( నిజం చెప్పారు మేడమ్స్ .
జడ్జి గారు : బిడ్డలకు కష్టమొస్తే అమ్మలు అమ్మవారి అవతారం ఎత్తేస్తారన్నది నిజం .
అంతా చక్కబడ్డాక కలుద్దాము మీరు రెస్ట్ తీసుకోండి , హోమ్ మినిస్టర్ గారూ ….. తెల్లారేసరికి విశ్వ హైయెస్ట్ పొజిషన్ లో ఉండాలి.
HM : Yes సర్ ….. , రేపే డీజీపీ గా నియమిద్దాము , డీజీపీ నీకిష్టమే కదా అంటూ ప్రక్కనే ఉన్నవారిని అడిగారు .
విశ్వ సర్ : నో నో నో సర్ నా స్థాయికి మించినది , మన డీజీపీ సర్ ఆ స్థాయికి అర్హులు – వారి నిజాయితీ మీకు తెలియంది కాదు ,వారి హయాంలోనే లంచం లేకుండానే నేను సెక్యూరిటీ అధికారి కాగలిగాను , వారి కింద పనిచెయ్యడాన్నే ఇష్టపడతాను అంటూ డీజీపీ కు సెల్యూట్ చేశారు .
డీజీపీ సర్ : కౌగిలించుకోకుండా ఉండలేకపోయారు , విశ్వ థాంక్యూ సో మచ్ .
HM : నిన్ను పైస్థాయిలో చూడాలని CM సర్ కోరుకుంటున్నారు , నీలా నిజాయితీ – ధైర్యంగా డ్యూటీ చేసే వ్యక్తిత్వాన్ని సెక్యూరిటీ ఆఫీసర్లంతా ఆదర్శంగా తీసుకోవాలి అంటే పై స్థాయిలో ఉండాల్సిందే .
విశ్వ సర్ : సంతోషం సర్ ఒక సెక్యూరిటీ అధికారి గా ఆ స్థాయిని ఎవరు కోరుకోరు చెప్పండి , నిజం చెప్పాలి అంటే నాకు వైజాగ్ వదిలి వెళ్లాలని లేదు పైగా వీరికి అంతర్జాతీయంగా శత్రువులు పెరుగుతారు వీరికి సెక్యూరిటీగా ఉండటం నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది ) .
తమ్ముడూ ….. నువ్వు చెప్పినట్లు విశ్వ సర్ చాలా మంచివారు అన్నారు అక్కయ్యలు .
కాలేజ్లో గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడంలో – స్టేషన్ లో అంకుల్స్ విషయంలో సహాయం చేశారు .
అక్కయ్యలు : కాలేజ్లో మేడమ్ దేవతకు – నాన్నలను విడిపించి అమ్మ దేవతలు బాధపడకుండా చేసినందకే అన్నమాట విశ్వ సర్ ను టాప్ లో ఉంచేశావు , నువ్వేమిచేసినా దేవతలను దృష్టిలో ఉంచుకునే చేస్తావని మాకు తెలుసులే …..
మురిసిపోయేలా చేసి ముద్దులుపెట్టాలనుకుంటే కుదరదు .
అక్కయ్యలు : ముచ్చటైన కోపాలతో చూస్తున్నారు .
నవ్వొచ్చేసింది .
( HM : అలా చెప్పు మరి , వైజాగ్ వదిలి రావడం ఇష్టం లేదు అంతేగా , డీజీపీ …. వైజాగ్ సిటీ కమిషనర్ గా …..
డీజీపీ : అలాగే సర్ …..
HM : ఇప్పుడున్న కమిషనర్ ను పీకేశావా లేదా ….. , సముద్రం మధ్యలో చిక్కుకున్నాము ఒడ్డుకు మార్గం ఆడిగితేనే పట్టించుకోలేదు .
డీజీపీ : ట్రాన్స్ఫర్ చేసేసాను సర్ …
HM : విశ్వ అండర్ లో వైజాగ్ మరింత సేఫ్ .
విశ్వ సర్ : CM HM డీజీపీ గారికి థాంక్స్ చెప్పి అంటీలవైపు చేతులు జోడించారు .
CM : విశ్వ ముందు పేరెంట్స్ దగ్గరకు పిలుచుకునివెళ్లండి , వారు ముందు , డీజీపీ …. అన్ని రాష్ట్రాల నుండి CM లతోపాటు అమ్మాయిల పేరెంట్స్ రాబోతున్నారని అన్నారుగా , విశ్వ సహాయంతో అన్నీ ఏర్పాట్లూ చెయ్యండి , ఎవ్వరికీ ఏ ఇబ్బందీ కలగకూడదు , విశ్వ ముఖ్యంగా వీరికి ….. , జడ్జి గారూ ….. మీరూ ఇక్కడే ఉన్నారా ? – సెంట్రల్ నుండి మెసేజ్ వచ్చింది ఆ ఇంటర్నేషనల్ డాన్ గాడిని తీసుకెళ్లడానికి ఇంటర్పోల్ వస్తుందని , మనం శిక్షించలేమా ? .
జడ్జి మేడమ్ : రేపే హియరింగ్ అని మెసేజ్ అందింది , నేనైతే అలాంటి తీర్పు ఇవ్వనే ఇవ్వను , మన బిడ్డలను ఏడిపించిన వాడి ఆర్తనాదాలు – ప్రాణభయం మన గడ్డే చూడాలి .
CM : సరిగ్గా చెప్పారు , ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంటుంది , నేను రేపు వస్తాను అంటూ వెళ్లిపోయారు .
విశ్వ సర్ : Yes సర్ ….. , మేడమ్స్ అంటూ చుట్టూ సెక్యూరిటీ ఆఫీసర్ల రక్షణలో బయటకు పిలుచుకునివెళ్లారు .
పేరెంట్స్ అందరూ సంతోషంతో చేతులు జోడించారు , మీకేమీ కాలేదు కదా – మీరు సంతోషంగా ఉండాలి …… అంటూ అంటీల నినాదాలు మారుమ్రోగుతున్నాయి .
అందరి అభిమానానికి అంటీలు ఆనందపర్యంతం అయ్యారు , మేము క్షేమమే కానీ మా ప్రాణసమానమైన మా ప్రాణం లోపల కోలుకుంటున్నాడు , మీ అందరి ప్రార్థనలు – దీవెనలు మహేష్ క్షేమం కోసం అయితే మేము మరింత సంతోషిస్తాము .
మహేష్ మహేష్ మహేష్ …. మహేష్ త్వరగా కోలుకోవాలి అంటూ ఒకేసారి అందరి ప్రార్థనలు .
అంటీల కళ్ళల్లో ఆనందబాస్పాలు ….. , మన వలన హాస్పిటల్లో ఉన్నవారు ఇబ్బందులకు గురికాకూడదు , మీరు ఇంటికివెళితే మరింత సంతోషిస్తాము .
మహేష్ పేరుతోపాటు అంటీల నినాదాలతో హోరెత్తించి , మీ మాటే మాకు వేదం మీరు సంతోషంగా ఉండాలి అని ప్రార్థిస్తూ వెళ్లిపోయారు .
అంటీలు : ఆనందించారు , మహేష్ మహేష్ …. అంటూ లోపలికి వచ్చారు ) .
అక్కయ్యలూ ….. హాస్పిటల్లో నా దేవతలు బాధపడుతూ ఇబ్బందిపడటం నాకిష్టంలేదు , ఏమిచేస్తారో తెలియదు నన్ను ఇంటికి తీసుకెళ్లండి .
అక్కయ్యలు : Ok ok ….. మన ఇంటికా ? – నీ మన ఇంటికా ? .
అంతే కళ్ళల్లో చెమ్మ వచ్చేసింది .
అక్కయ్యలు : యాహూ యాహూ యాహూ …. ఇదిగో ఈ ఆజ్ఞ కోసమే బాధపెట్టాము లవ్ యు లవ్ యు …. , ఆ గుడిసెకు తీసుకెళ్లమని చెప్పి ఉంటే ఆ కన్నీళ్లు మా కళ్ళల్లో ఉండేవి అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుకురిపించారు . తమ్ముడూ తమ్ముడూ ….. నీదేవతలు , అప్పుడే పడుకుండిపోయావన్నమాట అంటూ ముద్దులుకురిపించి నవ్వుకుంటున్నారు .
కళ్ళు మూసుకునే తుడుచుకోవడం చూసి కొడుతున్నారు – గిల్లేస్తున్నారు .
ఒసేయ్ ఒసేయ్ తల్లులూ ….. ఏమిచేస్తున్నారు ఏమిచేస్తున్నారు మిమ్మల్నీ అంటూ వీపు విమానం మోగించి ప్రక్కకు లాగేశారు , ఇందుకే వెళ్ళము అన్నది , అయ్యో అయ్యో ఎలా గిల్లేసారో చూడు చేతులు – బుగ్గలు కందిపోయాయి అంటూ సున్నితంగా స్పృశిస్తున్నారు .
అక్కయ్యలు : అయ్యోరామా ….. చేతులతో రుద్దితే తగ్గుతాయా ? .
అంటీలు : మాకు తెలుసులే అంటూ ముద్దులవర్షమే కురిసింది .
లవ్ యు అంటూ ఓర కంటితో చూసి కన్ను కొట్టాను అక్కయ్యలకు …..
