థర్డ్ MISSION 12 41

ఇప్పుడు దేవతలు ఎంత కంగారుపడుతున్నారో – భయపడుతున్నారో – ఏమిచెయ్యాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక కన్నీళ్లతో …….
మనల్ని చూడగానే కన్నీళ్లు ఆగిపోతాయిలే , అయినా మేమున్నది మా బుజ్జిదేవుడితో అని వారికి కాసేపట్లో తెలుస్తుందిలే …… అన్నారు అక్కయ్యలు .
అంతవరకూ దేవతలను బాధపెట్టలేను , మొబైల్ మొబైల్ ఎక్కడ ? .
” అందరి మొబైల్స్ ను లాక్కుని స్విచ్ ఆఫ్ చేసి ఆ గదిలో ఉంచారు అంటూ మొత్తం తీసుకొచ్చారు సిస్టర్స్ ”
వెతికి నా మొబైల్ తీసుకుని చూస్తే నో టవర్ – ముగ్గురి అక్కయ్యల మొబైల్స్ అందుకుని చూసినా ప్రయోజనం లేదు …… ప్చ్ ప్చ్ ప్చ్ ……
” మా మొబైల్స్ లో కూడా లేదు తమ్ముడూ అంటూ సిస్టర్స్ అంతా తమ తమ మొబైల్స్ తీసుకున్నారు – తీరం నుండి చాలా దూరమే వచ్చేసినట్లున్నాము – కాంటాక్ట్ చెయ్యలేమా ? ”
కంట్రోల్ రూంలో సాటిలైట్ ఫోన్స్ ఉంటాయి , నేను చూస్తాను – అక్కయ్యలూ …. మీరు మిగతా షిప్స్ లొకేషన్స్ కనుక్కోండి .
అలాగే తమ్ముడూ …….
రేయ్ కేకలువేశారో మిగిలిన ప్రాణాలూ తీసేస్తాం , మా మా దేవతలు ఎంత కంగారుపడుతున్నారోనని టెన్షన్ పడుతుంటే మీ గోల ఏంటి , ఎంతమంది ఉసురు పోసుకున్నారు అనుభవించండి అనిచెప్పి కంట్రోల్ రూంలోకి వెళ్ళాను , తోడుగా సౌమ్య అక్కయ్య – సిస్టర్స్ వచ్చి వెతకడంలో సహాయం చేసారు .

తమ్ముడూ ఇదేనా అంటూ చూయించారు .
నాకు మాత్రం ఏమి తెలుసు అక్కయ్యా …….
సౌమ్య అక్కయ్య : ఆక్ … అక్కయ్య అక్కయ్య పిలుపు …… లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ మురిసిపోతూ అందించింది .
చెవికి ఆనిస్తే సౌండ్ వస్తుండటంతో పనిచేస్తోంది అక్కయ్యా ఇదే అయి ఉంటుంది …….
సౌమ్య అక్కయ్య : మళ్లీ అక్కయ్య పిలుపు , లవ్ యు తమ్ముడూ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి నవ్వుతోంది .
సౌమ్య అక్కయ్యా నవ్వుతున్నారు భయం వెయ్యడం లేదా ? అదిగో చుట్టూ సిస్టర్స్ అందరూ కూడా నవ్వుతున్నారు .
” మాకు తోడుగా స్వయానా ఈ బుజ్జిదేవుడే ఉన్నాడు మాకెందుకు భయం , అడ్వెంచర్ గా అనిపిస్తోంది అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు ”
జస్ట్ మీ తమ్ముడిని అంటూ ఆనందించాను , 100 కు డయల్ చేసి విషయం చెప్పాను – సర్ సర్ సర్ …… కట్ చేయకండి మేము క్లిష్ట పరిస్థితులలో ఉన్నాము – నో నో నో కట్ చేసేసారు .
” ఏమైంది తమ్ముడూ …… ”
100 కు డయల్ చేసి ఆడుకుంటున్నారా అంటూ కట్ చేసేసారు – పిల్లాడి వాయిస్ కదా …… , మీరు ట్రై చెయ్యండి అంటూ 100 డయల్ చేసి సౌమ్య అక్కయ్యకు ఇచ్చాను .
సౌమ్య అక్కయ్య : పరిస్థితిని వివరించారు , నో నో నో సర్ …… మీరంతా ఒక్కటే అంటూ కట్ చేసేసారు తమ్ముడూ , మమ్మీకి కాల్ చెయ్యనా ? అమ్మ హైకోర్టు చీఫ్ జస్టిస్ ……
What …… ? .
సౌమ్య అక్కయ్య : అవును అమరావతి హైకోర్టు చీఫ్ జస్టిస్ …… , అందుకే కాలేజ్ హాస్టల్ లో ఉంటున్నాను , మమ్మీ వెంటనే సెక్యూరిటీ అధికారి ఫోర్స్ నే పంపించేస్తుంది .
ఇంకెందుకు ఆలస్యం చెయ్యి అక్కయ్యా ……
సౌమ్య అక్కయ్య : అక్కయ్య ….. ఉమ్మా అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి కాల్ చేసింది , రెండుమూడుసార్లు చేసినా ఎత్తలేదు , తమ్ముడూ ……ఒకవిషయం చెప్పడం మరిచిపోయాను , అమ్మపై ఇష్టంతో సరిగ్గా అమ్మ తీర్పు ఇచ్చే సమయంలో కాల్ చేసి డిస్టర్బ్ చేసేదానిని , బహుశా ఇప్పుడుకూడా …….
సరిపోయింది అక్కయ్యా అంటూ అక్కయ్యలలానే మొట్టికాయవేశాను , sorry sorry అక్కయ్యా …… అంటూ గుంజీలుతీస్తున్నాను .
సౌమ్య అక్కయ్య : sorry చెబితే కోపం వచ్చేస్తుంది , ఎన్ని దెబ్బలైనా వేసుకో అంటూ ఆనందిస్తోంది , తమ్ముడు కొట్టాడు కొట్టాడు అంటూ సిస్టర్స్ తో సంతోషం పంచుకుంటోంది .
అందరూ ఎంజాయ్ చేస్తుండటం చూసి , కొద్దిగానైనా భయం లేదు మీకు , ఎలా సమాచారం అందించాలో తెలియక మరియు మిమ్మల్ని మీ మీ పేరెంట్స్ దగ్గరకు ఎలా చేర్చాలో తెలియక నేను కంగారుపడుతుంటేనూ ……
” మాకైతే కంగారే లేదు ఎంతసేపైనా – ఎన్నిరోజులైనా షిప్ లోనే ఉండిపోతాము ”
సరిపోయింది ఇప్పుడెలా ఇప్పుడెలా ….. ? ఆ ఆ విశ్వ సర్ విశ్వ సర్ అంటూ కాంటాక్ట్స్ లో నెంబర్ కు కాల్ చేసి విషయం చెప్పాను – నేనెవరినో చెప్పాను , కాలేజ్లో డ్రగ్స్ మరియు అంకుల్స్ విషయంలో నాగురించి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఆకతాయి కాల్ కాదని నమ్మి వెనువెంటనే రియాక్ట్ అయ్యి షాక్ అయినట్లు ఆవెంటనే గొప్ప పనిచేశావు మహేష్ అంటూ జాగ్రత్తలు వివరిస్తూనే హార్బర్ కు చేరుకున్నారు , హార్బర్ సిబ్బందిని కలిసినట్లు ఎలా తీరానికి చేరుకోవాలో గుర్తులతోపాటు షిప్ మ్యానువల్ అందుకోమని ప్రతీదీ వివరించడంతో మీడియం స్పీడ్ తో హార్బర్ కు రూట్ సెట్ చెయ్యడంతో ఆటోమేటిక్ గా వెళుతోంది .
అక్కయ్యలూ …… సాధించాం ఇదిగో గంటలో హార్బర్లో ఉంటాము .
అందరూ చప్పట్లు కేకలువేస్తున్నారు .
నవ్వుకుని థాంక్యూ థాంక్యూ విశ్వ సర్ , కంట్రోల్ రూమ్ కు కాల్ చేసినా పట్టించుకోలేదు , సర్ సర్ మరొక్క విషయం అంటూ దేవతలకు క్రెడిట్ చెందేలా చెయ్యమని రిక్వెస్ట్ చేసాను .
విశ్వ సర్ : అంతమందిని రక్షించి వారి వారి ఇంటికి చేరుస్తున్నావు , ఈమాత్రం చెయ్యనా ? .
థాంక్యూ థాంక్యూ సర్ ……
” తమ్ముడూ తమ్ముడూ …… చుట్టూ మరియు సీసీ కెమెరాలు ఉన్నాయి ఎలా ? ”
అవును ఎలా మహేష్ అన్నారు విశ్వ సర్ ? .
సర్ – సిస్టర్స్ …… ఆవిషయం నేను చూసుకుంటాను అంటూ పెద్దమ్మను తలుచుకున్నాను , అక్కయ్యల ప్లేసస్ లో దేవతలు ఉంటారు .
సౌమ్య అక్కయ్య : పాపం నీ అక్కయ్యలు ….. , తెలిశాక ఉంటుంది నీకు .
ప్చ్ ప్చ్ ….. అక్కయ్యల కంటే దేవతలే ముఖ్యం నాకు అంటూ సిగ్గుపడుతున్నాను .
గ్రాఫిక్స్ చేసేస్తావన్నమాట అంటూ సిస్టర్స్ ……
Yes yes సిస్టర్స్ ….. , ఈవిషయం మాత్రం అక్కయ్యలకు తెలియకూడదు ……

తమ్ముడూ తమ్ముడూ ……
అక్కయ్యలు వచ్చేస్తున్నారు ష్ ష్ ష్ ……
అక్కయ్యలు : వచ్చేసినట్లు చూసి , మళ్లీ ఏదో దాచేస్తున్నారు అంటూ కొడుతున్నారు .
ఏమీలేదు ఏమీలేదు వీరత్వం ప్రదర్శించి ఇంతమందిని కాపాడిన మా అక్కయ్యలకు బిగ్ సర్ప్రైజ్ ……
అక్కయ్యలు : సర్ప్రైజ్ మాకిష్టమే , పెద్దదన్నమాట అంటూ మురిసిపోతున్నారు .
అవునే చాలా పెద్దది , సర్ప్రైజ్ ఏంటో తెలిశాక తమ్ముడికీ బిగ్ రిటర్న్ ఇస్తారు అంటూ సిస్టర్స్ తోపాటు నవ్వుకుంటున్నారు సౌమ్య అక్కయ్య .
ష్ ష్ ష్ అక్కయ్యా – సిస్టర్స్ , మీరు మరింత ఆజ్యం పోస్తున్నట్లుంది .
” అక్కయ్యల గిఫ్ట్స్ ఇష్టమే అన్నావుకదా తమ్ముడూ బాగా ఎంజాయ్ చెయ్యి అంటూ నవ్వులు ”
అయిపోయాను …… , అది సరేకానీ అక్కయ్యలూ …… ఏదైనా దొరికిందా ? .
అక్కయ్యలు : అన్నీ షిప్స్ లొకేషన్స్ – రూట్స్ కనిపెట్టేసాము తమ్ముడూ …. , మొత్తం సమాచారం ఈ ల్యాప్ లో ఉంది ఇదిగో తను టెకీ ……
సిస్టర్ ……
” ల్యాప్ ఓపెన్ చేసి కోల్కతా – పూరీ – చెన్నై – మన్నార్ – మ్యాంగళూర్ – ముంబై – గోవా …… అన్నీ హార్బర్స్ నుండి బయలుదేరిన షిప్స్ ప్రస్తుతానికి ఏ రూట్ లో వెళుతున్నాయో వివరాలు చూయించారు ”
Welldone అక్కయ్యలూ అంటూ బుగ్గలపై ముద్దులు – సూపర్ సిస్టర్ …… వెంటనే ఈ సమాచారం మొత్తాన్నీ వైజాగ్ హార్బర్ లో ఉన్న విశ్వ సర్ కు పంపించాలి .
