( షిప్ హార్బర్ కు చేరుకునేసరికి చీకటిపడింది – ఈ విషయం స్ప్రెడ్ అయినట్లు సెక్యూరిటీ ఆఫీసర్లు మీడియాతోపాటు పెద్ద సంఖ్యలో జనాలు చేరారు , విశ్వ సర్ ….. సాటిలైట్ ద్వారా ముందుగానే సమాచారం ఇచ్చినట్లు పోర్ట్ మొత్తం సెక్యూరిటీ అధికారి – నేవీ అదుపులోకి తీసేసుకున్నారు , పెద్దమ్మ ఆర్రేంజ్ చేసిన వెహికల్స్ – అంబులెన్స్ లు మాత్రం నేరుగా షిప్ దగ్గరకే చేరుకున్నాయి , దూసుకొస్తున్న మీడియాకు అడ్డుకట్టవేసి సిస్టర్స్ అందరినీ సెక్యూరిటీ ఆఫీసర్ల రక్షణలో అన్నీ వెహికల్స్ లలో పంపించి , నాతోపాటు ఇంజురీ అయిన పిల్లలను మాత్రం అంబులెన్స్ లలో హాస్పిటల్ కు తరలించారు , అక్కయ్యలు నలుగురూ నాతోపాటే హాస్పిటల్ కు చెరుకుని ట్రీట్మెంట్ లో హెల్ప్ చేస్తున్నారు .
డాన్ మరియు కిడ్నపర్స్ అందరినీ వేరొక హాస్పిటల్ కు తరలించి హాస్పిటల్ మొత్తాన్నీ తమ గుప్పిటలోకి తీసేసుకున్నారు సెక్యూరిటీ ఆఫీసర్లు .
అందరినీ సేఫ్ గా చేర్చిన విశ్వ సర్ ను వెనక ఉంచి సుపీరియర్ సెక్యూరిటీ ఆఫీసర్లు ….. మీడియాతో మాట్లాడుతున్నారు , ఇక రాజకీయ నాయకులు – మంత్రుల సంగతి సరేసరి ……
నిజం ప్రపంచానికి తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు , నేవీ సిబ్బంది షిప్స్ నుండి సేకరించిన ఆధారాలు – సీసీ ఫుటేజీలో అక్కయ్యల స్థానంలో వొళ్ళంతా కిడ్నపర్స్ బ్లడ్ తో పరాశక్తుల్లా అంటీలు ముగ్గురూ మరియు నా స్థానంలో మేడమ్ ….. అందరినీ రక్షించి సాటిలైట్ ఫోనులో కంట్రోల్ రూమ్ హెల్ప్ కోరినా పట్టించుకోకపోవడం , విశ్వ సర్ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేవీ సహాయంతో తీరానికి చేర్చే విజువల్స్ మరియు అన్నీ షిప్స్ ఇండియన్ ఓషన్ బోర్డర్స్ దాటకుండా అదుపులోకి తీసుకుని వెనక్కు రప్పించడం …… వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా మీడియా మొత్తం విశ్వ సర్ ముందుకు చేరింది .
అన్ని రాష్ట్రాల CMO మరియు సెక్యూరిటీ అధికారి కంట్రోల్స్ నుండి విశ్వ సర్ మరియు నా దేవతలకు అభినందనల వెల్లువలు కురుస్తున్నాయి .
PMO – రాష్ట్రపతి భవన్ నుండి కూడా కాల్స్ వచ్చినట్లు అప్పుడె మీడియాలో బ్రేకింగ్ న్యూస్ వచ్చేస్తున్నాయి .
ఇక చేసేదేమీ లేక పై ఆఫీసర్స్ – కలెక్టర్ – మినిస్టర్స్ ….. విశ్వ సర్ ను అభినందించి proceed అంటూ వెన్ను తట్టారు .
మీడియాతోపాటు హాస్పిటల్ బయట చేరిన వేల మంది జనాలు సెల్యూట్ చేశారు .
విశ్వ సర్ : నాకు కాదు , అందరినీ ప్రాణాలకు తెగించి రక్షించి నన్నూ ఇందులో భాగస్వామ్యం చేసి మొత్తం క్రెడిట్ నాకు మాత్రమే చేరేలా చేసి మౌనంగా వెళ్లిపోయిన ఆదిపరాశక్తి అవతారమైన నలుగురు వీర వనితలకు చెందాలి , వాసంతి గారు – కాంచన గారు – సునీత గారు మరియు govt కాలేజ్ హెడ్ మిస్ట్రెస్ కల్యాణి గారు నలుగురూ భరతమాతలుగా తమ వేలాదిమంది బిడ్డలను కాపాడుకున్నారు వారికి సెల్యూట్ చేద్దాము అంటూ విశ్వ సర్ కూడా సెల్యూట్ చేసి , మన దేశం నుండే కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఇరుగుపొరుగు దేశాలలోని అమ్మాయిలను ఎక్స్పోర్ట్ చేస్తూ పట్టుబడకుండా తిరుగుతున్న ఇంటర్నేషనల్ డాన్ ను మనం పట్టుకోవడం చాలా గొప్ప విషయం , వాడిని పట్టుకోవడంతో అన్నీ దేశాలలో కిడ్నప్స్ ఎక్కడికక్కడ ఆగిపోతాయి అంటూ జరిగినదంతా మీడియాకు వివరించి ICU లో ఉన్న మాదగ్గరకు చేరుకున్నారు , మహేష్ కు ఎలా ఉంది ? .
ట్రీట్మెంట్ జరుగుతోంది సర్ , మేము ఎమోషనల్ అవుతుండటంతో బయటకు పంపించారు .
విశ్వ సర్ : మహేష్ కు ఏమీకాదు ధైర్యంగా ఉండండి , ఈ నలుగురు లేడీ కానిస్టేబుల్స్ మీకు తోడుగా ఉంటారు , సీసీ ఫుటేజీ ద్వారా నిజం బయటకు వచ్చిన తరువాత మీ ఇంటిదగ్గరకు మీడియా – జనాలు తాకిడి ఎక్కువగా ఉంటుంది , నేనే స్వయంగా వెళుతున్నాను .
సౌమ్య అక్కయ్య : మనం ఇక్కడ ఉండటం మీడియా చూసింది ఇంటిదగ్గరకు ఎందుకు వెళతారు అని ఆశ్చర్యపోతున్నారు కదూ , కొద్దిసేపట్లో మీకే తెలుస్తుందిలే అంటూ అంత టెన్షన్ లోనూ నవ్వుకుంది , సర్ మీరైతే తొందరగా వెళ్ళండి ……
విశ్వ సర్ : కానిస్టేబుల్స్ జాగ్రత్త అనిచెప్పి దారిలో మేడమ్ ఇంటికి చేరుకుని వందల సంఖ్యల్లో మేడమ్ ను అభినందించడానికి వచ్చిన జనాలను దాటుకుని లోపలికివెళ్లి ఆశ్చర్యపోతున్న మేడమ్ – బామ్మ గారికి వివరించి అంటీల ఇంటికి చేరుకున్నారు .
అప్పటికే చుట్టుప్రక్కల వీధుల వారితోనే ఇంటి దగ్గర నుండి మొదలుకుని మెయిన్ రోడ్ వరకూ జనాలతో మరియు మీడియా వాహనాలతో నిండిపోయింది .
దేవతల నినాదాలతో – అభినందనలు వెల్లువలతో మారుమ్రోగిపోతోంది .
టీవీలో బ్రేకింగ్ న్యూస్ తోపాటు తామే రక్షించినట్లు సీసీ ఫుటేజీ చూస్తున్న దేవతలకు ఏమిజరుగుతుందో అర్థం కాక – అక్కయ్యలు ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో తెలియక , బయటేమో క్షణక్షణానికీ పెరిగిపోతున్న జనాలను వారి అభినందనలను చూస్తూ షాక్ లో ఉండిపోయారు , అక్కయ్యల మొబైల్స్ రింగ్ అవుతున్నాయి కానీ ఎత్తకపోవడంతో మరింత కంగారుపడుతున్నారు .
ఆ ఏరియా లేడీ కౌన్సిలర్ జనాలందరితోపాటు నినాధాలుచేస్తూ తనకున్న కొద్దిపాటి సెక్యూరిటీతో ఎలాగోలా ఇంట్లోకి చేరుకోగలిగింది , వెళ్లడం వెళ్లడమే దేవతల పాదాల చెంతకు చేరి మన్నించమని వేడుకుంటోంది , వాసంతి – సునీత – కాంచన …… మీకు చాలా అన్యాయం చేసాను , మన ఏరియా కౌన్సిలర్ కు అర్హులు మీరే అని తెలిసి మీరు ఎలాగైనా పోటీలో ఉండకూడదు అని న్యూ ఇయర్ రోజున మీ ముగ్గులను చేరిపి మిమ్మల్నే తన కుటుంబంలా భావించి మీరు తిట్టినా కొట్టినా కోప్పడినా మీ చుట్టూనే తిరుగుతూ మిమ్మల్నే సర్వస్వంలా చూసుకుంటున్న ఆ అబ్బాయి మీద వేసింది నేనే ఆ ఒక్కటే కాదు ఆ అబ్బాయిపై మీరు కోప్పడేలా జనాలకు మీపై నమ్మకం లేకుండా చాలానే చేసాము , క్షమించరాని నేరం చేసాము మన్నించమని అర్హత కూడా మాకు లేదు , ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా అందరితోపాటు నా సర్వస్వం అయిన నా బిడ్డనూ కాపాడారు , రెండు రోజులుగా సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇచ్చి మినిస్టర్స్ చుట్టూ తిరిగినా ఏమీ చేయలేకపోయారు కొంతమంది అయితే బిడ్డపై ఆశను వధులుకోమన్నారు , ఆ బాధ భరించలేనిది , నా బిడ్డను మళ్లీ నా చెంతకు చేర్చారు – రెండు రోజులుగా నిద్రలేకుండా హింస పెట్టారు – డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుని హాయిగా నిద్రపోతోంది , జీవితాంతం మీకు ఋణపడిపోయి ఉంటాను అంటూ వేడుకుంటున్నారు .
దేవతల మనసు బంగారం కదా , వెంటనే లేపి కౌగిలిలోకి తీసుకుని మన్నించేశారు , తప్పు చేసింది నువ్వు కాదు మేము , నేను అమాయకుడిని దేవతలూ అని మొరపెట్టుకున్నా వినిన పాపాన పోలేదు , దూరం పెట్టాము – కోప్పడ్డాము – తిట్టాము – కొట్టాము అయినా దేవతలూ దేవతలూ అంటూ చిరునవ్వులు చిందిస్తూ మా చుట్టూనే తిరుగుతూ మా అవసరాలన్నీ తీరుస్తూ మా సంతోషాలే తన సంతోషాలుగా , మా బిడ్డలను ….. అక్కయ్యలూ అక్కయ్యలూ అంటూ ఆప్యాయతతో మాకంటే ఎక్కువగా కంటికి రెప్పలా ప్రాణంలా చూసుకుంటూ వస్తున్నాడు , క్షమించమని అడిగే అర్హత లేనిది మాకు అంటూ బాధపడుతున్నారు , వెంటనే మహేష్ ను కాదు కాదు పెద్దమ్మ – చెల్లి కల్యాణి పిలుపైన బుజ్జిదేవుడిని కలవాలి .
విశ్వ సర్ పెద్ద ఫోర్స్ తోనూ జనాలమధ్యలో మేడమ్ తోపాటు ఇంటివరకూ చేరుకోవడానికి కష్టపడాల్సివచ్చింది , ఇంటి చుట్టూ సెక్యూరిటీ అధికారి ప్రొటెక్షన్ ఉంచి లోపలికివెళ్లారు .
అక్కయ్యలూ …..
