సిస్టర్స్ – బ్రదర్స్ …… నాకొక సహాయం చేస్తారా ? .
” నీకోసం ఏమైనా చేస్తాము తమ్ముడూ – అన్నయ్యా …… , మళ్లీ అమ్మా నాన్నలను కలవబోతున్నాము అంటే నీవల్లనే , నువ్వు మా దేవుడితో సమానం , ఏమిటో ఆర్డర్ వెయ్యి ……. ”
నా స్వార్థం కోసం అడుగుతున్నాను , మిమ్మల్ని రక్షించినది ఎవరు ? .
” నువ్వే నువ్వే నువ్వే అంటూ ఆప్యాయంగా హత్తుకున్నారు . ”
కాదు నా దేవతలు …… , నలుగురు దేవతలు వాసంతి అంటీ – కాంచన అంటీ – సునీత అంటీ – మేడమ్ కల్యాణి అని ప్రపంచానికి చెప్పాలి …… మామధ్యన ఉన్న దూరాన్ని – గోడలను మీరే బద్దలు కొట్టేలా సహాయం చెయ్యాలి .
” Ok ok అత్తయ్యలు – అల్లుడికి మధ్యన డిష్యుం డిష్యుం అన్నమాట అంటూ నవ్వుకుంటున్నారు ” .
అవును పచ్చగడ్డి వేసినా భగ్గుమనేంతలా …… , కానీ దేవతల మనసు – మంచితనం …….
” దేవతలు అన్నావుకదా దేవతల మనసు మాకు తెలియనిధికాదులే , మాకూ అమ్మా – అత్తయ్యలు దేవతలే కదా , మేము చూసుకుంటాము …… ”
థాంక్యూ సిస్టర్స్ – బ్రదర్స్ ……. , మీవలన దేవతల కోపం శాంతిస్తే అంతకంటే సంతోషం మరొకటి లేదు మీ తమ్ముడికి ……
” మా తమ్ముడి రుణం తీర్చుకునే అదృష్టం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు , 1% రుణం 1% రుణం ……. మాత్రమే ”
మీవలన అంటీ వాళ్లకు దగ్గరయితే 1% కాదు 200% రుణం అంటే నేనే మీ అందరికీ ఋణపడిపోతాను , ఊహిస్తేనే తెగ సంతోషం వేస్తోంది థాంక్యూ థాంక్యూ సిస్టర్స్ అంటూ మురిసిపోతున్నాను .
తమ్ముడూ తమ్ముడూ ……
ష్ ష్ ష్ సిస్టర్స్ , అక్కయ్యలకు తెలియకూడదు .
Ok ok తమ్ముడూఅంటూ సిస్టర్స్ దారిని వదలడంతో అక్కయ్యలు ముగ్గురూ వచ్చి అల్లుకుపోయారు .
స్స్స్ ……
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు లవ్ యు వెంటనే హాస్పిటల్ కు వెళ్ళాలి , బ్లడ్ వస్తూనే ఉంది అంటూ ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు కన్నీళ్లతో ……
అక్కయ్యలూ …… మిమ్మల్ని రక్షించుకున్నాను , లేదు లేదు మీరే ఆదిపరాశక్తి అవతారాల్లా నన్ను రక్షించుకున్నారు , నొప్పిలేదులే బాధపడకండి , నా చుట్టూ నేనే ప్రాణమైన ముగ్గురు అక్కయ్యలు ఉండగా నాకేమవుతుంది .
” నలుగురు తమ్ముడూ అంటూ అక్కయ్యలతోపాటు కన్నీళ్లు కారుస్తూ ఏమీకాదులే అని నా బుగ్గపై చేతితో ముద్దుపెట్టి ఫస్ట్ ఎయిడ్ లో హెల్ప్ చేస్తోంది అక్కయ్యల ఫ్రెండ్ …… ”
నలుగురు కాబోయే బెస్ట్ డాక్టర్స్ ……
అక్కయ్యలు : ఫస్ట్ ఎయిడ్ ok కానీ గంటలో హాస్పిటల్ కు వెళ్ళాలి , కుట్లు వెయ్యాలి , బ్లడ్ ఎక్కించాలి …….
అక్కయ్యలూ అక్కయ్యలూ …… ముందైతే ఈ కన్నీళ్లను ఆపండి అంటూ నొప్పిని భరిస్తూనే తుడిచాను , షిప్ లోని వారందరినీ సేవ్ చేసేసారన్నమాట .
అక్కయ్యలు : నువ్వుండగా మాకేం భయం , షిప్ మొత్తం రౌండ్ వేసేసాము , ఇదిగో ఈ పిల్లలను మరీ కింద డార్క్ రూమ్స్ లో చైన్స్ తో బంధించారు .
” గట్టిగా ఏడుస్తున్నారు – కేకలు వేస్తున్నారని కొట్టి మరీ కిందకు లాక్కెళ్లారు తమ్ముడూ …… అంటూ బాధతో చెప్పారు సిస్టర్స్ ”
లవ్ యు అక్కయ్యలూ …….
అక్కయ్యలు : లవ్ యు లు తరువాత ముందు తీరానికి చేరుకోవాలి , మెమొచ్చేముందు అందరికీ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ తెగ మురిసిపోతున్నావు చాలా ముచ్చట వేసింది , ఎందుకో మేమూ తెలుసుకోవచ్చా ? .
సిస్టర్స్ : దేవ ……
ష్ ష్ ష్ ……
సిస్టర్స్ : Sorry sorry తమ్ముడూ అంటూ సైలెంట్ అయిపోయారు .
అక్కయ్యలు : తమ్ముడూ తమ్ముడూ అంటూ కొడుతున్నారు ముచ్చటైన కోపాలతో ……. , మొదటిరోజు నుండీ ఇంతే మాదగ్గరే దాస్తావు …… అంటూ అలిగారు .
మా అక్కయ్యలకు తెలిస్తే ఇక అంతే , మూకుమ్మడి దాడి చేసేస్తారు అంటూ నవ్వుకున్నాను .
అక్కయ్యలు : ప్రతీసారీ ఇలాంటి నవ్వే …..
స్స్స్ స్స్స్ అక్కయ్యలూ నొప్పి నొప్పి తొందరగా హాస్పిటల్ కు తీసుకెళ్లండి .
అంతే అక్కయ్యలకు మొట్టికాయలు వేసింది అక్కయ్య ఫ్రెండ్ …… , ట్రీట్మెంట్ తరువాత మీఇష్టం .
థాంక్యూ అక్కయ్యా ……
అంతే అక్కయ్య ఫ్రెండ్ బుంగమూతి …….
అక్కయ్యలు : కోపం వచ్చిందా ? మాకూ అంతే అంటూ నవ్వుకున్నారు .
కోపమా ? కోపం తెప్పించానా ? Sorry sorry సిస్టర్ ……
సిస్టర్ కాదు అక్కయ్య అంటూ కోపం …….
అక్కయ్యలు : మాకు లవ్ యు చెప్పి దీనికి థాంక్యూ & sorry చెప్పావుకదా అందుకే కోపం ……
అయితే మాకూ కోపం అంటూ సిస్టర్స్ అందరూ నవ్వులు ……
సరిపోయింది , అందరినీ ఆప్యాయంగా అక్కయ్యా అనే పిలవాలన్నమాట , సరే మీ ఇష్టమే నా ఇష్టం అక్కయ్యలూ …….
లవ్ యు తమ్ముడూ లవ్ యు లవ్ యు ……. అంటూ సంతోషాలు వెల్లివిరిసాయి .
వాగ్దేవి అక్కయ్య : కావ్య – స్వాతి – సౌమ్య …… ఎంత కట్టు కట్టినా బ్లడ్ ఆగడం లేదు అంటూ కంగారుపడుతోంది .
అక్కయ్యలు – సిస్టర్స్ బాధపడేలోపు , కమాన్ కమాన్ అక్కయ్యలూ …… షిప్ కంట్రోల్ రూమ్ నుండి పోర్ట్ లోని వారిని ఎలా కాంటాక్ట్ చెయ్యాలో చూడండి దానితోపాటు అంతకంటే ముఖ్యమైనది వైజాగ్ నుండే కాదు తీరం వెంబడి ఉన్న అన్నీ ప్రధాన నగరాల నుండి కూడా మీలానే సిస్టర్స్ తో షిప్స్ బయలుదేరాయి వాటి లొకేషన్స్ కనిపెట్టడం ద్వారా అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చి అందరినీ మనమే కాపాడాలి , ఇదే మెయిన్ షిప్ కావడం – ఇందులోనే ఈ డాన్ గాడు ఉండటం వలన షిప్ మెయిన్ రూమ్స్ లలో సమాచారం ఉండే ఉంటుంది , షిప్ మొత్తం వెతికి అయినా కనిపెట్టాలి ఫాస్ట్ ఫాస్ట్ ……
ఇందుకు కాదూ తమ్ముడూ నిన్ను మా దేవుడితో పోల్చినది అంటూ అక్కయ్యలు ….. బుగ్గలపై – సిస్టర్స్ ….. చేతులతో ముద్దులుపెట్టి వెళ్లారు .
ఏంటి తమ్ముడూ అంత కంగారుపడుతున్నావు , మనం సేఫ్ గా చేరుకుంటాము పెద్దమ్మను తలుచుకో అన్నారు అక్కయ్యలు …….
చీకటి పడేలోపు – దేవతలకు ఈ విషయం తెలిసేలోపు కంగారుపడేలోపు …… నా అక్కయ్యలను దేవతల ఒడిలోకి చేర్చాలి .
తెలిసేలోపు ఏంటి తమ్ముడూ …… అమ్మావాళ్లకు తెలుసుగా అంది వాగ్దేవి అక్కయ్య .
తెలుసా ? తెలుసా ? .
వాగ్దేవి అక్కయ్య : తెలియడమే కాదు తమ్ముడూ , మేమిద్దరూ కిడ్నప్ అవ్వడం వీడియో కాల్ లో చూశారుకూడా , కావ్య – స్వాతి వీడియో కాల్లో ఎంతకూ కనిపించకపోవడంతో నీ దేవతలకు డౌట్ వచ్చి ముగ్గురూ కనిపించండి అని ఆర్డర్ వేశారు , దొరికిపోయాం అనుకుని వెంటనే క్యాబ్ లో చెల్లి ఇంటికి బయలుదేరాము ……..
ఇక తదుపరి జరిగినది మేము చెబుతాము , క్యాబ్ మిర్రర్స్ పూర్తిగా క్లోజ్ అయ్యి గ్యాస్ విడుదల అవ్వడంతో మత్తులోకి వెళ్లిపోయారు మళ్లీ షిప్ లో మెలకువవచ్చినది మాలానే అంటూ నవ్వుకున్నారు స్వాతి – కావ్య అక్కయ్యలు …….. , అందుకేనా అమ్మలు పదే పదే కాల్ చేశారు మేము లిఫ్ట్ చెయ్యలేదు .
అక్కయ్యలిద్దరికీ మొట్టికాయలువేశాను .
సౌమ్య అక్కయ్య : అచ్చు చూసినట్లే …… ok ok మీరుకూడా ఇలాగే మేల్కొన్నారన్నమాట , మన అదృష్టం వలన తమ్ముడు దేవుడితోపాటే వచ్చి కాపాడారు .
