శనివారం ఈవెనింగ్ 1

ఆ రోజు సాయంత్రం చీకటి పడినాక ఇద్దరు వీధి చివర జనరల్ స్టోర్స్ దగ్గర నిలబడి కూల్ డ్రింక్స్ తాగుతున్నారు…. అంత లో బుల్లెట్ సౌండ్ వినపడింది వాళ్ళకి

పూరి : ఏయ్ మన మగాడు వస్తున్నాడే ఇటే

నీలు నవ్వుతూ ఏయ్ ఎమ్ అనను అని మాట ఇచ్చావు…

పూరి : హ్మ్మ్ సరే లే

ఆ కుర్రాడు వచ్చి వీళ్ళ ముందు బండి ఆపి షాప్ వాడిని పది కోడి గుడ్లు అడిగాడు…

నీలు : ఒక్కడే అన్ని ఎమ్ చేసుకుంటాడే

పూరి: ఎమో వాటి మీద కూర్చుని పొదుగుతాడు ఎమో…

నీలు నవ్వుతూ ఏయ్ నువ్వు నీ కుళ్లు జోక్ లు….అని అంది

పూరి : మరి నన్ను అడిగితే

నీలు : సర్లే వాడు వస్తున్నాడు సైలెంట్ గా ఉండు

ఆ కుర్రాడు సైలెంట్ గా వచ్చి బైక్ తీస్తుంటే పూరి “మంచమేసి దుప్పటేసి మల్లె పూలు జల్లాను రాజా”” అని వాడికి వినిపించే లా పాట పాడుతుంది…నీలు తన నోరు మూసే ప్రయత్నం చేస్తుంది…అయినా కానీ వాడు పట్టించుకోకుండా…బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతున్నాడు…

పూరి వెళ్తున్న బైక్ నీ చూస్తూ ఆ వెనక స్టికర్ చూసావా AA ….వీడు అల్లు అర్జున్ ఫ్యాన్ లా ఉన్నాడే… ఛా ముందే తెలిస్తే బన్నీ పాట ఏదో పాడే దాన్ని… అప్పుడైనా మన వంక చూసే వాడు ఎమో..

నీలు నవ్వుతూ నువ్వు ఇంక మారవే వేస్ట్ ఫెలో….సరే పద రూం కి…

ఇద్దరు కాలిగా ఉన్న రోడ్ మీద నడుస్తూ వస్తున్నారు

పూరి : ఈ వీకెండ్ ఇంటికి వెళ్తానే…నీకు ఒకే కదా

నీలు : హ్మ్మ్!!! ఏం చేస్తాం ఇద్దరికి ఒకేసారి లీవ్ ఇవ్వరుగా…నువు వెళ్తే నేను డ్రాప్ అవ్వాలి

పూరి : అందుకే ముందే అడుగుతున్నా…

నీలు : హహహ సరే…

పూరి : ఇంకో ఫెవర్ కూడా చెయ్యాలి నువ్వు

నీలు : ఎంటే

పూరి : నైట్ కి బెడ్స్ ఎక్స్చేంజ్

నీలు : హహహ డన్..

*****************************

ఇద్దరూ రూం కి చేరుకుని కాసేపటికి డిన్నర్ కంప్లీట్ చేసారు…

డిన్నర్ అయ్యాక పూరి బాల్కనీ లోకి వచ్చింది

నీలు : ఎంటే మళ్ళా అటే చూస్తున్నావు

పూరి : అహా… పది గుడ్లు కొన్నాడు కదా… వీడి ఇంటికి ఎవరైనా గెస్ట్ లు వచ్చారా అని చూస్తున్నా

నీలు తల కొట్టుకుని పక్కాగా నీకు పిచ్చి పట్టిందే…

పూరి : అబ్బా పిచ్చి కాదే…. ఎమో నిజంగా నే లోపల ఉన్నారు ఎమో… నైట్ కూడా మేడ మీద బెడ్ అది చూస్తుంటే….

అంత లో వీళ్ళు చూస్తుండగా ఆ కుర్రాడు గేట్ తెరిచి బయటకి వచ్చాడు…అప్పుడే ఎక్కడ నుంచి వచ్చిందో ఒక నల్ల కుక్క వచ్చి వాడి ముందు కూర్చుంది…వాడు దానికి వాడు వండిన ఎగ్స్ కర్రీ నీ పెట్టాడు….ఆ కుక్క ఆబగా తింటుంది…

నీలు : హహహ అదిగో గెస్ట్…పెద్ద గెస్ట్… నీ డౌట్ తీరిందా….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *