థర్డ్ MISSION 12 41

జడ్జి మేడమ్ : కళ్యాణి – సునీత …. నేను వెళ్ళాలి , ఉదయానికల్లా అమరావతి హైకోర్టు లో ఉండాలి , మహేష్ మన బుజ్జిదేవుడు జాగ్రత్త , Sorry మహేష్ ….. రాత్రంతా ఇక్కడే ఉండాలని ఉంది కానీ వాడికి మన గడ్డ మీదనే శిక్ష పడాలి , సఫర్ ఆయన అమ్మాయిలందరూ సంతోషించాలి , వాసంతీ …..
అంటీలు : ప్రతీసారీ అడిగితే దెబ్బలుపడతాయి , sorry sorry ….
జడ్జి మేడమ్ నవ్వేసింది , త్వరగా కోలుకో అంటూ నుదుటిపై ముద్దుపెట్టి లేచి అంటీలను కౌగిలించుకొన్నారు , తల్లీ సౌమ్యా ….. ఈ అమ్మ చెప్పినా హాస్టల్ కు వెళ్లవని తెలుసులే నీఇష్టం , నలుగురు అమ్మలు – నీ డార్లింగ్స్ మరియు మన బుజ్డిదేవుడు ఉండగా భయమేల అంటూ నావైపు చూస్తూనే బయటకునడిచారు , మహేష్ దేవతలూ …. మీరెక్కడికి ఆగండి .
అక్కయ్యలు బయటవరకూ వచ్చారు , జడ్జి గారిని ఎయిర్పోర్ట్ వరకూ వదలడానికి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి ఉండటంతో జాగ్రత్త అనిచెప్పి పంపించారు , లోపలికి వచ్చిచూస్తే దేవతలు నలుగురూ బెడ్ చుట్టూ నేలపై కూర్చుని నన్ను ప్రాణంలా స్పృశిస్తూ బెడ్ పై వాలి ఉండటం చూసి అక్కయ్యలు చప్పుడు చెయ్యకుండా సోఫాలోకిచేరి కొద్దిసేపటికే ఒకరి భుజాలపై మరొకరు నిద్రలోకి జారుకున్నారు .
కొద్దిసేపటికి దేవతలూ ….. నిద్రలోకిజారుకున్నారు .
దేవతల ముద్దులకు – వెచ్చనైన స్పర్శాలకు హాయిగా నిద్రపోతున్న నాపెదాలపై పెద్దమ్మ ముద్దు ….. తియ్యదనంతో కళ్ళుతెరిచిచూస్తే చుట్టూ అలసిపోయి నిద్రపోతున్న దేవతలు , ఓహో ఇందుకు లేపారా పెద్దమ్మా అంటూ దేవతల బుగ్గలపై తాకీతాకనట్లుగా చేతులతో ముద్దులుకురిపించాను , చలిగా ఉండటంతో చప్పుడు చెయ్యకుండా లేచి దేవతలతోపాటు అక్కయ్యలకూ దుప్పట్లు కప్పాను .
వెచ్చగా మూలుగుతూ నిద్రపోవడం చూసి ఆనందించి , బెడ్ పై మధ్యలోకిచేరి దేవతలను తనివితీరా చూసుకుంటున్నాను .
************

దేవతలను ప్రేమతో చూస్తుండగానే తెల్లారిపోయింది – ప్చ్ ప్చ్ ….. రాత్రంతా చూసుకున్నా తనివితీరలేదు అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుకురిపించాను . ఈ కత్తిపోటు అక్కయ్యలను – దేవతలనూ బాధపెట్టింది అంటూ కోప్పడ్డాను , ఇలాకాదు అంటూ దేవతల బుగ్గలపై మళ్లీ ముద్దులుపెట్టి ఏకంగా టాప్ మీదకు వెళ్లి వ్యాయామం చేస్తున్నాను .

పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా పెద్దమ్మా ….. అంటూ కలవరిస్తూ బెడ్ చుట్టూ దేవతలు మేల్కొన్నారు , Sorry లవ్ యు లవ్ యు మహేష్ ….. తప్పునంతా నీమీదకే తోసి శిక్షించాము , మహేష్ మహేష్ ….. ఎక్కడ ? ఎక్కడ ? అంటూ చుట్టూ చూస్తూ లేచారు .
ఆ అలికిడికి అక్కయ్యలూ లేచారు , దుప్పటి కప్పినందుకు వెచ్చగా నిద్రపోయాము అమ్మలూ లవ్ యు …..
దేవతలు : మేము కప్పలేదు తల్లులూ – మాకు మీరే కప్పారేమో అనుకున్నాము అంటూ కంగారు కంగారు .
అక్కయ్యలు : అమ్మలూ – అంటీ ఏమైంది ? , ఇంతకూ తమ్ముడు ఎక్కడ ? , ఈ కంగారు తమ్ముడి కోసమేనా ? .
మూడు ఫ్లోర్లూ వెతికినా కనిపించకపోయేసరికి దేవతల కళ్ళల్లో చెమ్మ ….
అక్కయ్యలు : అయ్యో అమ్మలూ – అంటీ ….. మీరే తన సర్వస్వం , మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లి ఉండడు .
దేవతలు : ఆదికాదు తల్లులూ ….. , బుజ్జిజానకి విషయంలో కోప్పడ్డామని బుజ్జిజానకి కోసం …..
అక్కయ్యలు : అది నిన్నటి వరకూ అమ్మలూ ….. , తన దేవతల ప్రాణమైన వాళ్ళల్లో తమ్ముడూ ఒకడని తెలిసాక చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళడు గాక వెళ్ళడు మాకు తెలుసు , ఇక్కడే ఎక్కడో ….. అమ్మలూ గుడిసెలోకి వెళ్ళాడేమో …..
అంతే కిందకుదిగి గేట్ తీసుకుని గుడిసెవైపుకు నడిచారు .

ఆ సౌండ్ కు పైనుండి చూసాను – ఆయ్ దేవతలు ….. అంటూ ఆసక్తితో చూస్తుండిపోయాను .
గేట్ చప్పుడుకు అలసిపోయి వెహికల్లో నిద్రపోయిన విశ్వ సర్ తోపాటు రోడ్డుకు ఇరువైపులా విశ్రమిస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్లు అలెర్ట్ అయ్యారు .
విశ్వ సర్ : మేడమ్స్ …..
అక్కయ్యలు : సర్ ….. తమ్ముడు కనిపించడం లేదు , మూడు ఇళ్లల్లో ఎక్కడా లేడు .
విశ్వ సర్ : Sorry నిద్రపట్టేసింది – ఇంకెప్పుడూ అలా జరగదు అంటూ సెక్యూరిటీ ఆఫీసర్లను అప్రమత్తం చేశారు స్వయంగా వెతుకుతున్నారు .
ఆక్ …… గుడిసె వైపుకు వెళుతుండటం చూసి సంతోషంతో ఆగిపోయాను , వెళ్ళండి వెళ్లండి దేవతలూ ….. , దేవలోకంలాంటి మహాద్భుతం మీ రాకకై ఎదురుచూస్తోంది – ఇన్నాళ్లకు కలిగింది అదృష్టం అంటూ ఆశతో – ఆనందంతో చూస్తున్నాను.