అక్కయ్యలు : తమ్ముడూ …. నిన్నూ అంటూ మళ్లీ కొట్టడానికి వస్తే తోసేశారు , అధికాదే అమ్మలూ …. మేము ముద్దులుపెడితే మూతి ముడుచుకున్నాడు – మీ ముద్దులకైతే ఎలా పరిమళించి మురిసిపోతున్నాడో చూడు .
అంటీలు : మురిసిపోయారు , మా బుజ్జిదేవుడికి మీ ముద్దులు ఇష్టం లేదని తొలిరోజు నుండే చెప్పేసాడు కదా ఎందుకు ఇబ్బందిపెడతారు .
అక్కయ్యలు : ఇన్నిరోజులూ మీ తమ్ముడు మీ తమ్ముడు అన్నారు ఇప్పుడేమో మీ బుజ్జిదేవుడైపోయాడన్నమాట , Ok ok ఎంజాయ్ …. , మురిసిపోయింది చాలుకానీ మీ కొంగులు అంటూ అంటీలు – మేడమ్ చీరలను అందుకుని నా హృదయంపై ఉంచారు , జడ్జి అమ్మ ఇవ్వరా ? .
జడ్జి మేడమ్ : లవ్ టు లవ్ టు , బ్రతికిపోయారు .
అక్కయ్యలు : అమ్మో …..
అంటీలు : ముందు మీరు బయటకువెళ్లండి .
అక్కయ్యలు : తమ్ముడికి …. అదే అదే మీ ముద్దుల బుజ్జిదేవుడికి ఇక్కడ హాస్పిటల్లో ఉండటం ఏమాత్రం ఇష్టంలేదు , ఇంటికి తీసుకెళదాము అమ్మలూ – అంటీ …..
అంటీలు : మీకెలా తెలుసు ? .
అక్కయ్యలు : మా బుజ్జిదేవుడు మా ప్రాణం అని అనడం కాదు , ఒకసారి మీ హృదయాలపై చేతులువేసుకుని మీ భక్తుడివైపు చూడండి .
అంటీలు : అవును తల్లులూ ….. , కొన్నిరోజులైనా …. డాక్టర్ అన్నట్లు ఉదయం వరకైనా డాక్టర్ అందుబాటులో హాస్పిటల్లో ఉంటే ….
అక్కయ్యలు : అయ్యో అమ్మలూ ….. మీ భక్తుడిపై ఉన్న ప్రేమతో తన అక్కయ్యలు డాక్టర్లు అని మరిచిపోతున్నారు .
అంటీలు : కాబోయే డాక్టర్స్ ….. , ఇంకా డాక్టర్స్ కాలేదు .
అక్కయ్యలు : O ……. K కాబోయే డాక్టర్స్ మే అంటూ నవ్వుకున్నారు , తమ్ముడిని ట్రీట్ చెయ్యగలంలే , అవసరమైతే మళ్లీ హాస్పిటల్ కు వస్తే సరిపోతుంది .
లేదు లేదు ఒక్క కాల్ చేస్తే కాల్ కట్ అయ్యేలోపు హాస్పిటల్లోని డాక్టర్లు మొత్తం వచ్చేస్తాము , మీకోసం ప్రాణాలిచ్చేవాళ్ళు లక్షలు కోట్లల్లో ఉన్నారిప్పుడు , అంతకంటే అదృష్టమా అంటూ డాక్టర్ గారు వచ్చారు , గ్లూకోజ్ బాటిల్ కూడా అయిపోయింది హ్యాపీగా తీసుకెళ్లవచ్చు , నాకు తెలిసి మీ ప్రేమలలో మరింత త్వరగా కోలుకోగలడు .
అక్కయ్యలు : అధిమాత్రం 200% కరెక్ట్ డాక్టర్ …..
డాక్టర్ : మీరు కాబోయే డాక్టర్లు అన్నమాట , ఇక నా అవసరం కూడా పడదు అంటూ మెడిసిన్ వివరించి డిశ్చార్జ్ చేసేసారు .
అక్కయ్యలు : థాంక్యూ సో మచ్ డాక్టర్ ….. , విశ్వ సర్ విశ్వ సర్ …. ఇంటికి వెళుతున్నాము .
ఏర్పాట్లు చేస్తాను అంటూ హడావిడిగా బయటకువెళ్లి 10 నిమిషాల తరువాత వచ్చారు రెడీ అంటూ ……
అక్కయ్యలు : అమ్మలూ …. మీ బుజ్జిదేవుడిని ఎత్తుకోండి .
అంటీలు : అంతకంటే అదృష్టమా ….. కానీ నొప్పికలిగిస్తామేమోనని భయమేస్తోంది , విశ్వ సర్ మీరే జాగ్రత్తగా ….. అంటూ నా బుగ్గలపై – నుదుటిపై ముద్దులుకురిపించారు , జాగ్రత్త జాగ్రత్త …..
విశ్వ సర్ ఎత్తి స్ట్రెచర్ పై పడుకోబెట్టి బయటకు తీసుకొచ్చి అంబులెన్స్ లోకి చేర్చారు .
దేవతలూ నాతోపాటు ఎక్కి రెండువైపులా కూర్చున్నారు , తల్లులూ …. ప్లేస్ లేదు గాలి ఆడాలి కదా వెనుక రండి .
అక్కయ్యలు కోపాలు ప్రదర్శిస్తూనే విశ్వ సర్ ఆర్రేంజ్ చేసిన వెహికల్లో కూర్చున్నారు .
ముందూ వెనుక సెక్యూరిటీతో విశ్వ సర్ స్వయంగా అక్కయ్యలు కూర్చున్న వెహికల్ డ్రైవ్ చేశారు , మహేష్ సేఫ్ కదా ? .
అక్కయ్యలు : సెక్యూరిటీ అధికారి సర్ ….. sorry sorry వైజాగ్ సిటీ కమిషనర్ సర్ కంగ్రాట్స్ …..
విశ్వ సర్ : మీకెలా తెలుసు ? .
మాకే కాదు మీ బుజ్జిహీరోకి కూడా తెలుసు అంతా విన్నాము అంటూ వివరించారు .
విశ్వ సర్ : మహేష్ లేచాడా ….. ఎంత గుడ్ న్యూస్ చెప్పారు ? , దేవుడున్నాడు అంటూ మొక్కుకున్నారు , నా సంతోషాన్ని ఆ పేరెంట్స్ – భార్య పిల్లల కంటే ముందుగా మహేష్ తో …..
అక్కయ్యలు : నో నో నో అలామాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చెయ్యకండి కమిషనర్ సర్ , తమ్ముడికి శత్రువు అయిపోవాలనుకుంటే మీఇష్టం , తమ్ముడి దృష్టిలో దేశం – ఫ్యామిలీ ఫస్ట్ తరువాతనే ఎవరైనా ….. , ముందు మీరు మీ ఫ్యామిలీతో పంచుకోండి .
విశ్వ సర్ : మహేష్ ఇష్టమే నాఇష్టం అంటూ డ్రైవింగ్ చేస్తూనే కాల్ చేసి ఆనందిస్తున్నారు , లవ్ యు లవ్ యు , శ్రీమతిగారూ వారితోనే ఉన్నాను , నమ్మవు కదూ అంటూ వాగ్దేవి అక్కయ్యకు మొబైల్ ఇచ్చారు .
అక్కయ్య : Hi అక్కయ్యా ….
” చెల్లెళ్ళూ …. మీరు క్షేమమే కదా , మిమ్మల్ని కలవడానికి వస్తాను అంటే మీకు ఇబ్బంది అని మీ సర్ వద్దన్నారు ”
అక్కయ్యలు : ఉదయం కలుద్దాము అక్కయ్యా …. , హాయిగా పడుకోండి , మేమూ ఇంటికి వెళుతున్నాము , గుడ్ నైట్ sorry sorry సర్ తో మాట్లాడండి .
విశ్వ సర్ : గుడ్ నైట్ …..
ఇంటికి చేరుకున్నాము .
విశ్వ సర్ ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లారు .
అక్కయ్యలు : కమిషనర్ సర్ ….. మా గదిలో మా గదిలో అంటూ అంటీలవైపు చూసారు , ఏంటి అమ్మలూ కోప్పడడం లేదు , అమ్మో …. కొట్టేలా ఉన్నారు వాసంతి అమ్మ గదిలోనే పడుకోబెట్టండి .
అంటీవాళ్ళు కంఫర్టబుల్ గా పడుకోబెట్టి దుప్పటి కప్పారు .
అక్కయ్యలు : కమిషనర్ సర్ మీరూ వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకోండి .
విశ్వ సర్ : మిమ్మల్ని వదిలి రావద్దు అని మేడమ్ – పిల్లల ఆర్డర్ , కొద్దిసేపటి ముందువరకూ ఇంటి బయట ఇంత ప్రశాంతంగా లేదు , మేడమ్స్ మాటలు వినిపించడంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లారని ఇక్కడ సెక్యూరిటీగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు చెప్పారు , ఇప్పుడు దేశమంతా మీ సెక్యూరిటీనే ముఖ్యం – ఆ అవకాశం నాకు లభించినందుకు గర్వపడుతున్నాను మీరు రెస్టు తీసుకోండి అనిచెప్పి బయటకువెళ్లారు .
అక్కయ్యలు : సర్ …. చలి , పైన ఇళ్లల్లో రెస్ట్ తీసుకోండి .
విశ్వ సర్ : మాకు వెహికల్లో అలవాటే , థాంక్యూ …..
