అతడు ఆమెని జయించాడు 129

బెంగళూర్ రైల్వేస్టేషన్- ఉదయం 11.00

రైలు ఆగిన మరుక్షణం ఆమె ప్లాట్ఫార్మ్ పైకి దూకి స్టేషన్ బయటకు పరుగెత్తింది …
బయట ఆగి ఉన్న కార్ దగ్గర నిలబడ్డ వ్యక్తి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి ఇన్ఫోసిస్ ఆఫీస్ కి వెళ్ళాలి వస్తావా అని అడిగింది.
ఫోన్ మాట్లాడుతూ ఉన్న అతను వన్ మినిట్ అంటూ ఫోన్ లో చెప్పి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసాడు… అయ్యో తెలుగు రాదు కదూ అనుకుంటూ can you take me to Infosys? అని అడిగింది… జీన్స్ పాంట్ మీద టైట్ టీ షర్ట్ వేసుకున్న అందాల రాశిని చూస్తూ నోరెళ్ళబెట్టాడు అతను… కాటుక లేకపోయినా విశాలంగా కనిపిస్తున్న కళ్ళు, కొనదేలిన ముక్కు, తేనె పూసిందా అన్నట్టున్న పెదాలు, కొద్దిగా ఉబ్బినట్టున్న చెంపలు……….
Mr బ్రహ్మ you are great అనుకుంటూ అతను చూపుని ఇంకొంచెం కిందికి దించాడు.. పరుగెత్తుకు వచ్చినందు వల్లనో ఏమో భారంగా ఊపిరి తీస్తుంటే ఆమె ఉరోజాలు లయబద్ధంగా కదులుతూ ఉన్నాయి… సహజమైన మగ బుద్ధితో మనసులోనే అతను వాటి సైజ్ ముప్పై ఆరా, ముప్పై ఎనిమిదా అని బేరీజు వేస్తున్నాడు…
ఇంతలో ఆమె హలో అంటూ కళ్ళ ముందు చిటికేసి పిలవడంతో తేరుకుని “చెప్పండి” అన్నాడు…
ఓహ్ తెలుగు తెలుసా… నేను తొందరగా ఇన్ఫోసిస్ ఆఫీస్ కి వెళ్ళాలి… తొందరగా కార్ తియ్యు అంటూనే కార్ డోర్ తెరిచి బ్యాగ్ లోపలికి విసిరి కూర్చుంది… కానీ అతను ఏదో చెప్పబోతుంటే.. నువ్ అడిగినంత ఇస్తా గానీ తొందరగా పోనియ్యి.. అంది… అతను ఇంకేదో అనబోయిన వాడల్లా మానుకుని కార్ ఎక్కి స్టార్ట్ చేసాడు…
కాస్త తొందరగా పోనియ్ అని ఆమె అంటూ ఉంటే అద్దంలో ఆమెను గమనిస్తూనే సాధ్యమైనంత స్పీడ్ గా నడపసాగాడు అతడు.
ఇన్ఫోసిస్ లో ఇంటర్వ్యూ కోసం ఆమె ఆరోజు బెంగళూర్ వచ్చింది…. ట్రైన్ నాలుగు గంటలు ఆలస్యంగా రావడంతో టైం కి చేరుకోగలనా లేనా ఆమెకి ఆందోళనగా ఉంది… అందుకే వేగంగా పోనివ్వమని తొందర పెడుతుంది..
ఇంతలో ఆమె ఫోన్ మోగింది…
“ఆ అమ్మా… ఇందాకే బెంగళూర్ లో దిగాను… ఇప్పుడే ఒక క్యాబ్ మాట్లాడుకుని వెళ్తున్నా… ఆ ఆ డ్రైవర్ స్పీడ్ గానే వెళ్తున్నాడు… టైం కి చేరుకోగలననే అనుకుంటున్నాను…. ఆ.. మార్నింగ్ ట్రైన్ లో తీసుకున్న టిఫిన్ అంత బాలేదు ఏదో కొంచెం తిన్నా.. మిగతాది పడేసా.. . సరే … సరే సరే.. తింటాలే… అదిగో ఆఫీస్ వచ్చినట్టుంది నేను మళ్లీ ఫోన్ చేస్తాలే పెట్టెయ్…” అంటూ ఫోన్ కట్ చేసింది….
కార్ ఆగగానే కిందికి దిగి కాసేపు వెయిట్ చెయ్ నన్ను మళ్లీ తీసుకెళ్లాలి అంటూ లగేజ్ బ్యాగ్ కార్ లొనే వదిలేసి హాండ్ బ్యాగ్ మాత్రమే తీసుకొని లోపలికి పరిగెత్తింది…