తలుపుపై ” దేవతలకు మాత్రమే ప్రవేశం ” అని ఎప్పుడో మొదటిరోజున రాసినది చూసి అక్కయ్యలను అక్కడితో ఆపేశారు .
అక్కయ్యలు : తమ్ముడూ ….. ఇలానే ఆపాడు ఎన్నోసార్లు ఇడియట్ అంటూ తోసుకుంటూ ముందుకువెళ్లారు .
దేవతలు వెనక్కు తోసేయ్యడం చూసి ముచ్చటవేసింది , ఇడియట్ అంటే దెబ్బలుపడతాయి అంటూ మొట్టికాయలువేశారు .
దేవతలు : సెకండ్ ఫ్లోర్ బాత్రూమ్లో చూసినట్లు లేము వెళ్లి చూడండి వెళ్ళండి వెళ్ళండి , మా బుజ్జిదేవుడు ఖచ్చితంగా ఇక్కడే ఉంటాడు అంటూనే కళ్ళల్లో చెమ్మ …..
అక్కయ్యలు : అయ్యో అమ్మలూ ….. మనం నిద్రలేచేలోపు బట్టలతోపాటు కావాల్సినవన్నీ తీసుకురావడానికి వచ్చి ఉంటాడు అంతే , మీ భక్తుడికి దేవతల నిలయంలో ఉండటమే ఇష్టం – అన్నీ వస్తువులతో మీకెదురు వచ్చేస్తుంటాడు చూడండి అంటూ చెమ్మను తుడిచారు .
దేవతల పెదాలపై నవ్వులు – కళ్ళల్లో సంతోషం , మీరు వెళ్ళండి అంటూ తోసేసి లోపలికి అడుగుపెట్టి తలుపులు వేసేసుకున్నారు ఎక్కడ అక్కయ్యలు వచ్చేస్తారేమోనని …… , నలుగురు దేవతలూ ముసిముసినవ్వులతో తిరిగి Wooooooow బ్యూటిఫుల్ …… అంటూ సంభ్రమాశ్చర్యాలతో అద్భుతమైన సరికొత్త లోకాన్ని చూస్తున్నట్లు వెలిగిపోతున్న కళ్ళతో నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయారు .

అక్కయ్యలు : లోపలికి దూరబోయి తలుపులు మూసుకోవడంతో ఆగిపోయారు , తమ్ముడితోపాటు వస్తారుకదా మీ అందరి సంగతీ తేలుస్తాం అంటూ నిరాశతో వెనుతిరిగారు .
సౌమ్య సిస్టర్ : అమ్మావాళ్లు పైన బాత్రూమ్లో చూడమన్నారు కదే .
అక్కయ్యలు : ఒసేయ్ లోపలే ఉన్నాడు లేకపోతే ఈపాటికి వచ్చేసేవాళ్ళు , తమ్ముడిని లోపల రేప్ చేసినా చేసే…స్తుంటా…..రు …..
” అక్కయ్యలూ ” అంటూ పైనుండి పిలిచాను .
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ ….. పైనున్నావా ? , అమ్మలూ …..
ష్ ష్ ష్ ….. నో .
అక్కయ్యలు : Ok , విశ్వ సర్ కంగారుపడకండి పైనే ఉన్నాడు అనిచెప్పి పరుగున పైకివచ్చారు , తమ్ముడూ తమ్ముడూ ……
నో నో నో అక్కడే ఆగిపోండి మీ సంతోషాలలో గాయాన్ని నొక్కేసినా నొక్కేస్తారు .
అక్కయ్యలు : లేదు లేదు లేదు అంటూ చేతులతో ముద్దులు కురిపిస్తున్నారు .
చాలు చాలు …..
అక్కయ్యలు : ఇక్కడేమి చేస్తున్నావు తమ్ముడూ …..
ఇడియట్ అని తిట్టొచ్చు …..
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు లవ్ యు వినిపించిందన్నమాట అంటూ గుంజీలు తీస్తున్నారు .
ఆపండి అక్కయ్యలూ ….. , ఎంత ముద్ …. ఇష్టంతో పిలిచారు , అలానే పిలవచ్చుకదా ప్లీజ్ ప్లీజ్ .
అక్కయ్యలు : ఒకసారి పిలిచినందుకు బొప్పి కట్టేలా నీ దేవతల దెబ్బలు చూసే ఉంటావుగా , నవ్వుకో నవ్వుకో …..
లేదులేదులే అంటూనే నవ్వేస్తున్నాను , ఇక్కడేమి చేస్తున్నానంటే నిన్న సాయంత్రం నుండీ బెడ్ మీదనే ఉన్నానుకదా వొళ్ళంతా కుచించుకుపోయినట్లు uneasy గా ఉంటేనూ వచ్చి స్ట్రెచ్ చేస్తున్నాను , పైగా విశ్వ సర్ నిన్న చెప్పినట్లు ఇంటర్నేషనల్ గా ఎనిమీస్ రెడీ అవ్వవచ్చు – దేవతలకు సెక్యూరిటీగా ఉండాలంటే ఈమాత్రమైనా కండలు పెంచకపోతే ఎలా అంటూ స్టిల్ ఇచ్చాను .
అక్కయ్యలు : అమ్మో అంటూ ఆశ్చర్యపోతున్నారు .

దీనికే ఇలా ఆశ్చర్యపోతే రోడ్డుకు ఇటూ అటూ చూస్తే ఏమవుతారో ……
స్ట్రీట్ ఎండింగ్స్ లో జనసాగరం – వీధి అంతా కాదు కాదు ముందూ వెనుకా అటూ ఇటూ పోలుసులే ….. , మనకోసమేనా ? తమ్ముడూ …..
చిన్నగా మొట్టికాయలువేసి దేవతలకోసం అన్నాను .
అక్కయ్యలు : Sorry sorry ….. అయినా మాకంత అదృష్టం కూడానా ? అంటూ ఆనందిస్తున్నారు , ఇంతకూ గుడిసెలోకి వెళ్లిన నీ దేవతలకు నువ్వు లేవని తెలిసికూడా ఇంతసేపు ఏమి చేస్తున్నారు ? .
సర్ప్రైజ్ …..
అక్కయ్యలు : ఉండే ఉంటుంది , అంతలేనిది ” దేవతలకు మాత్రమే ప్రవేశం ” అని రాయవు కదా ఇడియట్ అంటూ కొట్టబోయి లవ్ యు లవ్ యు అంటూ బుగ్గలపై చేతులతో ముద్దుపెట్టారు , అదిగో వచ్చారు – అదేంటి ఏదో అద్భుతాన్ని వీక్షించినట్లు షాక్ ఉన్నట్లు రియాక్షన్స్ , అమ్మలూ అమ్మలూ …..
దేవతలు పైకిచూసారు , మహేష్ మహేష్ ….. అంటూ అక్కయ్యలకంటే వేగంగా పైకివచ్చి నన్ను నలువైపులా చుట్టేశారు , ఎంత కంగారుపడిపోయామో తెలుసా అంటూ ప్రాణంలా స్పృశిస్తున్నారు .
నా దేవతలను బాధపెట్టేలా నేనెక్కడికి వెళతాను , ఇకనుండీ దేవతల నిలయమే నా నిలయం , మీరుతోసేసినా ….
దేవతలు : లేదు లేదు లేదు లేదు అంటూ నలుగురూ చేతులతో నోటిని మూసేసారు .
ముద్దులుపెట్టకుండా ఉండలేకపోయాను .
దేవతలు : అందమైన నవ్వులతో ప్రాణంలా హత్తుకుని సిగ్గుపడుతున్నారు .
మ్మ్ అఅహ్హ్ ….. యాహూ యాహూ ….. ఈ క్షణం కోసమే కదా దేవతల ఈ ప్రేమకోసమే కదా ……
దేవతలు : క్షమించు క్షమించు మహేష్ …..
కళ్ళల్లో చెమ్మ చేరింది , క్షమించమని కోరాల్సినది కేవలం నాలాంటి భక్తులు మాత్రమే , ఇంకెప్పుడూ ఆ మాట నా దేవతల నోటి నుండి రాకూడదు , నేను తట్టుకోలేను .
దేవతలు : లేదు లేదు లేదు మహేష్ ….. నీకళ్ళల్లో చెమ్మ చూస్తే మా కళ్ళల్లోనూ వచ్చేస్తాయి , నిన్న బాధపెట్టేలా ఏమీ చెయ్యము .
భక్తుడిని దేవతలు కాక ఇంకెవరు ఇబ్బందులకు గురిచేస్తారు , కౌగిలింతలో ఘాడత తగ్గింది .
లేదు లేదు లేదు అంటూ మరింత గట్టిగా చుట్టేశారు .
యాహూ యాహూ ……

