అంత లో బుల్లెట్ మీద పక్కింటి కుర్రాడు వస్తుండటం తో ఆ సౌండ్ కి ఇద్దరి కళ్ళు ఆ అబ్బాయి మీద పడ్డాయి….
పూరి : వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్స్డ్..అంటూ హం చేస్తుంది మెల్లగా
నీలు నవ్వుతుంది…
ఆ కుర్రాడు బండి నీ కింద పార్క్ చేసి గేట్లు వేసి వస్తుంటే..ఇద్దరు అమ్మాయిలు బాల్కనీ లో కూర్చోవటం కనిపించింది….వాళ్ళని చూసినా కూడా కనీసం స్పందన లేకుండా తన ఇంటి తలుపు తెరవటానికి కీ కోసం తన పాకెట్ లో వెతుక్కుంటున్నాడు…
పూరి : చూసావా చూసినా ఎమ్ రెస్పాన్స్ లేదు
నీలు నవ్వుతూ పక్కన కూర్చుని చూస్తుంది
పూరి : సర్లే తప్పుతుందా మనమే పలకరిద్దాం…
నీలు : ఏయ్ వద్దే
పూరి : చుప్ నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండవే
నీలు మనసులో అబ్బా ఇప్పుడు ఎమ్ చేస్తుందా ఇది అని అనుకుంటూ చూస్తుంది…
పూరి : హెలో
అతను చూసాడు కానీ మళ్ళా ఎవరినో అన్నట్లు తల తిప్పుకున్నాడు
పూరి : హెలో నిన్నే బాబు
అతను ఈసారి ఇద్దరి వంక చూశాడు…పూరి ఇదే అదును అనుకుని మాట్లాడటం మొదలు పెట్టింది
పూరి : హాయ్ మేము ఇక్కడ కొత్తగా చేరాం…
అతను : ఓహ్ అన్నట్లుగా ఒక చూపు చూసాడు
పూరి : నా పేరు పూర్ణిమ …ఇది నా ఫ్రెండ్ నీలిమా…ఇద్దరం బ్యాంక్ లో పని చేస్తూ ఉంటాం..
అతను పూరి మాటలు వింటూ…కాస్త కంగారు పడుతు ఎవరైనా చూస్తారు ఎమో అని చుట్టూ చూస్తున్నాడు..
నీలు పక్కన ఉండీ కంగారు పడుతు పూరి వదిలేయ్ వే అని గోకుతోంది…
పూరి : ష్!!!! ఉండవే అంటూ నవ్వుతుంది
అతను వీళ్ళ నీ పట్టించుకున్నట్లుగా లేదు….తన కంగారు లో తాను ఉన్నాడు…
పూరి : ఏంటి బార్ లో పని చేస్తావా… అని అడిగింది….
ఆ మాట వినగానే అతను కాస్త నెమ్మదించి…తన లెఫ్ట్ పాకెట్ లో ఫోల్డ్ చేసి ఉన్న డబ్బులు కట్టను బయటకి తీసాడు..నోట్ల కట్టని అల చూడగానే పూరి సైలెంట్ అయిపోయింది…. వాళ్ళకి కనిపించే లా అలా డబ్బులు పట్టుకుని..(చెప్పకనే చెప్తూ)… రైట్ హ్యాండ్ తో “కీ” తీసాడు….ఈ సారి తలుపు తెరుచుకుంది….అతను సైలెంట్ గా లోపలకీ వెళ్ళాడు…
నీలు ఊపిరి పీల్చుకుంది….పూరి నవ్వుతూ ఇందాక ఏదో అడుగుతున్నావు ఏంటి అని అడిగింది నీలు నీ
నీలు : ఎమో తల్లి ఎమ్ అడిగానో తెలీదు కాని వాడు మాత్రం బార్ ఓనర్ అని తెలుస్తుంది పక్కాగా…ఆ డబ్బు కట్ట చూసావా..మన డైలీ కాష్ కలక్షన్ అంత ఉంది…
పూరి నవ్వుతూ : ఈ పూరి పడి పోవాలంటే ఆ మాత్రం ఉండాలి అని అంది…తీక్షణంగా వాడి ఇంటి వైపు చూస్తూ..
నీలు నవ్వుతూ ఓహ్ అంది
నీలు : కాని ఒకటి గమనించావా వాడు మన కంటే ఏజ్ తక్కువ లా ఉన్నాడే…
పూరి : పేదోడు అయిన పెద్దోడు కంటే ఉన్నోడు అయిన చిన్నోడు నయమే నీలు…..
***********************************
ఇంక ఆ రోజు నుంచి పూరి ఆ కుర్రాడి నీ కనిపించిన ప్రతి సారి కవ్వించే విధంగా మాట్లాడటం మొదలు పెట్టింది…నీలు పూరి చేష్టలు నీ ఒక వైపు వారిస్తూన్నా మరో వైపు ఎంజాయ్ చేస్తుంది…
ఎంత ప్రయత్నించినా కూడా అ అబ్బాయి తన పంథా లో తాను ఉండే వాడు….పెద్దగా స్పందన లేకుండా పైగా తనని ఎవరో చూస్తారు అన్న భయం తో ఉండే వాడు…
ఇలా ఉండగా ఒక రోజు సాయంత్రం సరళ తన పని ముగించుకుని రూం కి వచ్చింది…
సరళని చూడగానే నీలు పూరీ లు అహా ఏంటి సరలక్క చాలా ఫ్రెష్ గా ఉన్నావు…అని అడిగారు
సరళ : అదేం లేదు అమ్మ దారిలో మల్లె పూలు అమ్ముతుంటే మూరెడు కొనుక్కున్న అందుకే మీకు అలా కనిపించి ఉంటాను అని తన పొడుగాటి జడ నీ పూలని ఇద్దరికి చూపిస్తూ మురిసిపోయింది…
నీలు : అహా పూల తో నీ అందం ఇంకా రెట్టింపు అయ్యింది అక్కా…
సరళ : అయ్యో ఊరుకో నీలు ఆడదానికి పూలు అందం…మీరు పెట్టుకుంటారో లేదో అని కొనలేదు…లేదంటే మీకు కూడా తీసుకునే దాన్ని
