శనివారం ఈవెనింగ్ 1

పూరి: హెలో పూలు పెట్టుకునే జనరేషన్ కాదు మేము చెవిలో పూలు పెట్టే జనరేషన్ అని అంది…

దానికి సరళ నీలు నవ్వారు

నీలు : అవునే పూరి…ఒకసారి పూలు పెట్టుకుని ట్రై చెయ్యొచ్చు కదా ఆ అబ్బాయి నీ

పూరి నవ్వింది

సరళ ఏంటి అన్నట్లుగా చూస్తుంది వీళ్ళ మాటలని

పూరి : పక్కింటి కుర్రాడు అక్క….అదేంటో మేం ఎంత ట్రై చేసినా మా వైపు చూస్త లేడు…. మరెలా ట్రై చెయ్యలి చెప్పు

సరళ : ఎంత ట్రై చేసినా మీ వంక చూడనే లేదా

నీలు పూరి లు అహా అన్నారు…సరళ ఏమైనా ఐడియా చెప్తుంది ఎమో అన్న ఉద్దేశం తో ఆమె వంక చూస్తూ…

సరళ సజావుగా “ఇంత అందమైన అమ్మాయిలనీ చూడట్లేదు అంటే వాడు కచ్చితంగా తేడా అయి ఉండాలి” అని బాంబ్ పేల్చింది..

ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు….

*********************************

మరుసటి రోజు సాయంత్రం ఇద్దరు స్కూటీ మీద బాంక్ నుండి తిరిగి వస్తున్నారు…

పూరి : ఛీ సరళ అక్క చెప్పిన మాట నిజం అయి ఉంటాది అంటావా నీలు

నీలు : హహహ ఎమో కావచ్చు కాకపోవచ్చు నాకేం తెలుసు

పూరి : ఛా లేని పోని డౌట్ లు వస్తున్నాయే

నీలు : అయినా ఎమ్ అయింది ఇప్పుడు నీకు ఉన్నోడు అయితే చాలు గా మేటర్ లేనోడు అయితే ఏంటి…అని చిలిపిగా నవ్వింది..

పూరి : ఓయ్!!! అంత సాహసం చెయ్యలేను

నీలు : హహహ

పూరి : సీరియస్ గా ఆలోచిస్తుంది

నీలు : అయినా నీ పిచ్చి కాని వాడు ఒక్కడే మగాడా…వెతికితే ఊరు అంతా ఉంటారు అలాంటి వాళ్ళు

పూరి : అవుననుకో…కాని వాడు సింగిలే…. అలాంటి వాడినీ పెళ్ళి చేసుకుంటే…అత్త గోల ఉండదు ఆడ పడుచు గోల ఉండదు… మరే గోల ఉండదు

నీలు : హహహ అమ్మని అంత ఆలోచించావా

పూరి : హ్మ్మ్

నీలు : ఒక్క నీ గోలే ఉంటాది అంటావ్

పూరి : అంతే కదా… అందుకే అన్ని చూసుకునే ట్రై చేస్తున్నా

నీలు : కాని వాడు పడడు…అంటూ నవ్వింది

పూరి : అదే వై…

నీలు : ఏదో ఉంటాది…పూరి

పూరి : సరలక్క చెప్పిందే అంటావా

నీలు : అబ్బా అది కాకపోతే వేరే కారణాలు ఉండవా పూరి…

పూరి : వేరే కారణాలు ఎమ్ ఉన్నా పర్లేదు ముందు ఆ కారణమో కాదో తెలుసుకోవాలి

నీలు : హహహ ఎలా తెలుసుకుంటావు

పూరి : పరీక్ష పెడదాం

నీలు : పరీక్ష నా ఎమ్ పరీక్ష

పూరి : శీల పరీక్ష…

నీలు : హహహ అదేం పరీక్ష

పూరి : చెప్తా చెప్తా….ఆ పరీక్ష లో అమ్మాయి తప్పితే తప్పు…అబ్బాయి తప్పక పోతే తప్పు…ఈ రోజు వాడు తప్పో తుప్పో తేల్చెద్దాం

నీలు : హహహహహహ

***************************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *