అతడు ఆమెని జయించాడు 133

“మావయ్య రాత్రి ఫోన్ చేసాడే.. అబ్బాయి పైలట్ అట… మనకి ఎప్పుడు వీలవుతుందో చెప్తే చూసుకోడానికి వస్తామన్నారట… ఈరోజు మంచిరోజు ఉందని ఈరోజే రమ్మన్నాడు మీ నాన్న… నీకు రాత్రే చెబుదామనుకున్నాం కానీ అప్పటికే నువ్ పడుకోవడంతో పొద్దున చెప్పొచ్చని ఊరుకున్నాం …లే లేచి రెడీ అవ్వు వర్జ్యం ఉందని వాళ్ళని తొందరగానే రమ్మన్నాడు మీ నాన్న” అంటూ వెళ్లిపోయిందావిడ.. ..

ఆ మాటే షాకింగ్ గా ఉంది ఆమెకు… అయితే అసలు షాక్ ఆమెకు పెళ్ళిచూపుల్లో పెళ్ళికొడుకుగా ‘అతన్ని’ చూసినప్పుడు తగిలింది… ఆ షాక్ లో ఉండగానే వాళ్ళ అమ్మ అబ్బాయి నచ్చాడా అని అడగడం… ఆమె తలా దించుకుని ఉండడం వల్ల మౌనాన్ని వాళ్ళు అర్ధాంగీకారంగా కాకుండా పూర్ణాంగీకారంగా తీసుకోవడం జరిగిపోయింది. కట్నకానుకలు కూడా ఏమీ వద్దనడంతో ఏకంగా పదిహేను రోజుల్లో పెళ్ళికి ముహుర్తాలు కూడా పెట్టేసారు.. ఆమె తేరుకునే లోపే అన్నీ అయిపోయాయి ..
అతను పైలట్ ఏంటో ఆమెకు అర్థం కాలేదు… అతను పైలట్ కాడని తర్వాత చెప్పినా ఎవరూ ఆమె మాట నమ్మలేదు.. ఏం చెప్పి పెళ్లి తప్పించుకోవాలో ఆమెకు తెలియలేదు.. ఒకరోజు అతను ఆమెకు ఫోన్ చేసాడు.. ఫోన్ లిఫ్ట్ చేసి ఆమె హలో అనగానే “మేడం నేను…” అన్నాడు .. వెంటనే ఆమె కాల్ కట్ చేసింది… తర్వాత కూడా అతను ఒకటి రెండు సార్లు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆమె అవకాశం ఇవ్వలేదు..

పెళ్లయ్యాక మొదటిరాత్రి శోభనం గదిలో గానీ అతనికి ఆమెతో మాట్లాడే అవకాశం రాలేదు…
తీరా అవకాశం వచ్చాక అతనికి మాట్లాడాలంటే భయంవేస్తుంది .. ఎలాగోలా గొంతు పెగుల్చుకుని

“ మేడం …” అన్నాడు…

ఆమె చురుగ్గా చూసింది..

“ మేడం మీరలా కోపగించుకోకండి … నేను చెప్పేది వినండి”

“ ఏం చెప్తావ్… తేరగా దొరికిందని ఆరోజు నన్ను అనుభవించావ్… ఇంకో అమ్మాయిని చేసుకుందామని ఈ ఇంటికి వచ్చావ్.. నీ టైం బాగాలేక ఇక్కడా నేనే ఉన్నాను… కాబట్టి ఛాన్స్ మిస్ అయ్యానని బాధ పడుతున్నావ్.. అంతే కదా నువ్ చెప్పేది…” అంది ఆవేశంగా…

“మేడం మీరు పొరపడుతున్నారు… నేను ఇంకో అమ్మాయిని చేసుకుందామని ఈ ఇంటికి రాలేదు.. మిమ్మల్ని చేసుకుందామనే వచ్చాను… “

“అబద్ధం .. నీకు నా అడ్రస్ ఎలా తెలుసు…”

“ఆరోజు మీరు ఎక్కిన క్యాబ్ ని ఫాలో అయ్యాను…తప్పు దిద్దుకుందామనే…. పెళ్ళిచూపులకి ఈ ఇంటికి వచ్చాను…”

“అదే నిజమైతే ఇన్నాళ్లు ఎందుకు ఆగావ్…”

“ దానికి రెండు కారణాలున్నాయి… ఒకటి మీ మనస్థితి కుదుటపడకపోవడం…..”

“అది నీకెలా తెల్సు.. “

“మేడం నేను ఆరోజు నుండీ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను గనుక….”

“ఎలా…”

“ఆరోజు నేను ఇక్కడే అంటే ఈ ఊళ్ళోనే ఉన్నాను.. రోజూ మిమ్మల్ని అబ్సర్వ్ చేస్తున్నాను.. సమయం కోసం వెయిట్ చేస్తున్నాను… ”

“సరే రెండో కారణం ఏంటో…”

“మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియలేదు… ఆఖరికి మీ మావయ్యని కలుసుకొని ఎవరి ద్వారానో మీ గురించి తెలిసిందని చెప్పి పెళ్లిచూపులు ఏర్పాటు చేయించాల్సి రావడం…”

“అందుకేనా పైలట్ అని అబద్ధం చెప్పావ్….”

“మేడం అది అబద్ధం కాదు….”

“అంటే ఈ రెండు నెలల్లో క్యాబ్ డ్రైవర్ నుండి పైలట్ అయిపోయావా…”

“నేను క్యాబ్ డ్రైవర్ అని ఎవరు చెప్పారు…”

“కాదా…”

“కాదు”

“మరి ఆ రోజు….”

1 Comment

  1. Good story nice

Comments are closed.