అతడు ఆమెని జయించాడు 132

“ఆరోజు ఏం మీరేం చేశారో గుర్తు తెచ్చుకోండి…. నేను ఫోన్ మాట్లాడుతుంటే హడావిడిగా వచ్చి కార్ ఎక్కి తొందరగా పోనీ పోనీ అన్నారు…. నన్ను క్యాబ్ డ్రైవర్ అనుకున్నారని తెలుసినా మీకు చాలా అర్జంట్ ఏమోనని నేను తీసుకెళ్లాను… అక్కడికి తీసుకెళ్లి వదిలేద్దామనుకున్నా… కానీ బ్యాగ్ కార్లోనే ఉంచి వెళ్లిపోయారు… రాగానే హోటల్ అన్నారు… అప్పుడు చెప్పాలనుకున్నా… అయితే మిమ్మల్ని మొదటి సారి చూసినపుడే మీ మీద నాకు కొంచెం ఇష్టం ఏర్పడింది… అందుకే మీరు రమ్మన్నచోటికల్లా వచ్చాను… మీరు హైదరాబాద్ రమ్మన్నపుడు కూడా మిమ్మల్ని ఇంకొన్ని గంటలు చూడాలనే వచ్చాను… కానీ ఆరాత్రి అలా అనుకోని సంఘటన జరిగాక నాకు చాలా బాధేసింది…”

“అయితే నువ్ నిజంగా క్యాబ్ డ్రైవర్ కాదా…”

“కాదు… ఆ రోజు మా ఫ్రెండ్ ని డ్రాప్ చేద్దామని స్టేషన్ కి వచ్చాను… ”

“ అయితే ఇక్కడికి నన్ను పెళ్లి చేసుకోవాలనే వచ్చావా..”

“అవును…”

“ఎందుకని..”

“ఎందుకంటే రెండు కారణాలు… ఒకటి నా వల్ల తప్పు జరిగింది కాబట్టి… .. దానికి మించి నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి…”

ఆ మాట విని ఆమెకు పట్టరాని సంతోషం కలిగింది.. ఒక్కసారిగా అతన్ని గట్టిగా కౌగిలించుకుంది… మొహమంతా ముద్దులతో ముంచెత్తింది….

అంతలోనే అతన్నుండి విడివడి తలదించుకుని కూర్చుండి పోయింది…

“ఏమయింది “ అడిగాడు అతను…

“మీకు నా మీద అసహ్యం లేదా…”

“ఎందుకు…”

“ముక్కూ మొహం తెలియని ఒక అపరిచితునితో సెక్స్ చేశానని, నా క్యారెక్టర్ మీద అనుమానం కలగలేదా…”

“లేదు… దానికీ రెండు కారణాలు ఉన్నాయి…

ఒకటి..
మనం ఎలాంటి పరిస్థితుల్లో ఆ పని చేశామో నాకు తెలుసు… అందులో తప్పేమన్నా ఉంటే అది ఇద్దరిది అవుతుంది కానీ నీ ఒక్క దానిది కాదు….

రెండు..
ఒకవేళ నీది బ్యాడ్ క్యారెక్టర్ అయ్యుంటే తెల్లవారినప్పటి నుండి నువ్ అంతగా బాధపడేదానివి కాదు…”

ఈ సమాధానంతో అతను ఆమెను పూర్తిగా జయించాడు..

“మీరెంత మంచి వారండీ… మీరు నన్ను పెళ్లిచేసుకోవడం నా అదృష్టం….” అంది ఆమె అతని భుజంపై తలవాలుస్తూ…

“దానికీ రెండు కారణాలున్నాయి….”

“దేనికి”

“నిన్ను పెళ్లి చేసుకోడానికి”

“ ఏమిటో అవి…”

“ఒకటి… నువ్ చాలా అందంగా ఉంటావు… ఇంత అందమైన భార్య దొరకడం చాలా కష్టం…”

“ఉమ్మ్.. రెండోది….”

“రెండోది … ఆ రాత్రి మనం బట్టలు విప్పాక నువ్ చాలా బాగా కో-ఆపరేట్ చేశావ్… అంత బాగా కో-ఆపరేట్ చేసే భార్య దొరకడం కూడా చాలా కష్టమట….” అన్నాడు అతను నవ్వుతూ..

“చీ మిమ్మల్నీ….” అంటూ ఆమె అతనిపై పడటంతో అతను బెడ్ పై వెల్లకిలా పడ్డాడు… అతని ఒక చెయ్యి బెడ్ పక్కన ఉన్న స్విచ్ పై పడడం వల్ల లైట్ ఆఫ్ అయింది… అందువల్ల ఏవో చప్పుళ్ళు, మూలుగులు మాత్రం వినబడ్డాయి తప్ప.. ఆ తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియలేదు…

అందుకని ఈ కథ ఇక్కడితో ఆపేస్తున్నాను…

1 Comment

  1. Good story nice

Comments are closed.