స్టేషన్ వద్ద మధ్యలో ఆపిన పని ఇప్పుడు మొదలెట్టాడు అతడు… ఆమె వెళ్తుంటే వెనక వైపు లూస్ హెయిర్ కింద ఆమె నడుము వంపు తిరిగి సన్నటి సెలయెరులా… ఉందా లేదా అన్నట్టు ఉంటే ఇంకాస్త కిందికి ఆమె జఘన భాగం సెలయేటిని తనలో కలిపేసుకున్న సరస్సులా విశాలంగా జీన్స్ నుండి కొట్టొచ్చినట్టు కనబడుతుంది… అతను బ్రహ్మను మరోసారి మెచ్చుకుంటూ వుండాగానే ఆమె లోపలికి వెళ్ళిపోయింది…

సుమారు ఒక గంట తర్వాత ఆమె తిరిగి బయటకు వచ్చింది. వస్తూనే పద ఏదైనా మంచి హోటల్ కి తీసుకెళ్లు విపరీతంగా ఆకలి వేస్తుంది అంటూ కార్ ఎక్కి కూర్చుంది. అతను ఏమీ మాట్లాడకుండా స్టార్ట్ చేసి పోనిచ్చాడు… ఆమె ఫోన్ తీసుకుని కాల్ చేసింది… ” ఆ అమ్మా … ఇంటర్వ్యూ అయిపోయింది… దేవుడి దయ వల్ల టైం కి చేరుకున్నాను… నిజానికి ఈ డ్రైవర్ దయ అనాలేమో… రెండు గంటలకన్నా ఎక్కువ పడుతుందట ఇక్కడికి రావడానికి.. కానీ ఇతను గంట సేపట్లో దించేశాడు…… ఆ ఆ ఇంటర్వ్యూ బాగానే జరిగింది తప్పకుండా నాకే వస్తుందనుకుంటున్నా… లేదు ఇంకా తినలేదు… ఇప్పుడు హోటల్ కే వెళ్తున్నా… …..గుర్తుంది… తిన్నాక వెళ్తా…. ట్రైన్ ఐదింటికి కదా… ఆ టైం వరకు చేరుకుంటాలే… సరే సరే బై….” అంటూ ఫోన్ పెట్టేసింది… అప్పటికే కార్ హోటల్ ముందు ఆగి ఉండడంతో సర్దుకుని కార్ దిగి లోపలికి వెళ్లబోయినదల్లా ఆగి నువ్ కూడా రా ఏమైనా తిందువుగానీ అని పిలిచింది… నేను ఇందాకే తినేసాను మేడం మీరు వెళ్ళండి అంటూ అతను అనడంతో లోపలికి వెళ్ళింది…
ఫ్రెష్ అయి వచ్చినందుకో, కడుపు నిండినందుకో గానీ తిరిగి బయటకు వస్తుంటే ఆమె ముఖంలో ఎంతో రిలీఫ్ కనిపించింది అతనికి…
కార్ ఎక్కగానే ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టుగా ఆమె వైపు చూశాడతను… అతని భావం అర్థమైనదానిలా … ఇస్కాన్ టెంపుల్ కి పోనీ అంది… కార్ కదిలాక కాసేపటికి ” నీకు చాలా చాలా థాంక్స్… నన్ను టైమ్ కి తీసుకెళ్ళావ్… ఆ ట్రైన్ లేట్ రావడంతో అసలు నేను టైం కి వెళ్లగలనో లేనో అని ఎంతో టెన్షన్ పడ్డా… అసలు అది మార్నింగ్ 7 కల్లా రావలసింది… 11 కి వచ్చింది….” ఆమె చెప్తూంటే అతను మౌనంగా వింటూ డ్రైవ్ చేయసాగాడు…. ” అమ్మ మార్నింగ్ దిగగానే ఇస్కాన్ కి వెళ్లి దేవుడికి దణ్ణం పెట్టుకుని ఇంటర్వ్యూ కి వెళ్లమంది… దరిద్రం ట్రైన్ లేట్ రావడం వల్ల కుదరలేదు… అవునూ ఇప్పుడు నేను ఇస్కాన్ కి వెళ్లి దర్శనం చేసుకొని ఐదింటికల్లా తిరిగి రైల్వేస్టేషన్ కి చేరుకోగలనా…?” అని అడిగింది.. “ఇంకా త్రీ అర్స్ ఉంది కదా మేడం … సరి పోతుంది… పైగా ఇస్కాన్ టెంపుల్ రైల్వే స్టేషన్కి దగ్గర్లోనే ఉంటుంది… ” అన్నాడు అతడు…
