అన్నయ్య 1742

అట్లాంటి సమయంలో ఒక రోజు ఇంటిలో నేను చీర కట్టుకుని ఉన్నప్పుడు సులోచన లేని సమయం లో మా బావగారు ప్రమోద్ వాళ్ళబ్బాయి చింటూ తోపాటు వచ్చారు. తనని చూసి నేను సిగ్గు పడిపోయాను. తను మాత్రం క్యాసువల్ గా “మీరు కంగారు పడనక్కరలేదు నాకు అంతా తెలుసు దీనిలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు సులోచన అంతా వివరంగా చెప్పింది.” అంటూ “నేను బిజినెస్ టూర్ మీద బెంగుళూరు వెళ్తూ చింటూ ని ఇక్కడ దింపి వెళ్దామని వచ్చాను” అన్నారు. తనకు అంతా తెలుసనే విషయం అవగతమయ్యేసరికి నేను మామూలు పరిస్థితికి వచ్చేశాను. సులోచనకి ఫోన్ చేసి చెప్తే తను వచ్చింది. మర్నాడు కొంచెం “చింటూ అలవాటు పడ్డాక వెళ్ధువు” అంటూ వాళ్ళ అన్నయ్యని ఉంచేసింది. మారూం లోకి వచ్చినప్పుడు “మీరు ఏమీ కంగారు పడకండి ఇప్పుడు మీరు కృష్ణ ప్రియ అని అన్నయ్యకి తెలుసు. మీరు మనిద్దరమూ ఉన్నప్పుడు యెట్లా ఉంటున్నారో అట్లానే మామూలుగా ఉండండి” అంది. ఆ ఈవెనింగ్ తను బలవంతం చేసి మమ్మలనందరినీ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి తీసుకెళ్ళింది. జుట్టు పెరిగిపోవడం తో పోనీ టైల్ వేసుకున్నాను నేను. వైట్ మీద బ్లాకు డిజైన్ ఉన్న సల్వార్ వేసుకున్నాను నేను. చింటూ నావంకే ఆశ్చర్యంగా చూస్తూ ఆడుకుంటున్నాడు. సులోచన ఆంటీ తో ఆడుకోరా అంటూ నామీదకే వదిలింది. మా బావ ప్రమోద్ నన్ను సంభ్రమంగా చూస్తున్నాడు. మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నారు థాయిలాండ్ అంటూ అడిగాడు తను. ఇంకొక నెలలో వెళ్ళాలి అన్నయ్యా అంటూ సమాధానం చెప్పింది సులోచన. మీకేమైనా సపోర్ట్ కావాలంటే అడగండి నేను ఉన్నానని మర్చిపోకండి అన్నాడు ప్రమోద్. ఆ మరునాడు ప్రమోద్ బెంగుళూరు వెళ్ళిపోయాడు చింటూ ని వదిలేసి. వాడేమో నన్ను వదలడం లేదు సులోచన ఆ రోజు ఏదో ఇంపార్టెంట్ పని ఉందని తప్పక వెళ్ళింది ఆఫీసు కి. వాడు నాతోనే ఆడుకుంటూ నన్ను ఆంటీ అంటూ నాతోనే ఉన్నాడు ఆరోజంతా. వాడికి అన్నం తినిపించి నిద్రపుచ్చుదామనుకుంటే వాడు నాప్రక్కనే పడుకుంటాను అన్నాడు. వాడిని నా ప్రక్కలో పడుకోబెట్టుకున్నాను వాడి స్పర్శ నాకో అనుభూతి గా అనిపించింది. ప్రమోద్ రెండు రోజుల్లో వచ్చేశాడు. చింటూ తనతో విజయవాడ వెళ్లనని మారాం చేస్తుంటే నాకు కూడా వాడిని వదిలి ఉండటం కష్టం అనిపించింది రెండు రోజులకే. నేను సులోచనతో చింటూని ఇక్కడే ఉంచెయ్యమను మీ అన్నయ్యతో అన్నాను. తను వాళ్ళ అన్నయ్యతో అరేయ్ అన్నయ్యా! వాడిని ఉంచేయమంటున్నాడు తను నువ్వెళ్ళు లే తనకు కూడా కాలక్షేపంగా ఉంటుంది అంది. సరే అని ప్రమోద్ వెళ్ళిపోయాడు. అప్పటినుండి చింటూ నాకు బాగా అలవాటైపోయాడు. సులోచన కూడా నమ్మలేకపోతోంది వాడు నాకు అంత మాలిమి అయిపోతాడని. చూస్తూ ఉండగానే సర్జరీ డేట్ దగ్గర పడింది. థాయిలాండ్ బయలుదేరాము. ప్రమోద్ కూడా మాతో పాటు వచ్చాడు. మొదటి ఫేజ్ లో బ్రెస్ట్ ఎన్లార్జ్ అవ్వడం కోసం ఆపరేషన్ చేసి తరువాతి ఫేజ్ లో నా పురుషాంగాన్ని తొలగించేసారు. నాలుగు రోజులు మత్తు మందుల ప్రభావంలోనే ఉన్నాను. తరువాత ఫాలో అప్ స్టార్ట్ అయింది. ఒక ఇరవై రోజులకి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసేసారు. ఇప్పుడు నేను కృష్ణని కాదు నా పేరు కృష్ణప్రియ. నాకు శాపం గా పరిణమించిన మగతనాన్ని ప్రక్కన పెట్టి ఆడతనాన్ని సంతరించుకున్న సంపూర్ణమైన ఆడదాన్ని ఇప్పుడు. హైదరాబాద్ తిరిగి వచ్చేశాము.

2 Comments

  1. Waiting for aunty and girls

  2. Miru aunty ite naku reply ivvandi

Comments are closed.