శనివారం ఈవెనింగ్ 1

పూరి : హా ఇంకేం అంటాం అలాంటి వాడిని…. వేస్ట్ వాడు తేడా…ఇంక వదిలేయ్…..

జరిగిన దానికి నీలు నవ్వుతుంటే పూరి మాత్రం ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయింది…చాలా విసుక్కుంది….వాడిని నానా మాటలు అనటం మొదలు పెట్టింది

నీలు : ఉఫ్!!! పూరి ఎందుకు వాడిని అల అంటావు…నిన్ను మించిన అందగత్తె ఎవరో ఉండి ఉండొచ్చు వాడి లైఫ్ లో….అందుకే పట్టించుకోవట్లేదు ఎమో….

పూరి : ఎమ్ మాట్లాడుతున్నావే…హా ఎమ్ మాట్లాడుతున్నావ్ అంటూ…కోపంగా…టవల్ మరింత కిందకి జార్చింది….

నీలు అది చూసి ఛీ అని నవ్వుతూ కళ్ళు మూసేసుకుంది…

పూరి అద్దం లో చూసుకుంటూ…ఇంత కంటే అందగత్తె ఉంటాదా….అంటూ తన అందాలు చూస్కుంటుంది…

నీలు : అబ్బాబ తల్లి తప్పు అయిపోయింది..నువ్వే అందగత్తే వి…ఓకే నా.. కాస్త ఆ టవల్ సరి చేసుకుంటే ఓపెన్ చేస్తా నా కళ్ళు అంటూ…కళ్ళు మూసుకుని చెప్పింది…

పూరి : హ్మ్మ్!!! అల అన్నావ్ బాగుంది…ఇప్పుడు కళ్ళు తెరొచ్చు…

నీలు నవ్వుతుంది…

**************************

నీలు : ఏదైనా కాని పాపం వాడిని ఆ మాట అనకుండా ఉంటే బాగున్నే…ఏదో ఆట పట్టించాం అన్నట్లుగా ఉండేది …బట్ అల అన్నావు చూడు అక్కడ కొంచమ్ గిల్టీ గా ఉంది నాకు

పూరి : పోవే వాడు ఎమ్ ఫీల్ అవ్వడు…అసలు వాడికి ఫీలింగ్స్ ఏ ఉండవు.. వేస్ట్

నీలు : అహా ఎందుకు ఉండవు… నీ కంటే అందగత్తె ఉంటాది అంటేనే నువ్వు ఫీల్ అయ్యి విప్పి చూపించావు…ఒక అబ్బాయిని నువ్వు మగాడివే నా అని అంటే…

పూరి : హా విప్పి చూపిస్తాడా…. చూపించమను..మగతనం ఉందో లేదో తెలిసిపోద్ది కదా…

నీలు : హహహ పోవే

అలా రాత్రి అంతా పూరి ఆ కుర్రాడిని తిట్టుకుంటునే ఉంది….నీలు వదిలేయ్ మని ఎంత చెప్పినా ఏదో రకంగా టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ ఆ కుర్రాడిని తిడుతూనే ఉంది….

సరళ రావటం కాస్త లేట్ అయ్యింది….ఇంక రాత్రి ముగ్గురు తినేసి పడుకున్నారు…

సరళ బాగా అలసిపోవడం తో ముందుగానే నిద్ర లోకి చేరుకుంది…నీలు పూరి లు కాసేపు అవి ఇవి మాట్లాడుకుని కాలక్షేపం చేసారు….

నీలు : హ్మ్మ్ ఇంక ప్రశాంతంగా పడుకో పూరి….సాయంత్రం నుండి తెగ ఆవేశ పడ్డావు…అంటూ నవ్వింది…

పూరి : నీ యమ్మ పడుకుంటే వాడే కలలోకి వచ్చే లా ఉన్నాడే…

నీలు : హహహ..పడుకో లే ఎక్కువ ఆలోచించకు..గుడ్ నైట్

పూరి : హ్మ్మ్ గుడ్ నైట్ ….

అల నీలు పూరీ లు కూడా నిద్ర లోకి జారుకున్నారు….

రూం అంతా చిమ్మ చీకటి….ముగ్గురు ప్రశాంతంగా నిద్ర పోతున్నారు వారి వారి బెడ్స్ పై……సరిగ్గా రాత్రి ఒంటిగంట సమయంలో ….. ఏదో ఫాట్!!!!!!! మని ఎవరో ఎవరినో కొట్టినట్లుగా ఒక శబ్దం రూం అంతా రీ సౌండ్ వచ్చేలా వినిపించింది….

నీలు ఉలిక్కిపడి నిద్ర లేచి లైట్ వేసింది…

లైట్ వెలుగు లో పూరి తన బెడ్ మీద కూర్చుని ఉంది…పూరి చెయ్యి తన చెంప మీద ఉంది….

నీలు కంగారు పడి…పూరి ఎమ్ అయ్యిందే అని తన దగ్గరకి వెళ్లి తన చెంప పైన ఉన్న చెయ్యి నీ తీసి చూసింది…

అంతే పూరి చెంప ఎర్రగా కమిలి పోయి ఉంది

నీలు షాక్ అయ్యి ఎమ్ అయ్యిందే అని అడిగింది

పూరి తల పక్కకి తిప్పి పక్కనే నిద్ర పోతున్న సరళ నీ చూస్తూ ఎవరో నన్ను కొట్టారే అని అంది మెల్లగా

నీలు : ఏయ్ నిన్ను ఎవరు కొడతారే..నీకు మతి ఏమైనా పోయిందా…

పూరి : లేదు నీలు నన్ను ఎవరో కొట్టారు

నీలు పూరి బుగ్గ మీద ఉన్న చేతి అచ్చులు మీద పాముతూ…ఎమ్ మాట్లాడుతున్నావే…మేం ఇద్దరం పడుకుని ఉండగా వేసిన తలుపులు వేసినట్లు ఉండగా…ఎవరో వచ్చి నిన్ను ఎలా కొడతారే….నువ్వే ఏదో పిచ్చి కల కంటూ నిన్ను నువ్వే కొట్టుకుని ఉంటావు…

పూరి భయంగా మొహం పెట్టీ అంతే అంటావా అని అడిగింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *