“తిరిగొచ్చిన వసంతం” 82

తనకు తెలిసి రమేష్ ఎప్పుడూ ఇలాంటి ఆలోచన ఉన్నవాడిలా కనిపించలేదు… ఎంతో హుందాగా ప్రవర్తించే వాడు… అలాంటిది ఈ రోజు ఇలా ఈ ఉత్తరం రాయడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది… ఇంటికెళ్ళాక కూడా ఆమెను ఆలోచనలు వదల్లేదు…
ఉత్తరాన్ని ఆమె మళ్లీ మళ్లీ చదివింది… ఉత్తరం చదివినప్పుడల్లా రమేష్ చెప్పింది నిజమే అనిపిస్తోంది.. అంతలోనే అతని మాటలు నమ్మొచ్చా అనిపిస్తుంది…
ఒకో సారి రమేష్ కి ఓకే చెప్పేద్దామా అనిపిస్తోంది అంతలోనే మళ్లీ భయమేస్తోంది… తర్జనభర్జన పడుతుండగానే వారం రోజులు గడిచిపోయింది…
వారం రోజుల తర్వాత ఆమెకి కొరియర్ వచ్చింది…
విప్పి చూస్తే అందులో మరో ఉత్తరంతో పాటు ఒక అందమైన చీర ఉంది…
ఆత్రంగా ఆ ఉత్తరం తీసి చదివిందామె…

“ప్రియమైన సుమనశ్రీ….

నా మనసేమిటో మీకు మొదటి లేఖలో వివరించాను….
మీరు చదివి అర్థం చేసుకుని ఉంటారు…
ఇప్పుడు
మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నా… దీంతో పాటు మీకు ఒక చీరను పంపిస్తున్నా…. మీరు నాతో పెళ్లికి ఒప్పుకునేట్లయితే ఈ ఆదివారం నాడు ఈ చీరను కట్టుకోగలరు…
మీకు నేను నచ్చి మీరీ చీరను కట్టుకున్నట్టయితే సమయం చూసి పిన్నితో నేను మాట్లాడుతాను…

నచ్చనట్టయితే నా ఉత్తరాలతో పాటు ఈ చీరను కూడా కాల్చేయండి…

మళ్లీ చెబుతున్నాను…
దీనివల్ల మన పూర్వ సంబంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకూడదు…
మీ నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే….

మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ….

… రమేష్”

సుమనశ్రీ ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించింది…

రమేష్ ఎంత మంచివాడో తనకు బాగా తెలుసు… అందుకని రమేష్ కి ఓకే చెప్పడానికే నిర్ణయించుకుంది…
ఆదివారం నాడు ఉదయాన్నే స్నానం చేసి రమేష్ పంపిన చీర కట్టుకుంది…
కానీ రమేష్ ఎప్పుడొస్తాడో అని కాస్త టెన్షన్ గా ఉంది… తాను ఒప్పుకున్న విషయం రమేష్ కి ఎప్పుడెప్పుడు తెలియజేద్దామా అని ఆమెకి ఆత్రంగా ఉంది…తనే వెళ్లి అతనికి కనబడితే ఎలా ఉంటుంది అని ఆలోచించింది… కానీ బాగోదేమో అనిపించింది… ఎక్కడికెళ్తున్నావే పొద్దున్నే రెడీ అయ్యావు అంటూ పద్మావతి అడిగితే గుడికి వెళ్ళొస్తా అత్తయ్య అంటూ బయటకు వెళ్ళింది…
గుడి నుండి తిరిగి వస్తుంటే రమేష్ బైక్ మీద బయటకు వెళ్తూ కనిపించాడు… తనని చూసాడా లేదా అనేది సుమనశ్రీకి తెలియలేదు…
అతను వస్తాడేమో అని పొద్దంతా ఎదురుచూసింది…
చివరికి సాయంత్రం ఐదవుతుండగా రమేష్ వాళ్ళింటికి వచ్చాడు… అత్తా కొడళ్లు ఇద్దరూ హాల్ లొనే ఉన్నారు…
రమేష్ రాగానే సుమనశ్రీ టీ తీసుకొచ్చింది… అతనిచ్చిన చీర కట్టుకొని అతనికి టీ ఇస్తుంటే ఆమెకు కాస్త సిగ్గుగా అనిపించింది…టీ ఇచ్చి పద్మావతి కూర్చున్న సోఫా వెనక నిలబడింది.

“పిన్నీ నేను నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను…” అన్నాడు రమేష్ టీ తాగుతూ…

“చెప్పు రమేష్…” అంది పద్మావతి…

“నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పిన్నీ…”

“మంచి నిర్ణయం నాయనా… నేను నీకు చాలా సార్లు చెప్పాను… కానీ నువ్ వినలేదు… పోనీలే ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకున్నావు… మా సుమన మనసు కూడా ఆ దేవుడు మారిస్తే బాగుండు…”

1 Comment

  1. Bro stories incet rayandi

Comments are closed.