టెకీ సిస్టర్ కోపంతో చూసి చేతిపై గిల్లేసి నవ్వుకుంటూ సెండ్ చేస్తున్నారు .
స్స్స్ ….. సిస్టర్ ? .
” yes yes తప్పులేదు తప్పులేదు అంటూ చుట్టూ సిస్టర్స్ నవ్వుకుంటున్నారు ”
నాకేమీ అర్థం కావడం లేదు .
సౌమ్య అక్కయ్య : నీ అక్కయ్యలకు మాత్రమే ముద్దులుపెడితే ఆమాత్రo కోపం సహజం మరి …….
నవ్వుకుని , విశ్వ సర్ ……
విశ్వ సర్ : మొత్తం విన్నాను మహేష్ , ఇదిగో వచ్చేసింది అన్నీ స్టేట్స్ కంట్రోల్ రూమ్స్ కు పంపిస్తున్నాను అని నవ్వుతూనే బదులిచ్చారు .
సర్ మొత్తం వింటున్నారన్నమాట ……
విశ్వ సర్ : వినిపిస్తోంది మహేష్ , నాతప్పేమీ లేదు .
నవ్వుకుని , సర్ సర్ నేను చెప్పిన విషయం ……
విశ్వ సర్ : వారే సమాచారం అందించినట్లు ప్రపంచానికి తెలుస్తుంది , ఒక్క షిప్ మాత్రమే కాదు అన్నీ షిప్ లోని అందరినీ కాపాడబోతున్నావు సెల్యూట్ మహేష్ ……..
నన్ను తరువాత పొగడవచ్చు సర్ ముందు …..
విశ్వ సర్ : ఇదిగో ఇక్కడ నేవీ చీఫ్ ఆఫీసర్స్ చేరుకున్నారు ఆ పనిలోనే ఉన్నారు , మీదగ్గరకు కూడా బయలుదేరారు , నన్నూ రమ్మంటున్నారు .
రండి రండి సర్ మాకు కాస్త ధైర్యంగా ఉంటుంది .

చుట్టూ ఎటుచూసినా నీళ్ళల్లో అర గంట ప్రయాణం తరువాత మావైపుగా నేవీ బోట్స్ రావడం అక్కయ్యలు – సిస్టర్స్ గమనించారు .
అక్కయ్యలకు మాత్రమే ముద్దులు కురిపించడంతో , సౌమ్య – సిస్టర్స్ …… వీపు విమానం మ్రోగించారు .
నవ్వుకుని డెక్ మీదకు పరుగుతియ్యబోయి , స్స్స్ నొప్పి అక్కయ్యలూ అంటూ అక్కయ్య భుజంపై చేతినివేసి వెళ్ళాను .

విశ్వ సర్ తోపాటు పాతిక మందిదాకా నేవీ యూనిఫామ్ లో ఫోర్స్ షిప్ మీదకు వచ్చి షిప్ మొత్తం చూసి కంట్రోల్ లోకి తీసుకున్నారు , ALL CLEAR మనం చెయ్యాల్సినదల్లా అరెస్ట్ చెయ్యడమే , ఎన్నో ఏళ్లుగా మనల్ని ముప్పుతిప్పలుపెడుతున్న వాడినీ కదలకుండా చేసేసారు .
విశ్వ సర్ : మహేష్ మరియు అందరికీ అంటూ సెల్యూట్ చేశారు – నేవీ మొత్తం సెల్యూట్ చేసింది .