డ్రైవ్ చేస్తున్నంతసేపు అతను ఆమెను అద్దంలో చూస్తూనే ఉన్నాడు… ఎంత సేపు చూసినా ఆమెను ఇంకా చూడబుద్దెస్తుంది … ఆమె మాట్లాడుతుంటే ఇంకా అందంగా కనబడుతుంది అతనికి… ఇస్కాన్ దగ్గర ఆపాక ఆమె లోపలికి వెళ్తుంటే కనిపించినంత వరకూ కన్నార్పకుండా ఆమెనే చూస్తూ నిలబడ్డాడు…
టెంపుల్ లోనుండి ఆమె తిరిగి వచ్చే సరికి 4.30 కావస్తోంది… వచ్చీ రాగానే కార్ స్టార్ట్ చేశాడతను… వెళ్లగలమా అడిగిందామె… ఈజీ గా వెళ్లొచ్చు మాడం 10 నిమిషాల్లో అక్కడుంటాం అంటూ పోనిచ్చాడు… సగం దూరం వెళ్లారో లేదో కార్ ఆపాల్సి వచ్చింది… ముందర చాలా దూరం వరకు వెహికల్స్ ఆగి ఉన్నాయి… రోడ్ మీద లారీ ఏదో బోల్తా పడినందువల్ల దాన్ని తీస్తున్నారట… ఒక 15 నిమిషాల వరకు కార్ అక్కడే ఆగిపోయింది… తర్వాత కూడా ఎక్కువ వెహికల్స్ ఉండడంతో మెల్లిగా వెళ్లాల్సి వచ్చింది… ఆమెలో ఒకటే టెన్షన్… రైల్వే స్టేషన్ కి చేరే సరికి 5.05 అవుతుంది… కార్ ఆగగానే గబుక్కున దిగేసింది… హాండ్ బ్యాగ్ లో నుండి చేతికి అందిన రెండువేల నోట్లు మూడో నాలుగో కూడా చూడలేదు అతని చేతిలో పెట్టి లోపలికి పరిగెత్తింది…. అతను కూడా చేతిలోని నోట్లను ఎన్నున్నాయా అని చూడలేదు… అతని చూపంతా ఆమె మీదనే ఉంది… మళ్లీ ఇక చూడలేనేమో అని ఆమెనే చూస్తూ నిలబడ్డాడు… ఆమె లోపలికి వెళ్ళాక నిట్టూరుస్తూ తిరిగి కార్ ఎక్కుతుంటే వెనక సీట్లో తన లగేజ్ బ్యాగ్ కనబడింది… వెంటనే దాన్ని తీసుకుని లోపలికి పరుగెత్తాడు… అమెకోసం వెతుకుతూ ఉంటే అక్కడొక సిమెంట్ బెంచీపై కూర్చొని ఉంది… ముఖం లో బాధ కనిపిస్తుంది… బ్యాగ్ పోయిందనుకుని బాధ పడుతుందేమో అనుకుంటూ అతను ఆమె దగ్గరకు వెళ్లి
“మేడం ఇదిగో మీ బ్యాగ్… దీని గురించేనా బాధ పడుతున్నారు?” అంటూ అందించాడు… ఆమె దాన్ని అందుకుంటూ… “ఓహ్ దీని గురించి మర్చేపోయాను… థాంక్స్ తెచ్చిచ్చినందుకు..” అంది.
అతను ఆశ్చర్యపోతూ “అంటే మీరు బాధపడుతున్నది బ్యాగ్ గురించి కాదా..”

“లేదు… ట్రైన్ మిస్ అయింది … పొద్దున అది అంత లేట్ వచ్చిందా… ఇదేమో ఇప్పుడు సరిగ్గా అయిదు గంటలకే వెళ్లి పోయింది… ఇది ఒక్క 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరి ఉంటే అందుకునేదాన్ని కదా. .”

“ఈ ట్రైన్స్ ఇంతే మాడం… టైమింగ్స్ అనేవి మనకి మాత్రమే … మనం మాత్రం టైంకి రావాలి .. కానీ అవి రావచ్చు .. రాకపోవచ్చు… అవును మీరిప్పుడేలా వెళ్తారు…”

1 Comment

  1. Good story nice

Comments are closed.