చెల్లీ చెల్లీ చెల్లీ అంటూ కౌగిలిలోకి తీసుకున్నారు , చెల్లీ చెల్లీ చెల్లీ ……
మేడమ్ : మొత్తం విన్నాను అక్కయ్యలూ కాదు కాదు మహేష్ దేవతలూ ……
అంటీలు : చెల్లీ …… మన బుజ్జిదేవుడు ఎక్కడ ఎక్కడ ? .
మేడమ్ : అల్లరి పిల్లాడు అని పిలిస్తేనే ఎక్కువ ఆనందిస్తాడు అక్కయ్యా ……
అంటీలు : ఏదీ ఆ అల్లరి పిల్లాడు .
మేడమ్ : చావుబ్రతుకుల మధ్యన హాస్పిటల్లో ఉన్నాడు అక్కయ్యలూ , తల్లులు ముగ్గురూ హాస్పిటల్లోనే ఉన్నారు .
అంటీలు : హాస్పిటల్ – చావు బ్రతుకులు మధ్యన అంటూ స్పృహకోల్పోయి పడబోతే పట్టుకుని నీళ్లు చల్లారు , చెల్లీ ….. హాస్పిటల్ కు వెళదాము .
నా కారు – డ్రైవర్ ను రెడీ చేస్తాను అంటూ కౌన్సిలర్ బయటకువెళ్ళారు .
మేడమ్ : హాస్పిటల్ కు తీసుకెళ్లాడానికే విశ్వ సర్ వచ్చారు అక్కయ్యలూ ……
అంటీలు : విశ్వ సర్ వైపు చూసి ఆ వెంటనే టీవీ వైపు చూస్తే టీవీలో దేవతల గురించి తమ గురించి గొప్పగా చెబుతున్నది ….. , సర్ …… మీరు ? .
విశ్వ సర్ : వివరించే సమయం లేదు , మహేష్ కడుపులో కత్తి దిగింది , సాయంత్రం నుండీ ఇప్పటివరకూ చాలా రక్తం పోయింది , హాస్పిటల్లో సరిపోయే బ్లడ్ లేదని తమ బ్లడ్ కూడా సరిపోవడం లేదని కావ్య కాల్ చేసింది వెంటనే వెళ్ళాలి .
అంటీలు : సాయంత్రం నుండీ బ్లడ్ …… కన్నీళ్లు ఆగడం లేదు , ఏ బ్లడ్ గ్రూప్ అన్నారు …… మాదీ అదే బ్లడ్ ……
విశ్వ సర్ : అయితే తొందరగా వెళ్ళాలి అంటూ సెక్యూరిటీ ఆఫీసర్లు క్లియర్ చేస్తుండగా , అంటీ వాళ్ళను చూసి హోరెత్తుతున్న జనాల – మీడియా మధ్యన బయటపడి హాస్పిటల్ కు బయలుదేరారు ) .
దేవతల కన్నీళ్లు ఆగడం లేదు .
మేడమ్ : అక్కయ్యలూ …… ఈ కన్నీళ్లు తల్లులతోపాటు మహేష్ కోసమని తెలుసు .
అంటీలు : తల్లులు సేఫ్ వారి గురించి ఇక ఆలోచనలేదు – మనం కొలిచే దేవుళ్ళే కాపాడి ఉంటారు – వారికోసమైతే కాదు – మహేష్ కు ఎలా ఉందో ……
మేడమ్ : ఏమీకాదు అక్కయ్యలూ ….. , అక్కయ్యలూ …… తల్లులను రక్షించినది మన దేవుడే బుజ్జిదేవుడే , మీ అల్లరి కొంటె పిల్లాడే , ప్రాణాలను ఫణంగా పెట్టి తల్లులతోపాటు అందరినీ కాపాడి మనల్ని మరొకసారి దేవతలను చెయ్యాలనుకుంటున్నాడు .
అంటీలు : చెల్లీ చెల్లీ చెల్లీ ……
మేడమ్ : అవును అక్కయ్యలూ అంటూ విశ్వ సర్ చెప్పినదంతా చెప్పారు , మనమంటే అంత ప్రాణం …….
అంటీలు : ప్రాణం కంటే ఎక్కువ అంటూ కన్నీళ్లను కారుస్తున్నారు , దేవతలూ దేవతలూ …… అంటూ దేవతలుగా పూజిస్తుంటే మేము మాత్రం అంటూ లెంపలేసుకుంటున్నారు .
మేడమ్ : అక్కయ్యలూ అక్కయ్యలూ ……
అంటీలు : ఎంత శిక్షించుకున్నా తక్కువే చెల్లీ ……. , మన ప్రాణమైన బుజ్జిజానకి బంధువులంతా దూరంగా ఉన్నారు అత్తయ్యలుగా కాదు కాదు దేవతలుగా వచ్చి స్నానం చేయించి ఆశీర్వదించే అదృష్టాన్ని ప్రసాధించడానికని కోరిక కోరితే మేము మాత్రం అదే అదునుగా శుభకార్యం తరువాత మాతోనూ మరియు తన ప్రాణమైన అక్కయ్యలతో మాట్లాడటమే కాదు కలవనేకూడదు అని ఒట్టు వేయించుకున్నాము , మాకంటే …….
మేడమ్ : అక్కయ్యలూ అలా జరగకుముందే మీ అల్లరి పిల్లాడిని భక్తుడిగా స్వీకరిస్తున్నారు కదా బాధపడకండి అంటూ కన్నీళ్లను తుడిచారు .
అంటీలు : లేదు లేదు లేదు ఎవ్వరూ చెయ్యని తప్పుని చేసేసాము , బుజ్జిజానకి తన హృదయస్పందన అని తెలిసినా బుజ్జితల్లి వెళ్లిపోయిన కోపాన్ని తనపై చూయించి తోసేసాము , కొట్టాము కూడా …….
మేడమ్ : అయ్యో అక్కయ్యలూ …… , బుజ్జిజానకిపై ప్రాణంతో అలా చేశారని మహేష్ కు తెలియదా ఏమిటి ? , ఆ ప్రతీ క్షణాన్నీ సంతోషంగా ఆస్వాదించి ఉంటాడు కాసేపట్లో మీ అల్లరి పిల్లాడి మాటల్లోనే వింటారు , బాధపడకండి మీ కన్నీళ్లు చూస్తే మహేష్ తట్టుకోలేడు .
అంటీలు : మహేష్ కు బుజ్జిజానకి అంటే ఎంత ప్రేమో – బుజ్జిజానకికి మహేష్ అంటే అంతకు మించి ప్రేమ , ఆ స్వచ్ఛమైన ప్రేమను ఒకరికొకరు ఆస్వాదించనియ్యకుండా అడ్డుకట్టవేశాము , మమ్మల్ని బాధపెట్టకూడదు అని పిల్లలైనా ఇద్దరూ మా సంతోషం కోసం దూరంగా ఉండి సంతోషించారు – తెలిసే సమయానికి దూరం పెరిగిపోయింది , బుజ్జితల్లి ఎక్కడ ఉందో కూడా తెలియదు , చెల్లీ …… నువ్వైనా మమ్మల్ని శిక్షించు …….
మేడమ్ : దేవతలను శిక్షిస్తే భక్తుడు తట్టుకోలేడు , విశ్వ సర్ త్వరగా పోనివ్వండి ప్లీజ్ , అక్కయ్యలు …… తమ భక్తుడిని చూడాలి .
విశ్వ సర్ : బ్లడ్ కూడా దొరకలేదట ఇక మీరే ఇవ్వాలి అంటూ ఫాస్ట్ గా పోనిచ్చి హాస్పిటల్ కు చేరుకున్నారు .
రాత్రి 9 గంటలు అవుతున్నా హాస్పిటల్ ముందు ఇసుకేస్తే రాలనంత జనం ……
విశ్వ సర్ : మనం ఇక్కడికే బయలుదేరాము అని ఇంటిదగ్గర మీడియాకు తెలిసిపోయి ఉంటుంది .