అక్కయ్యలు ఈర్ష్య అసూయలతో కోపంతో చూస్తున్నారు – కారణం గుర్తొచ్చి నవ్వుకున్నాను , కౌగిలించుకోబోతే నొప్పి అని ఆపాను , అక్కయ్యలను మరింత ఉడికించాలన్నట్లు …. అంటీలూ – మేడమ్ ……
దేవతలు : బుజ్జిజానకి పిలిచినట్లుగా అత్తయ్యలూ అని పలికితే నీ దేవతలు మరింత హ్యాపీ …..
అత్ … అత్తయ్యలూ అంటూ హృదయం నుండి పలికాను , నాతోపాటు దేవతల కళ్ళల్లోనూ ఆనందబాస్పాలు , యాహూ యాహూ ….. ఇంత హ్యాపీనెస్ , లవ్ యు లవ్ యు సో మచ్ పెద్దమ్మా – పెద్దమ్మ ముగ్గు చేరిపెయ్యడం వలన పొందిన దేవతల కోపాగ్ని రోజునే చెప్పింది – ఎంత కోపానికి అంత పేమ అని , ఈరోజుకు నిజమైంది .

దేవతలు మురిసిపోతున్నారు , పెద్దమ్మ అంటే గుర్తుకువచ్చింది మహేష్ ….. , పెద్దమ్మ కలలో కనిపించి మా నలుగురికీ చెప్పారు ….. ” బుజ్జిజానకి అదృశ్యంలో మనందరి హస్తం ఉందని – విధి రాసిన బ్రహ్మ రాత అని ” నువ్వు ఇందాక అన్నట్లుగా బుజ్జిజానకి ఎంతకాలం ఎంత దూరమైతే కలిసాక అంతకు రెట్టింపు దగ్గరవుతాము అని సంతోషాలు వెళ్లువిరిస్తాయి అని , మినిస్టర్స్ వాస్తారుకదా వారితో బుజ్జిజానకి జాడ తెలుసుకుందాము అనుకున్నాము కానీ పెద్దమ్మ మాటలను గౌరవించి ఆ క్షణం కోసం ఆశతో రోజురోజుకూ రెట్టింపయ్యే ప్రేమతో ఎదురుచూద్దాము అంటూ ఉద్వేగానికి లోనయ్యారు .
దేవతలు ఎలా అంటే అలా …..

అక్కయ్యలు : వద్దు అన్నా వినకుండా పాపం తమ్ముడి చెంపలు వాయించారు దానికేం చేద్దాము అంటూ నావైపుకు కన్నుకొట్టారు .
ఆక్ ….. అంటూ ఆగిపోయాను , అత్తయ్యలూ ….. క్షమించమని కోరారో నాతోపాటు బుజ్జిజానకి కూడా బాధపడుతుంది .
దేవతలు : లేదు లేదు , ఈ బుగ్గలపైనే కదా కొట్టినది అంటూ బుగ్గలపై ముద్దులవర్షం ……
అక్కయ్యలు : అమ్మలూ – అంటీ ….. ఒక్కసారిగా అన్ని ముద్దులా పడిపోతున్నాడు పట్టుకోండి పట్టుకోండి , ముద్దులతోనే తమ్ముడిని ఏమో చేసేలా ఉన్నారే జరగండి అంటూ జాగ్రత్తగా పట్టుకున్నారు .
దేవతల సంతోషం ……