అమ్మ : అది సరే… నీ రూం లో నీ కొలీగ్ ఎవరో అమ్మాయి ఉంటుంది అన్నావు..ఎమ్ పేరు
నీలు : పూర్ణిమ
అమ్మ : వయసు ఎంత పెళ్లి అయ్యిందా…ఎమ్ ఊరు
నీలు : అబ్బా తను నాలాగే అమ్మ…మన పక్క ఊరి అమ్మాయి… చాలా ఇంకా ఏమైనా కావాలా..మా బ్యాంక్ లో వచ్చే కస్టమర్ ల కంటే నువ్వే ఎక్కువ క్వశ్చన్స్ వేస్తున్నావ్ .. ఉంటా పెటేయ్ ఫోను….
అమ్మ : ఒసేయ్ ఇవాళ శనివారం …తలంటుకుని దగ్గరలో ఏమైనా వెంకటేశ్వరస్వామి గుడి ఉంటే వెళ్లి తగలడు…తల్లి చెప్పటం పూర్తి అయిందో లేదో నీలు ఫోన్ కట్ చేసింది
అంత లో పూర్ణిమ లోపలికి వస్తూ ఎవరితో నే గొడవ పడుతున్నావు…అని అడిగిందే
నీలు : మా అమ్మే లేని పోని డౌట్స్ తో శతాయిస్తుంది
పూరి : హహహ ఎందుకు అంట
నీలు : లైఫ్ లో పేరెంట్స్ కి దూరంగా ఉండటం ఇదే మొదటి సారి…అందుకే లే..వాళ్ళ భయం తో నన్ను చంపుతున్నారు
పూరి నీలు నీ కింద నుండి మీద వరకు చూస్తూ వాళ్ళు భయపడటం లో తప్పు లేదు లే అంది నవ్వుతూ
నీలు : చీ పోవే ….అంటూ లోపలకి వచ్చి బట్టలు కట్టుకుంది….
పూరి : ఎక్కడికి అయినా వెళ్దామా???
నీలు : గుడికి ??
పూరి : డన్
*************************
పూరి స్కూటీ మీద ఇద్దరు గుడికి వెళ్లి తిరిగి వస్తున్నారు… గుడి బాగా క్రౌడ్ ఉండటం తో కాస్త లేట్ అయ్యింది…
పూరి స్కూటీ నడుపుతుంటే నీలు వెనక కూర్చుంది….
నీలు : ఎంటే బాబు ఈ ఏరియా…మనుషులు ఉంటారా ఉండరా అన్నట్లు ఉంటుంది..
పూరి : నిజమే నే…చీకటి పడితే చాలు నిర్మానుష్యం అయిపోతుంది ఏరియా అంతా
నీలు : అందులోని మన పి.జి డెడ్ ఎండ్ లో ఉంటాది
పూరి : హ్మ్మ్ !! ఏం చేస్తామే…మరెక్కడా ఇంత నీట్ గా ఉండలేదు
నీలు : అంతే లే అన్ని కావాలంటే ఉండవు కదా
పూరి : కాని మన ఇద్దరి లో ఒకరు ఊరు వెళ్ళాల్సి వస్తె ఏంటి పరిస్థితి…
నీలు : అమ్మో తలుచుకుంటే నే భయంగా ఉందే…నువ్వు ఉన్నావు కాబట్టి ధైర్యంగా పడుకుంటున్నా..
పూరి : హ్మ్మ్ నేను అంతే నే కనీసం సరైన ఇరుగు పొరుగు ఉంటే బాగున్ను…
నీలు : పొరుగు అంటే గుర్తు వచ్చిందే పూరి…మన పక్కింట్లో ఎవడే ఆ కుర్రాడు..
పూరి : వాడా …ఆ ఇంట్లో ఒక్కడే ఉంటాడు… వేస్ట్ లే
నీలు : హహహ ఏమే
పూరి : ఏదో బాగున్నాడు కదా అని పలకరించాలని చూసా కాని… పట్టించు కోలేదు..
నీలు : అమ్మని చాలా స్పీడ్ గా వున్నావే వచ్చి వారం కూడా కాలేదు అప్పుడే పలకరింపు వరకు వెళ్లావా..
పూరి : హహహ