సిస్టర్స్ : మాకు కాదు మాకు కాదు దేవ ……
ష్ ష్ ష్ అక్కయ్యలూ , తరువాత తరువాత సర్ కు తెలుసులే ……
విశ్వ సర్ : నేను చూసుకుంటాను , ముందుగా సెక్యూరిటీ ఆఫీసర్ల తరుపున అందరికీ sorry , కంట్రోల్ రూమ్ కు మీరు కాల్ చేసినా – నేను నమ్మినా నాతోపాటు ఒక్క సెక్యూరిటీ అధికారి కూడా రాలేదు , మీరు పోరాడినది చిన్నవాళ్ళతో కాదు ఇలానే ఎంతోమంది జీవితాలను అంతం చేసిన కనికరం లేని మృగాలతో ……
బోట్స్ నుండి మెసేజ్ రావడంతో …… , మహేష్ మహేష్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ మీరు సమాచారం ఇచ్చిన షిప్స్ అన్నీ ఇప్పుడు మన నేవీ కంట్రోల్ లోకి వచ్చేసాయి అందరినీ అదుపులోకి తీసుకున్నారు .
అందరమూ సంతోషంతో కేకలు – చప్పట్లతో కౌగిలించుకున్నాము .
స్స్స్ స్స్స్ అక్కయ్యలూ …… చాలా నొప్పివేస్తోంది అంటు పడిపోబోతే పట్టుకుని కూర్చోబెట్టారు .
మహేష్ మహేష్ అంటూ విశ్వ సర్ – నేవీ ఆఫీసర్స్ కంగారుపడ్డారు .
కత్తి పోటు తగిలింది సర్ – బ్లడ్ చాలా పోతోంది వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లాలి – ఏ క్షణమైనా స్పృహకోల్పోవచ్చు అంటూ కంగారుపడిపోతున్నారు అక్కయ్యలు .

మరుక్షణంలో షిప్ వేగం అందుకుంది , నీకేమీ కాదు మహేష్ చుట్టూ చూడు వీరే కాదు అన్నీ షిప్స్ లోని నీ సిస్టర్స్ అందరి సంతోషాలకు కారణం నువ్వు , ఆఫీసర్స్ గో ఫాస్ట్ – హార్బర్లో అంబులెన్స్ ను సిద్ధం చేయించండి .
Yes yes …….
సర్ …… నేను స్పృహ కోల్పోయేలోపు చెప్పాలి , కొంతమంది పిల్లలకు ఇంజురీస్ అయ్యాయి , అక్కయ్యలు – సిస్టర్స్ ను నేవీ కానీ – సెక్యూరిటీ ఆఫీసర్లు కానీ – మీడియా కానీ ఎవ్వరూ ఇబ్బందిపెట్టకూడదు , హార్బర్ చేరిన వెంటనే వారు వారి వారి ఇళ్లకు చేరుస్తానని మాటివ్వండి , క్యాబ్స్ రెడీగా ఉంటాయి మీరు చెయ్యాల్సినదల్లా సేఫ్ గా పంపించడమే …….
విశ్వ సర్ : ఖచ్చితంగా ఖచ్చితంగా మహేష్ …… , ప్రతీ ఒక్కరూ వారి వారి పేరెంట్స్ చెంతకు చేరేలా చూసుకుంటాను .
థాంక్యూ థాంక్యూ లవ్ యు తమ్ముడూ …… అంటూ సిస్టర్స్ ఆనందిస్తూనే నాకేమీ కాకూడదని ప్రార్థిస్తున్నారు .
అక్కయ్యలూ …… అంటీ వాళ్ళు భయపడిపోతుంటారు .
అక్కయ్యలు : నువ్వు ఆర్డర్ వేసినా – కోప్పడినా నిన్ను వదిలి వెళ్లమంటే వెళ్ళము అంటూ ఒడిలో పడుకోబెట్టుకుని ట్రీట్మెంట్ తోపాటు ముద్దులూ కురిపిస్తున్నారు .
అక్కయ్యలూ …… దేవతల దగ్గరికి , అక్కయ్యలూ ….. దేవతల దగ్గరికి ……
తమ్ముడూ తమ్ముడూ …… కళ్ళు ముయ్యకు ముయ్యకు అంటూ బుగ్గలపై ప్రాణంలా కొడుతున్నారు .
కళ్ళు ఎప్పుడో మూతలుపడిపోయాయి .