పూరి : ఓరిని…. అన్ని గుడ్లు కొని ఈ కుక్క కోసం కూర వండావా….
నీలు నవ్వుతూ…ఒసేయ్ ఇంక వాడి లైఫ్ లోకి తొంగి చూడటం ఆపెద్దాం…
పూరి : హ్మ్మ్!!!
నీలు : పద లేట్ అయ్యింది పడుకుందామ్
*******************************
ఇంక మూడు రోజులు వరకు పూరి ఆ కుర్రాడి మాట తీసుకురాలేదు…తన పని లో తాను పడిపోయింది…ఆ తర్వాత పూరి ఊరు వెళ్ళిపోయింది…
ఆ రోజు శనివారం…..పూరి లేక నీలు కి చాలా బోరింగ్ గా ఉంది… బ్యాంక్ నుంచి త్వరగా బయలుదేరింది రూమ్ కి తనకి స్కూటీ నడపడం రాకపోవటం తో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది…. సరిగ్గా వీధి లో జనరల్ స్టోర్స్ దగ్గరకి వచ్చేసరికి తనకి కావాల్సిన కొన్ని సామాన్లు గుర్తుకు వచ్చి షాప్ కి వెళ్లింది… షాప్ లో ఆల్రెడీ ఆ కుర్రాడు ఉన్నాడు….నీలు మాత్రం తనని పట్టించుకోకుండా తన సామాన్లు తీసుకునీ ఫోన్ పే చేస్తుంది…
షాప్ వాడు : ఫోన్ పే పని చెయ్యట్లేదు అమ్మ…డబ్బులు ఉంటే ఇచ్చేయ్…
నీలు : అయ్యో నా దగ్గర డబ్బులు లేవండి…
షాప్ వాడు : మరి ఎమ్ చెయ్యలేం అమ్మ… పొద్దుటి నుండి ఫోన్ పే ప్రాబ్లెమ్ అవుతుంది…
కుర్రాడు : ఎంత అయ్యిందో చెప్పండీ నేను ఇస్తాను
నీలు షాక్ అయ్యింది… అప్పటి వరకు మాటలే ఆడనీ మనిషి మొదటి సారి నోరు మెదిపే సరికి అలా చూస్తూ ఉండిపోయింది…
షాప్ వాడు: 350…. అయ్యింది…నువ్వు ఆ కుర్రాడికి ఫోన్ పే చేయు అమ్మ సరిపోద్ది…
కుర్రాడు డబ్బులు ఇచ్చేసాడు
నీలు : థాంక్స్… మీ నెంబర్ చెప్పండీ
కుర్రాడు : అయ్యో పర్లేదు….ఇప్పుడు ఎలాగో పని చేయట్లేదు అంటగా…తర్వాత కనిపించినప్పుడు ఇవ్వండి…
నీలు : తర్వాత మీరు కనిపించరు…పర్లేదు నెంబర్ చెప్పండీ…నేనే తర్వాత చేస్తాను …
కుర్రాడు : 9848…..
నీలు : పేరు
కుర్రాడు : అన్వేష్