వెహికల్లో డ్రైవింగ్ చేస్తున్న విశ్వ సర్ ను చూసి నినాదాలతో హోరెత్తిపోతోంది , స్వచ్చందంగా లోపలికి దారిని వదులుతున్నారు .
విశ్వ సర్ తోపాటు అందరినీ కాపాడిన భరతమాతలూ ఉన్నారు అంటూ దేవతల నినాదాలతో అభిమానం ఎవరెస్టును తాకుతోంది .
థాంక్యూ థాంక్యూ …… మేడమ్స్ , దేవతల్లా కాపాడారు అంటూ చప్పట్లతో లోపలికి వదిలారు .
ఎమర్జెన్సీ ముందు అంటీలు దిగగానే సంతోషపు అభిమానం ఆకాశాన్ని తాకుతోంది .
దేవతలు అవేమీ పట్టించుకోకుండా కన్నీళ్లతో చెల్లీ – సర్ ….. మహేష్ ఎక్కడున్నాడు .
విశ్వ సర్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ల రక్షణలో ICU దగ్గరకు చేరుకున్నారు .
అమ్మలూ – అంటీ అంటూ అక్కయ్యలు కన్నీళ్లతో కౌగిలిలోకి చేరారు , తమ్ముడు తమ్ముడు తమ్ముడు ……. బ్లడ్ బ్లడ్ బ్లడ్ …..
డాక్టర్స్ , నర్సులు మరియు హాస్పిటల్ సిబ్బంది హడావిడిగా కంగారుపడుతూ అటూ ఇటూ తిరుగితుండటం చూసి , డాక్టర్స్ ….. మాది సేమ్ బ్లడ్ ఎంత కావాలంటే అంత తీసుకోండి .
డాక్టర్స్ : బ్లడ్ టెస్ట్ చెయ్యాలి – అంత సమయం లేదు – ఇప్పటికే చాలా సమయం అయ్యింది బ్లడ్ పోయింది , పిల్లాడికి ఏమవుతారు ? .
అంటీలు : మా ప్రాణం – మా సర్వస్వం – మా రక్తం …….
అక్కయ్యలు ఆశ్చర్యపోతున్నారు – అంతటి బాధలోనూ ఆనందబాస్పాలు కలుగుతున్నాయి , అమ్మలూ ….. మీరేనా ? .
మేడమ్ : అవును తల్లులూ …… , ఇక నుండీ మీకంటే మీ తమ్ముడంటేనే ప్రాణం – తనకేమైనా అయితే ఏమిజరుగుతుందో కూడా ఊహించలేము .
డాక్టర్స్ ….. అవసరం పడుతుంది అని మా బ్లడ్ గ్రూప్ పేపర్స్ తీసుకొచ్చాము చూడండి , మేము ముగ్గురం యూనివర్సల్ డోనర్స్ ……
నేనుకూడా అంటూ మేడమ్ …….
డాక్టర్స్ : చెక్ చేసి , ఒక ప్రాణాన్ని కాపాడటానికి దేవతల్లా వచ్చారు అంటూ లోపలికి తీసుకెళ్లారు .
డోర్ ఓపెన్ కాగానే వెంటిలేటర్ పై మరియు కడుపుకు కట్టు కట్టి ఉండటం స్పృహ కోల్పోయి ఉండటం , దగ్గరకు చేరుకుని దేవతలూ – బుజ్జిజానకీ ….. దేవతలూ – బుజ్జిజానకీ ….. కలవరింతలు విని కన్నీరు మున్నీరవుతున్నారు , బుజ్జిహీరో ….. నీ దేవతలం వచ్చాము అంటూ ప్రాణంలా స్పృశిస్తున్నారు .
డాక్టర్స్ : మీరేనన్నమాట , ట్రీట్మెంట్ మొదలైనప్పటి నుండీ కలవరిస్తూనే ఉన్నాడు అంటూ ఇరువైపులా ఉన్న బెడ్స్ పై పడుకోమని చెప్పి బ్లడ్ తీసుకున్నారు .
అక్కయ్యలు : అమ్మలూ – అంటీ ….. మీ కన్నీళ్లను చూస్తే మరింత బాధపడతాడు అంటూ కన్నీళ్లతోనే కన్నీళ్లను తుడిచి నాచుట్టూ కూర్చున్నారు , నా చేతులను స్పృశిస్తూ తమ్ముడూ …… నీ దేవతలు వచ్చారు – నువ్వే ఇకనుండీ వారి ప్రాణం , స్వయంగా బ్లడ్ ఇచ్చి తమ ప్రాణాన్ని కాపాడుకుంటున్నారు అంటూ ప్రాణమైన ముద్దులు కురిపిస్తున్నారు .
ఒకరి తరువాత మరొకరి బ్లడ్ …… నలుగురి బ్లడ్ పూర్తిగా ఎక్కించిన మరుక్షణం ప్రాణం లేచొచ్చినట్లు కదలికను చూసి హార్ట్ బీట్ ను చెక్ చేసి డాక్టర్స్ సంతోషంతో ఔట్ ఆఫ్ డేంజర్ …… స్పీడీ రికవరీ అవుతున్నాడు , మీ బ్లడ్ లో ఏదో మ్యాజిక్ ఉంది మాకే ఆశ్చర్యం వేస్తోంది , ఇక భయపడాల్సిన అవసరమే లేదు .
తమ్ముడి దేవతలు కదా లవ్ యు దేవతలూ అంటూ అక్కయ్యలు నలుగురూ సంతోషంతో నాచేతులపై – బుగ్గలపై ముద్దులుకురిపించారు ప్రార్థించారు , బయట ఉన్న విశ్వ సర్ తో సంతోషాన్ని షేర్ చేసుకున్నారు .
విశ్వ సర్ : ఒకరా ఇద్దరా మీతోపాటు వేలల్లో రక్షిపబడిన ప్రార్థనలు , మహేష్ కు ఆశీర్వాదాలు …… , అంతమందినీ రక్షించినా ఎవ్వరికీ తెలియకుండా చేసేసాడు , రియల్ హీరో మహేష్ ……
అక్కయ్యలు : తెలియకపోవడం ఏమిటి సర్ , బయట జనమంతా వచ్చినది తమ్ముడి కోసమే కదా ……..
విశ్వ సర్ మౌనంగా ఉండిపోయారు , వెళ్లిపోతుంటే ఆపారు .
సౌమ్య అక్కయ్య : కాదే మొద్దులూ …… , సర్ మీరు వెళ్ళండి నేను చూయిస్తాను అంటూ ICU లోపలికి వచ్చి మొబైల్లో న్యూస్ చూయించింది .
తమ ప్లేసులలో చీరలపై రక్తంతో దేవతలు ఉండటం చూసి , నవ్వును కంట్రోల్ చేసుకుంటున్న సౌమ్య అక్కయ్యకు మొట్టికాయలువేశారు , నా బెడ్ చుట్టూ చేరి ప్రాణంలా చూసుకుంటున్న దేవతల దగ్గరకు చేరుకుని కోపాలతో చూస్తున్నారు .
అంటీలు – మేడమ్ : తల్లులూ …… మీ తమ్ముడిని వదిలి ఉండలేము కోప్పడకండి అలా దూరంగా కూర్చోండి .
సౌమ్య అక్కయ్య : నవ్వుకుంది , కోపం అందుకుకాదు అమ్మలూ అంటూ న్యూస్ చూయించింది .
నవ్వు వస్తున్నా పట్టించుకోకుండా నా చేతులను ప్రాణంలా స్పృశిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు , వెళ్ళండి అంటూ చేతులతో సైగలుచేశారు .
అక్కయ్యలు : వెళతాము వెళతాము , తమ్ముడికి కాదు కాదు మీ భక్తుడికి దేవతలంటేనే ఎక్కువ ప్రాణం అంటూ బుంగమూతులతోనే నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
