్చి పెళ్లి చేసింది.. వాళ్లిద్దరూ చిలకా గోరింకల్లా తన కళ్ళముందు తిరిగితే చూసి సంతోషించాలని అనుకుంది.. పాపో బాబో పుడితే వాళ్ళని ఆడిస్తూ తన శేష జీవితం గడపాలని అనుకుంది… . కానీ విధి వారి జీవితాలతో ఆటలాడుకుంటుంది… అయితే ఆమె ఎప్పుడూ విధికి తలవంచలేదు.. కఠిన పరిస్థితుల్ని ధైర్యoగా ఎదుర్కొంది.. తన భర్త చిన్నవయసులోనే చనిపోయినా కొడుకుని, కోడల్ని ఏ లోటూ లేకుండా పెంచింది.. కొడుకు చనిపోయాక కూడా ఆమె గుండె దిటువు చేసుకొని బ్రతుకుతుంది.. ఇప్పుడు ఆమెకు ఉన్న దిగులల్లా ఒకటే .. అది సుమనశ్రీ భవిష్యత్తు… కొడుకు చనిపోయి ఇప్పటికే ఐదేళ్లు గడుస్తుంది.. మళ్లీ పెళ్లి చేసుకొమ్మని ఎన్నోసార్లు చెప్పింది… కానీ సుమనశ్రీ ఒప్పుకోలేదు… చిన్నవయసులోనే భర్తను కోల్పోయిన ఆడదాని బతుకు ఎంత దుర్భరమో అనుభవించిన ఆమెకన్నా ఇంకెవరికి తెలుస్తుంది… కనీసం ఆమెకు ఒక కొడుకన్నా ఉండేవాడు… సుమనశ్రీకి ఆ అదృష్టం కూడా లేదు… తను చనిపోయాక సుమనశ్రీ ఒంటరిదై పోతుందని ఆమె రోజూ దిగులుపడుతుంది… సుమనశ్రీని ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే తనకు కాస్త నిశ్చింతగా ఉంటుంది…. మొగుడు పోయిన అమ్మాయికి మంచి సంబంధం వెతకడం అంత ఈజీ కాదని కూడా ఆమెకు తెలుసు… అయితే దానికన్నా ముందు సుమనశ్రీ ని పెళ్లికి ఒప్పించడమే ఆమెకు సాధ్యం కావడం లేదు….
మోడు బారిన ఆమె జీవితంలోకి వసంతం తిరిగి రావాలని రోజూ వేల దేవుళ్ళకి మొక్కుకుంటుంది….

సుమనశ్రీకి పద్మావతి దిగులు గురించి పూర్తిగా తెలుసు… తనకి ఇంకో పెళ్లిచేయాలని ఆమె ఎందుకు ఆరాటపడుతుందో తెలుసు… కానీ తను ఇంకో పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆమెకు దిక్కెవరు…? తనను రెండోపెళ్లి చేసుకునే వ్యక్తి తననే గౌరవంగా చూస్తాడో లేదో తెలియదు… మరి ఆమెను పట్టించుకుంటాడా?
తన తల్లిదండ్రులు పోయినప్పటి నుండీ ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన అత్తయ్యను వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేసి తను ఎలా వెళ్లగలదు… కృతజ్ఞతతో ఉండాల్సిన సమయంలో కృతఘ్నత చూపించడం న్యాయమా… అందుకే ఎన్నిసార్లు అడిగినా ఇంకో పెళ్లికి ఆమె ఒప్పుకోవడం లేదు… అయితే ఇదే కారణం అని ఆమె పద్మావతికి చెప్పలేదు… పెళ్లి ఇష్టంలేదని మాత్రమే చెబుతూ వస్తుంది…

కాలం సాగుతూనేవుంది..

ఒకరోజు స్కూల్లో ఉండగా సుమనశ్రీ కి ఉత్తరం ఒకటి వచ్చింది…
ఈ రోజుల్లో ఉత్తరం ఎవరు రాసారబ్బా అనుకుంటూ కవర్ వెనక చూసి ఫ్రమ్ అడ్రస్ లేకపోవడంతో విప్పి చదవడం మొదలుపెట్టింది…

“ ప్రియమైన సుమనశ్రీ కి….

ప్రేమతో రాయునది…

మిమ్మల్ని ఇలా సంబోధించడం సరైందో కాదో నాకు తెలియదు… కానీ చల్లకొచ్చి ముంత దాచడమెందుకని ‘ప్రియమైన’ అని రాసాను…
నిజంగానే మీరు నాకు ప్రియమైన వారు.. అంటే మీరంటే నాకు చాలా ఇష్టం… మీ వ్యక్తిత్వం నాకు ఎంతగానో నచ్చింది… మీ ప్రవర్తన, మీ మాటతీరు, మీ కట్టుబొట్టు ఒకటేమిటి మీ పేరుతో సహా ప్రతీది నాకు చాలా ఇష్టం… మిమ్మల్ని గత నాలుగైదేళ్లుగా గమనిస్తున్నాను… మీరంటే ఇష్టమని చెప్పాలని కూడా చాలా రోజులుగా అనుకుంటున్నాను… కానీ ఎదురుపడి చెప్పడానికి ధైర్యం చెయ్యలేకపోయ్యాను… అందుకే ఈ రోజు ఇలా ఈ ఉత్తరం ద్వారా అడుగుతున్నాను…

1 Comment

  1. Bro stories incet rayandi

Comments are closed.